Jyoti Malhotra : కానీ కొందరు దేశంలో ఉంటూనే.. దేశం గాలి పీల్చుతూనే.. దేశం నీరు తాగుతూనే.. దేశం తిండి తింటూనే.. దేశద్రోహం చేస్తుంటారు. తమ విలాసాలకు.. తమ దిక్కుమాలిన అలవాట్లకు దేశాన్ని బలి చేస్తుంటారు. అలాంటి వారి వల్ల దేశంలోని ప్రజలు ఇబ్బంది పడటమే కాకుండా.. దేశ ప్రయోజనాలు సర్వనాశనమవుతుంటాయి
. అందువల్లే వందమంది శత్రువుల కంటే.. ఒక్క దేశద్రోహి ప్రమాదకరమనే నానుడి పుట్టింది. దేశద్రోహులను ఏ స్థితిలో ఉన్నా అసలు వదలకూడదు. దేశద్రోహులు రాచ పుండుతో సమానం. వారి వల్ల ఈ దేశానికి కాదు కదా.. వారిని కన్నవారికి కూడా ప్రయోజనం ఉండదు.
Also Read : ఉగ్రదాడికి ముందు.. జ్యోతి మల్హోత్రా పహల్గాం పర్యటన.. వెలుగులోకి సంచలన నిజం!
అప్పుడు మాధురి
పాకిస్తాన్ కోసం దేశద్రోహిగా మారిపోయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఆమె చేసిన దుర్మార్గం.. పన్నాగం వల్ల పహల్గాం లాంటి దారుణం చోటుచేసుకుందని తెలుస్తోంది. జ్యోతి వల్ల పచ్చటి కాశ్మీరం నెత్తుటి ఏరులాగా మారిపోయింది. పర్యాటకులకు స్వర్గధామం లాగా ఉండే పహల్గాం.. ఇప్పుడు బిక్క చూపులు చూస్తోంది. పర్యాటకులు లేక.. ఉపాధి దొరికే మార్గం లేక స్థానికంగా ఉన్న వ్యాపారులు.. పనులు చేసుకునే కార్మికులు పస్తులు ఉంటున్నారు. పైగా ఉగ్రవాదుల దాడుల వల్ల అక్కడ నిత్యం సైనికుల పహారా సాగుతోంది. దీంతో ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి పర్యాటకులు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు
ఇక ఉగ్రవాద దేశానికి కీలకమైన సమాచారం అందించడానికి దేశద్రోహిగా మారిపోయిన యూట్యూబర్ జ్యోతి ఉదంతానికంటే ముందు మనదేశంలో మరో దారుణం చోటుచేసుకుంది. దాదాపు 15 సంవత్సరాల క్రితం ఈ ఘటన జరిగింది. 2010లో ఐఎఫ్ఎస్ అధికారిగా మాధురి గుప్త పనిచేసేవారు. కీలకమైన హోదాలో ఉన్న ఆమె మన దేశానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఉగ్రవాద దేశానికి చేరవేర్చారు. అప్పట్లో ఉగ్రవాద దేశానికి సంబంధించిన హ్యాండ్లర్ జంషెడ్ తో ఆమె ప్రేమ యాణం కొనసాగించారు. అతనితో సన్నిహిత సంబంధం పెట్టుకున్నారు. చాలా సంవత్సరాలపాటు అతనితో శారీరక సుఖాన్ని అనుభవించారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని భావించడంతో.. జంషెడ్ ఆమె ముందు ఒక ప్రతిపాదన ఉంచాడు. మన దేశానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని ఆమె ద్వారా రాబట్టాడు. చివరికి ఆమెకు హ్యాండ్ ఇచ్చాడు. అయితే నిఘా వర్గాలు మాధురి మీద ఒక కన్ను వేసి ఉంచాయి. చివరికి ఆమె వ్యవహారం బయటపడటంతో అరెస్టు చేశాయి. అనేక విచారణల తర్వాత 2018లో ఆమె బాగోతం బయటపడింది. దీంతో ఆమె ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. జ్యోతి చేసిన ఘనకార్యం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో.. సోషల్ మీడియాలో మాధురి గతంలో పాల్పడిన దేశ ద్రోహానికి సంబంధించిన ఉదంతం మరోసారి వెలుగులోకి వచ్చింది. అయితే అప్పుడు ఇప్పుడు మాధురి, జ్యోతి ఉగ్రవాద దేశానికి సంబంధించిన వారితో ప్రేమలో పడి.. శారీరక సుఖాన్ని అనుభవించి.. దేశద్రోహానికి పాల్పడటం విశేషం.
Also Read : జ్యోతి మల్హోత్రా పై ఏడాది క్రితమే నెటిజన్ కు అనుమానం! కీలక ట్వీట్.. ఇంతకీ అందులో ఏముందంటే?