Chief Minister of Karnataka : వాస్తవానికి ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు జట్టు ఇంతవరకు ట్రోఫీ అందుకోలేదు. ట్రోఫీ అందుకునే అవకాశం మూడుసార్లు వచ్చినప్పటికీ.. దురదృష్టం ఆ జట్టును వెంటాడింది. చివరికి ఇన్నాళ్లకు బెంగళూరు ఫైనల్ వెళ్లిపోయింది. బెంగళూరు చివరి అంచె పోటీకి వెళ్లిన నేపథ్యంలో జట్టు గెలవాలని అభిమానులు చాలామంది కోరుకున్నారు. ఏకంగా పూజలు పునస్కారాలు చేశారు. దిష్టి కూడా తీశారు. ఇక ఐటీ కంపెనీలు అయితే ఏకంగా తమ ఉద్యోగులకు సెలవు కూడా ప్రకటించాయి. ఇక కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ చివరి పోటీలో తమ జట్టు గెలవాలని కోరుకున్నారు. సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా విడుదల చేశారు. వాస్తవానికి ఐపీఎల్ లో తమ జట్టు కోసం ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇలా వీడియో వీడియో విడుదల చేయడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. దానిపై రకరకాల చర్చలు జరిగినప్పటికీ.. అంతిమంగా కర్ణాటక జట్టుకు కప్ రావాలని కోరుకున్న నేపథ్యంలో కన్నడ ఉప ముఖ్యమంత్రి పై సోషల్ మీడియాలో అభినందనలు పెరిగిపోయాయి. ఇటీవల కాలంలో కర్ణాటక రాష్ట్రంలో అధికార ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నది. ఈ క్రమంలో కన్నడ ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కాస్తలో కాస్త సాంత్వన కలిగించాయని అక్కడి రాజకీయ విశ్లేషకులు అంటున్నారంటే.. కర్ణాటక ప్రజలకు తమ జట్టు అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు.
ఇక డీకే శివకుమార్ వీడియో విడుదల చేసిన తర్వాత.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఎందుకంటే సిద్ధరామయ్య తన అధికారిక నివాసానికి వెళ్తున్న సమయంలో.. తన ట్యాబ్లో మ్యాచ్ వీక్షిస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటో సామాజిక మాధ్యమాలలో విపరీతమైన సర్క్యులేట్ లో ఉంది. ట్యాబ్లో బెంగళూరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సిద్ధరామయ్య వీక్షిస్తూ కనిపించారు. ఆయన వ్యక్తిగత సిబ్బంది ఆ సందర్భాన్ని ఫోటో రూపంలో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అది కాస్త వైరల్ అయిపోయింది. చివరికి ముఖ్యమంత్రి కూడా ఐపీఎల్ చూస్తున్నారని.. తమ జట్టు గెలవాలని కోరుకుంటున్నారని.. మనదేశంలో క్రికెట్ అంటే సామాన్యులకు, అభిమానులకు మాత్రమే కాదని.. చివరికి ముఖ్యమంత్రి కూడా ఆసక్తేనని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : అయ్యర్ అవుట్.. పంజాబ్ కు కోలుకోలేని షాక్!
“డీకే శివకుమార్ వీడియో విడుదల చేశారు. అది కాస్త సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టించింది. దానిని మర్చిపోకముందే ముఖ్యమంత్రి ఐపీఎల్ మ్యాచ్ వీక్షిస్తున్న సందర్భం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. మొత్తంగా బెంగళూరు జట్టుకు అందరూ అండగా ఉన్నారు. ఒక రకంగా ఇది ఐపీఎల్ చరిత్రలో అద్భుతం అని” నెటిజన్లు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. అందరు కలిసి కన్నడ జట్టు విజయానికి కృషి చేశారని.. నెరవేరని కలగా ఉన్న ట్రోఫీని దగ్గరికి చేర్చారని పేర్కొంటున్నారు.