Karnataka High Court
Karnataka High Court: ఒక మహిళ పురుషుడితో ఆరేళ్ల పాటు జీవితం కొనసాగించి ఆ తరువాత ఆ పురుషుడు బలవంతంగా శృంగారం చేసినా అది తప్పు కాదని కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తితో ఆరేళ్ల పాటు సంతోషంగా జీవించి, అన్ని రకాలుగా అతనితో పంచుకున్న తరువాత ఇప్పుడ తనపై లైంగికంగా దాడి చేస్తున్నారని పెట్టే కేసులను పరిగణలోకి తీసుకోరని కర్ణాటక కోర్టు తెలిపింది. ఏకాభిప్రాయంతో కలిసున్న వారు రోజులు గడిచిన తరువాత వారి మధ్య సాన్నిహిత్యం తగ్గి.. సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవడానికి కోర్టుకు ముందుకు వచ్చే అవకాశం ఉండదని తెలిపింది. ఈ మేరకు తీర్పుకు సంబంధించిన వివరాలను కోర్టు తెలిపింది. ఆ వివరాల్లోకి వెళితే..
కర్ణాటకలోని ఇందిరానగర్ పోలీసులు, దావణగెరెలోని మహిళా పోలీస్ స్టేషన్ లో 2021 లో నమోదైన పిటిషన్ ప్రకారం.. 2013లో ఫేస్బుక్ ద్వారా ఇద్దరు పరిచయం అయ్యారు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తరువాత పురుషుడు తను మంచి చెఫ్ అని మంచి వంటలు చేసి పెడుతానని చెప్పడంతో తరుచూ అతని ఇంటికి ఆమె వెళ్లేది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇది క్రమంగా వారి లైంగిక కలయికకు దారి తీసింది.కొన్ని రోజుల పాటు ఆ మహిళ సదరు వ్యక్తితో మద్యం తాగడంతో పాటు రుచికరమైన ఆహారం తిని సంతోషంగా గడిపింది అని న్యాయమూర్తి తెలిపారు.
అయితే 2021 మార్చి 8న వారిద్దరి మధ్య సంబంధాలు చెడిపోయాయని, ఈ నేపథ్యంలో మహిళ తనకు మోసపూరిత వాగ్ధానాలు చేసి ఆ తరువాత బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఇందిరానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ పిటిషన్ మీద నిందితుడు బెయిల్ తీసుకొని దావణగెరెలో నివసిస్తున్నాడని, అంతేకాకుండా తనపై అత్యాచారానికి పాల్పడ్డారని స్థానిక పోలీస్ స్టేషన్లో మహిళ మరో ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదు చేయించారు. ఈ కేసులో మరో మహిళ పేరు కూడా చేర్చారు. ఈ కేసుపై నిందితుడు సవాల్ చేస్తు కోర్టుకెక్కారు.
ఈ సందర్భగా కేసును విచారించిన న్యాయమూర్తి ఇతర కేసులను ఉదహరిస్తూ తీర్పు చెప్పారు. ‘ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఆరేళ్ల పాటు అంటే 2019 డిసెంబర్ 27 వరకు ఒక వ్యక్తితో అన్ని రకాలుగా సంతోషంగా జీవించి ఆ తరువాత తనతో అనుబంధం తగ్గిపోయిందని పిటిషన్ వేస్తే చర్యలు తీసుకోలేమన్నారు. లైంగిక సంబంధం ఆరేళ్ల పాటు కొనసాగించిన తరువాత పిటిషన్ వేస్తే నిందితునిపై ఐపీసీ సెక్షన్ 376 ప్రకరాం అత్యాచారంగా భావించలేమని అన్నారు. గతంలో తీర్పు వెలువరించి ప్రమోద్ సూర్యభాన్ పవార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో సుప్రీం కోర్టు తీర్పును, కొన్ని ఇతర కేసులను ఉదాహరణగా తీసుకొని ఈ తీర్పు చెప్పారు.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Karnataka high court has issued an interesting verdict
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com