LPG Cylinder Rules August 2026: జూలై నెల ముగుస్తోంది. మరి కొద్ది రోజుల్లో ఆగస్టు నెల సమీపిస్తోంది. ఇది ఎప్పటికీ జరిగే పరిణామమే. అయితే ఈసారి వచ్చే ఆగస్టు నెలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇంతకీ ఆ ప్రత్యేకత ఏంటంటే..
ఇరాన్, అమెరికా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా గ్యాస్ .. చమురు విషయంలో విపరీతమైన ఒత్తిడి ఏర్పడింది. యుద్ధం కొద్దిరోజులు ముగియడం.. ఆ తర్వాత మళ్లీ ప్రారంభం కావడం వల్ల అంతర్జాతీయంగా పరిణామాలు వేగంగా మారిపోవడం మొదలైంది. ఈ ప్రభావం భారత్ మీద ప్రత్యక్షంగా.. పరోక్షంగా పడుతోంది. అందువల్లే భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తోంది. కొత్త కొత్త నిబంధనలను తెరపైకి తీసుకొస్తూ ఉంది.
ఇప్పుడు అమెరికా.. ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో సిలిండర్ల విషయంలో ఆగస్టు ఒకటి నుంచి కొత్త నిబంధనలను ప్రభుత్వం తీసుకొచ్చింది.. ఈ నిబంధనలను ఇండేన్, హెచ్ పీ, భారత్ గ్యాస్ కంపెనీల వినియోగదారులు పాటించాల్సి ఉంటుంది.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆగస్టు ఒకటి నుంచి ఎల్ పీజీ ధరలను సవరించే అవకాశం ఉంది. ఇండియన్ ఆయిల్.. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్.. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినెల 1వ తేదీన 5 కిలోలు.. 10 కిలోలు.. 14.2 కిలోలు.. 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ల ధరలను సవరిస్తాయి. ఆ కంపెనీలు ధరలు పెంచే అవకాశం ఉంటుంది లేదా తగ్గించే అవకాశం ఉంటుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా యధాతధంగా ఉంచే అవకాశం కూడా ఉంది.
ముడి చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో ఆగస్టులో ఎల్పీజీ ధరలు పెరుగుతాయని తెలుస్తోంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం హార్మోజ్ జల సంధిలో రవాణాకు అంతరాయం.. ఎర్ర సముద్రం లోనూ ఇవే పరిస్థితులు ఉండడంతో.. ప్రతిరోజు లక్షలాది బ్యారెళ్ల ముడి చమరు రవాణాలో ఆటంకం ఏర్పడుతోంది. దీనివల్ల ఇప్పటివరకు జూలై నెలలో ముడి చమురు ధరలు 40 శాతం పెరిగాయి. జూలై నెలలో దేశంలో ఉన్న అన్ని నగరాల పరిధిలో 10 కిలోల ఎల్పిజి ధరలను సిలిండర్ పై 173 తగ్గించారు. దీంతో వినియోగదారులకు కాస్త ఉపశమనం లభించింది. ఈ ఏడాది కమర్షియల్ సిలిండర్ మీద నెలవారీగా ధర తగ్గించడం ఇదే తొలిసారి. ఫలితంగా 19 కిలోల ఎల్పిజి సిలిండర్ ధర ఢిల్లీలో 2,930, ముంబైలో 2,885.50, చెన్నైలో 3,106, కోల్ కతా లో 3,081.50 ఉంది.
మరోవైపు జూలై నెలలో నగరాల వ్యాప్తంగా 14.2 కిలోల ఎల్పీజీ ధరలు మారలేదు. ఢిల్లీలో 942.. కోల్ కతా లో 968, ముంబైలో 941.50, చెన్నైలో 951.50గా నమోదయ్యాయి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఎల్పిజి సబ్సిడీ పొందాలనుకునేవారు కచ్చితంగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని కంపెనీలు సూచిస్తున్నాయి. తాజా నిబంధనల ప్రకారం ఇప్పటివరకు ఈ కేవైసీ చేయని యూజర్లు.. కచ్చితంగా ఆ పని చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
ఇక ఆగస్టు నెలలో కూడా నాలుగు సిలిండర్ల రీఫిల్ కు ఎల్పిజి సబ్సిడీ నిబంధన కొనసాగుతోంది. ఇటీవల ప్రభుత్వం ఉజ్వల యోజన లబ్ధిదారులకు రాయితీతో కూడిన ఎల్పిజి సిలిండర్ రీఫిల్ లను తగ్గించింది. గతంలో 9 ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్యను నాలుగు కు తగ్గించింది. ఉజ్వల కుటుంబాలు ప్రతి ఏడాది మొదటి నాలుగు రీఫిల్ ల పై ఒక్కో సిలిండర్ కు 300 చొప్పున అంటే.. 1200 వారి ఖాతాలో జమవుతాయి.
ఒకవేళ పైపుల ద్వారా సహజ వాయువు సరఫరా సాగుతూ ఉంటే.. పిఎన్జి కి మారాలనే నిబంధన ఈ ఆగస్టులో కూడా కొనసాగుతుంది. ఒకే కుటుంబానికి వంటగ్యాస్ గా ఎల్పిజి లేదా పిఎన్జి మాత్రమే ఉండాలని ప్రభుత్వం తప్పనిసరిగా నిబంధన తీసుకువచ్చింది. ఒకవేళ పిఎన్జి సౌకర్యం అందుబాటులో ఉంటే.. తప్పనిసరిగా లబ్ధిదారులు పిఎన్జికి మారాల్సి ఉంటుంది.
ప్రాంతాలు మారినప్పుడు ఎల్పీజీ కనెక్షన్లు రద్దు చేయడానికి వర్తించే సాధారణ నిబంధనలతో పాటు పూర్తిగా పిఎన్జికి మారిన తర్వాత ఇండేన్ గ్యాస్.. హెచ్ పీ గ్యాస్.. భారత్ గ్యాస్ కనెక్షన్లను 30 రోజుల వ్యవధిలోగా రద్దు చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
ఈ నెలలో వినియోగదారులు త్వరిత సేవల ప్లాట్ ఫామ్ ల ద్వారా చిన్న ఎల్పిజి సిలిండర్లను ఆర్డర్ చేసుకోవచ్చు. మరోవైపు తక్షణ కనెక్షన్.. ఎక్స్ప్రెస్ డెలివరీ ద్వారా ప్రీమియం ఫ్రీ ట్రేడ్ ఎల్పిజి ఆఫర్ లో భాగంగా భారత్ గ్యాస్ లైట్ జిప్ ను భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రారంభించింది.