IPS officer Anjana Krishna Vs Ajit Pawar: మనదేశంలో రాజకీయ వ్యవస్థ ఎంత బలంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గొప్ప గొప్ప అధికారులు కూడా రాజకీయ నాయకుల ముందు తలవంచాల్సిందే. వాళ్లు ఏది చెప్తే దానికి రైట్ చెప్పాల్సిందే. అందువల్లే అక్రమాలు జరుగుతుంటాయి. అన్యాయాలు పెరిగిపోతుంటాయి. దారుణాలు చోటుచేసుకుంటాయి. మీడియా కూడా వర్గాలుగా.. వర్ణాలుగా విడిపోవడంతో అసలు నిజం ఏమిటో తెలియకుండా పోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో మార్పు రాకపోగా.. రోజురోజుకు మరింత దిగజారి పోతోంది. అయితే అధికారంలో ఉన్నవాళ్లు అక్రమార్కులకు కొమ్ము కాయడం వల్ల పరిస్థితి దారుణంగా మారుతోంది. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాను ఒక ఊపు ఊపుతోంది. మీడియాలో కూడా ప్రధానంగా కనిపిస్తోంది. అందులో ఒక ఐపీఎస్ అధికారి డిప్యూటీ సీఎం కు చుక్కలు చూపించిన విధానం సంచలనంగా మారింది.
మహారాష్ట్ర సోలాపూర్ ప్రాంతంలో మట్టి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో మహిళ ఐపీఎస్ అధికారి అంజనా కృష్ణ క్షేత్రస్థాయికి వెళ్లారు. అక్కడి మట్టి మాఫియాను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఇంతలోగానే ఆమెకు ఫోన్ వచ్చింది. ” నేను మీకు ఆదేశాలు జారీ చేస్తున్నాను. మీరు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి” అంటూ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆ మహిళ ఐపీఎస్ అధికారికి సూచించారు..అదే సమయంలో ” నేను మీ గొంతు గుర్తుపట్టలేదని” ఆ మహిళా ఐపీఎస్ అధికారి వ్యాఖ్యానించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి ” నేను నీ మీద చర్యలు తీసుకుంటా. నన్ను చూడాలని ఉంది కదా.. నాకు వెంటనే వాట్సప్ కాల్ చెయ్” అంటూ అజిత్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్రమార్కులకు కొమ్ము కాయడం ఏంటి
వాస్తవానికి సోలాపూర్ ప్రాంతంలో మట్టి మాఫియా ఇష్టా రాజ్యాంగా ప్రవర్తిస్తోంది. అడ్డగోలుగా మట్టి దందాకు పాల్పడుతోంది. స్థానికులు ఫిర్యాదు చేయడంతో మహిళా ఐపీఎస్ అధికారి అక్కడికి చేరుకున్నారు. అయితే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టించాల్సిన డిప్యూటీ సీఎం వారికే వత్తాసుగా మాట్లాడటం ఒక్కసారిగా అక్కడి పరిస్థితిని మార్చేసింది. అంతేకాదు ఆ మహిళా అధికారిని డిప్యూటీ సీఎం తీవ్రంగా హెచ్చరించడం.. ఫోన్లలో రికార్డ్ అయింది. ఇది కాస్తా జాతీయ మీడియాలో ప్రధానంగా ప్రసారం కావడంతో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం చేస్తున్న పని ఇది అంటూ మండి పడుతోంది.
View this post on Instagram