Homeఆంధ్రప్రదేశ్‌KCR Focus On AP: ఏపీపై కేసీఆర్‌ ఫోకస్‌.. ప్రజాభిప్రాయం కోసం సర్వే.. సంచలన ఫలితాలు!!  

KCR Focus On AP: ఏపీపై కేసీఆర్‌ ఫోకస్‌.. ప్రజాభిప్రాయం కోసం సర్వే.. సంచలన ఫలితాలు!!  

KCR Focus On AP: కేంద్రంలో నరేంద్రమోదీని గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన కేసీఆర్‌ పార్టీ విస్తరణ పై దృష్టిపెట్టారు. పార్టీపై ఫోకస్‌ చేయకుండా చేస్తున్న కమలనాథులు కేసీఆర్‌ను ఒకవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అయినా అడుగు వేశాం కాబట్టి.. తప్పనిసరై పార్టీ విస్తరణపై దృష్టిపెట్టారు గులాబీ బాస్‌. ఇతర రాష్ట్రాల్లో ఏ పార్టీ కూడా ఆయనకు అనుకూలంగా లేదు. అయినా వేసిన అడుగు వెనక్కి తీసుకోవద్దని మొన్న ఆంధ్రా ఫెయిల్యూర్‌ లీడర్లను బీఆర్‌ఎస్‌ భవన్‌కు పిలిపించుకునని గులాబీ కండువా కప్పారు. ఇప్పుడు ఆంధ్రాలో ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నం ప్రారంభించారు.

KCR Focus On AP
KCR Focus On AP

ఏపపీలో సర్వే..
ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్‌ఎస్‌ను విస్తరించేందుకు సీఎం కేసీఆర్‌ ఫోకస్‌ పెట్టారు. పలువురు లీడర్లకు ఫోన్‌ చేసి పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నారు. అంతే కాకుండా అక్కడి ప్రజలు బీఆర్‌ఎస్‌ గురించి ఏం అనుకుంటున్నారో తెలుసుకునే పనిలో పడ్డారు. దీని కోసం ఏపీలో పలు సర్వేలు చేయిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ గురించి ఏం అనుకుంటున్నారు? కేసీఆర్‌ను ఎలా రిసీవ్‌ చేసుకుంటున్నారు? గతంలో ఆయన చేసిన వివాదాస్పద కామెంట్స్‌ను మరిచిపోయారా? బీసీ, ఎస్సీల స్పందన ఎలా ఉంది? అనే విషయాలపై ఆ సంస్థలు సర్వేలు చేస్తున్నాయి.

ఉద్యమ సమయంలో తీవ్ర పదజాలం..
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ ఏపీ ప్రజలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ‘బిర్యాని అంటే వారికి తెలియదని, ఉలువ చారును తెలంగాణలో పశువులకు వాడుతారని, లంకలో పుట్టినోళ్లు రాక్షసులు అన్నట్టుగానే.. ఏపీ ప్రజలంతా తెలంగాణ వ్యతిరేకులే’ అని కేసీఆర్‌ సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. ఆ వ్యాఖ్యల గురించి ఇప్పుడు అక్కడి ప్రజలు ఏం అనుకుంటున్నారు? వారికి అవి ఇంకా గుర్తున్నాయా ? ఈ తరం యూత్‌ స్పందన ఏంటీ ? అనే కోణంలో అభిప్రాయాలు తీసుకుంటున్నట్టు సమాచారం.

మూడు ప్రాంతాల్లో వేర్వేరుగా..
ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల్లో సర్వేలు ప్రజల అభిప్రాయం కోసం కేసీఆర్‌ రాయలసీమ, ఉత్తరాంధ్ర, అమరావతి చుట్టు పక్కల జిల్లాల్లో సర్వేలు చేయిస్తున్నారు. ప్రధానంగా ఎస్సీ, బీసీ ప్రజల నుంచి ఒపీనియన్స్‌ సేకరిస్తున్నట్టు తెలిసింది. రెడ్లు జగన్‌ పార్టీకి, కమ్మ సామాజిక వర్గం టీడీపీని కాదని ఇతర పార్టీలకు ఓటు వేసే చాన్స్‌ లేదు. అందుకే కేసీఆర్‌ బీసీ, ఎస్సీ సామాజిక వర్గంపై ఫోకస్‌ పెట్టినట్టు గులాబీ లీడర్లు చెబుతున్నారు. ఆ సామాజిక వర్గానికి చెందిన లీడర్లనే బీఆర్‌ఎస్‌లో చేర్చుకునేలా ప్లాన్‌ చేస్తున్నారు.

KCR Focus On AP
KCR Focus On AP

అమరావతిలో ఆగ్రహం..
అమరావతి పరిసర ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత సర్వే జరుపుతున్న సంస్థలకు భిన్నమైన ఫీడ్‌ బ్యాక్‌ వస్తున్నట్టు తెలిసింది. కేసీఆర్‌ పేరు ఎత్తితే అమరావతి చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది. కేసీఆర్‌ తీరుతోనే తాము తీవ్రంగా నష్ట పోయామని వారు చెబుతున్నట్టు సమాచారం. అయితే ఉత్తరాంధ్రకు చెందిన బీసీ, ఎస్సీ ప్రజలు, ఉభయగోదావరి జిల్లాల్లో కేసీఆర్‌పై కాస్త సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది.

ఏపీలో ఎంట్రీ సభ ఎలా?
ఏపీలో నిర్వహిస్తున్న సర్వేలలో వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ బహిరంగ సభకు ప్లాన్‌ చేస్తున్నారు. అయితే ఎప్పుడు నిర్వహించాలి? ఎక్కడ నిర్వహించాలి? అనే అంశాలపై బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌తో కేసీఆర్‌ ఎప్పటికప్పుడూ మాట్లాడుతున్నట్టు తెలిసింది. బీఆర్‌ఎస్‌కు సానుకూలంగా ఉన్న ప్రాంతాల్లోనే సభ నిర్వహించేందుకు కేసీఆర్‌ ప్లాన్‌ చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత సభ నిర్వహించే ప్రాంతం ఫైనల్‌ అవుతుందని సమాచారం.

మొత్తంగా ఫెల్యూర్‌ పొలిటీషియన్స్‌తో ఏపీలో అడుగు పెట్టాలని చూస్తున్న కేసీఆర్‌కు వచ్చే ఎన్నినకల్లో పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular