Homeజాతీయ వార్తలుCongress leader Mukarram Khan: 15 నిమిషాల్లో ఫినిష్ చేస్తా అన్నాడు.. నాలుగేళ్లుగా ఊచలు లెక్కిస్తున్నాడు!

Congress leader Mukarram Khan: 15 నిమిషాల్లో ఫినిష్ చేస్తా అన్నాడు.. నాలుగేళ్లుగా ఊచలు లెక్కిస్తున్నాడు!

Congress leader Mukarram Khan: సుమారు పదేళ్ల క్రితం అనుకుంటా.. రాష్ట్రంలోని ఓ పార్టీకి చెందిన కీలక నేత, ఎమ్మెల్యే.. ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ తనకు 15 నిమిషాల సమయం ఇస్తే హిందువులందరినీ లేపేస్తానని ప్రకటించాడు. దీనిపై అప్పట్లో పెద్ద వివాదమే చెలరేగింది. కేసులు నమోదయ్యాయి. జైలుకు వెళ్లి వచ్చాడు. కానీ, ఆ నేతను, ఆ నేత పార్టీతో ఇక్కడి సెక్యూలర్‌ పార్టీలు భుజానికి ఎత్తుకుని తిరుగుతున్నాయి. ఒకవర్గం ఓట్ల కోసం చెట్టాపట్టాలేసుకుంటున్నాయి. ఇక ఇలాంటి […]

Congress leader Mukarram Khan: సుమారు పదేళ్ల క్రితం అనుకుంటా.. రాష్ట్రంలోని ఓ పార్టీకి చెందిన కీలక నేత, ఎమ్మెల్యే.. ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ తనకు 15 నిమిషాల సమయం ఇస్తే హిందువులందరినీ లేపేస్తానని ప్రకటించాడు. దీనిపై అప్పట్లో పెద్ద వివాదమే చెలరేగింది. కేసులు నమోదయ్యాయి. జైలుకు వెళ్లి వచ్చాడు. కానీ, ఆ నేతను, ఆ నేత పార్టీతో ఇక్కడి సెక్యూలర్‌ పార్టీలు భుజానికి ఎత్తుకుని తిరుగుతున్నాయి. ఒకవర్గం ఓట్ల కోసం చెట్టాపట్టాలేసుకుంటున్నాయి. ఇక ఇలాంటి వివాదమే కర్ణాటకలో 2022లో జరిగింది. హిజాబ్‌ వివాదం నడుస్తున్న సమయంలో కర్ణాటకకు చెందిన నేత ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. నాలుగేళ్లుగా జైల్లోనే ఉంటున్నాడు.

హిజాబ్‌ జోలికొస్తే..
కర్ణాటకలో 2022, ఫిబ్రవరి 17న హిజాబ్ వివాద సమయంలో కాంగ్రెస్ నాయకుడు ముఖరం ఖాన్ హిజాబ్‌కు ఎవడైనా అడ్డుపడితే “15 నిమిషాల్లో ఊచకోత కొస్తాము” అని ప్రకటించాడు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై అప్పటి ప్రభుత్వం స్పందించింది. కేసు నమోదు చేయడంతోపాటు సదరు నేతను అరెస్టు చేసి జైల్లో పెట్టింది. నాలుగేళ్లుగా విచారణ కొనసాగుతోంది.

బెయిల్‌ కోసం కల్బుర్గి బెంచ్కు..
నాలుగేళ్లుగా జైలు ఊచలు లెకి‍్కస్తున్న ముఖరం ఖాన్‌.. తాజాగా తాజాగా కల్బుర్గి బెంచ్‌లో బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్నాడు. అయితే విచారణ జరిపిన న్యాయమూర్తి ఖాన్‌ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మొదటి వ్యాఖ్యలు సామాజిక విభేదాలు కలిగించేలానున్నాయని, బెయిల్ ఇవ్వడం సముచితం కాదని అప్పీల్‌ను తోసిపుచ్చారు.

ఈ తీర్పు రాజకీయ నాయకుల వివాదాస్పద వ్యాఖ్యలపై కోర్టులు సున్నితంగా వ్యవహరిస్తాయని తెలియజేస్తోంది. సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే మాటలు శిక్షకు దారితీస్తాయని స్పష్టం. ఖాన్ కేసు ఇతర రాజకీయ వాగ్వాదాలకు మార్గదర్శకంగా మారవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper