Homeక్రైమ్‌Karnataka News : బిచ్చమెత్తుకొని 30 బస్తాల డబ్బు సంపాదించింది.. తనువు చాలించింది.. చివరికి అదంతా...

Karnataka News : బిచ్చమెత్తుకొని 30 బస్తాల డబ్బు సంపాదించింది.. తనువు చాలించింది.. చివరికి అదంతా ఏమైందంటే..

Karnataka News : ఎప్పుడూ నీళ్లలో ఉండే చేపకు జలుబు చెయ్యదు. అలాగే కొంతమందికి ఎంత డబ్బు కళ్ళ ముందు కనిపించినా.. వారికి ఇంకా కావాలి అనిపిస్తుంది. కాకపోతే అంత డబ్బు సంపాదించినప్పటికీ వారు విలాసాలకు పాల్పడరు. వినోదాలకు ఖర్చు పెట్టరు. రూపాయి రూపాయిని పోగేసుకుంటూనే ఉంటారు. ప్రతి పైసాను లెక్కిస్తూనే ఉంటారు. దాచుకోడాన్ని ఇష్టపడుతూ ఉంటారు. కర్ణాటక రాష్ట్రంలో ఒక సంఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక వృద్ధురాలు వయసు 68 […]

Karnataka News : ఎప్పుడూ నీళ్లలో ఉండే చేపకు జలుబు చెయ్యదు. అలాగే కొంతమందికి ఎంత డబ్బు కళ్ళ ముందు కనిపించినా.. వారికి ఇంకా కావాలి అనిపిస్తుంది. కాకపోతే అంత డబ్బు సంపాదించినప్పటికీ వారు విలాసాలకు పాల్పడరు. వినోదాలకు ఖర్చు పెట్టరు. రూపాయి రూపాయిని పోగేసుకుంటూనే ఉంటారు. ప్రతి పైసాను లెక్కిస్తూనే ఉంటారు. దాచుకోడాన్ని ఇష్టపడుతూ ఉంటారు.

కర్ణాటక రాష్ట్రంలో ఒక సంఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక వృద్ధురాలు వయసు 68 సంవత్సరాల వరకు ఉంటుంది. ఆమెకు నా అనే వాళ్ళు ఎవరూ లేరు. దీంతో యాచించి బతికేది. 68 సంవత్సరాల వయసులో ఆమె ఇంట్లో భారీగా నగదు బయటపడింది. మొత్తంగా 30 బస్తాలలో డబ్బు కనిపించింది. అయితే ఆ డబ్బును ఆమె అత్యంత జాగ్రత్తగా దాచింది. ఆ డబ్బును వాడుకోకుండా అలానే వదిలేసింది. ఆ డబ్బును లెక్కిస్తే మొత్తం 8.40 లక్షలు గా తిరిగింది. మొత్తం 30 బస్తాలలో నోట్ల రూపంలో.. కాయిన్స్ రూపంలో ఆ నగదు దాచి పెట్టింది. అయితే ఆ డబ్బును ఆమె ఉపయోగించుకోకుండానే చనిపోయింది. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మాండ్య జిల్లాలో హూర్ అనే మహిళ వృద్ధాప్య సమస్యలతో ఆదివారం చనిపోయింది.

హూర్ అంత్యక్రియలు నిర్వహించడానికి చుట్టుపక్కల వారు ఇంట్లోకి వెళ్లారు. ఆ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ క్రమంలో అక్కడ పెద్ద బస్తాలలో నగదు కనిపించింది. ఆ నగదు మొత్తం పది రూపాయలు.. 20 రూపాయలు.. 50 రూపాయల నోట్ల రూపంలో ఉంది. వేల సంఖ్యలో కాయిన్స్ కనిపించాయి. మొదట్లో ఆమెకు ఎవరూ లేరని అందరు అనుకున్నారు. అయితే ఆమె తన సోదరితో కలిసి అద్దె ఇంట్లో ఉండేదని తేలింది. అయితే ఆమె చౌదరి రెండు సంవత్సరాల క్రితమే చనిపోయింది. వారిద్దరికీ వివాహం కాలేదు. హూర్ తన జీవితం మొత్తం భిక్షాటన చేసుకుంటూ బతికింది. ఆమె యాచించి పోగుచేసిన నగదును లెక్కిస్తే మొత్తంగా 8.40 లక్షలు గా తేలింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తోంది. అయితే ఈ నగదును మృతురాలి సోదరులకు అప్పగించారు. ఒక సోదరుడు ఆరు లక్షలు తీసుకున్నాడు. మరొక సోదరుడు 2.40 లక్షలు తీసుకున్నాడు. అయితే 2.40 లక్షల తీసుకున్న సోదరుడు ఆ నగదు మొత్తాన్ని ఒక మసీదుకు విరాళంగా ఇచ్చాడు.

” హూర్ పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోయింది. అయితే దాని వెనక కారణాలు ఏంటో మాకు తెలియదు. ఆమె బిక్షం ఎత్తుకుంటూ బతికేది. తన సోదరిని కూడా ఆమె సాకేది. సోదరి చనిపోయిన తర్వాత ఆమె మానసిక స్థితి దిగజారిపోయింది. ఆ మనోవేదనతోనే హుర్ చనిపోయింది.. కానీ ఆమె చనిపోతూ కూడా సోదరులకు అండగా నిలిచింది. అంత డబ్బును వారిద్దరికీ మేము ఇచ్చేశాం. జీవితమంతా ఎటువంటి సుఖాలకు.. సంతోషాలకు నోచుకోకుండానే సాగించింది. ఇప్పుడు ఇలా కన్ను మూసింది. కొన్ని జీవితాలు ఇలా కడతేరిపోతూనే ఉంటాయని” అక్కడి ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper