Thug Life Review : మణిరత్నం(Maniratnam), కమల్ హాసన్(Kamal Haasan|) కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘థగ్ లైఫ్'(Thug Life) వచ్చే నెల 5 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని రీసెంట్ గానే విడుదల చేయగా, దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ చిత్రం లో కమల్ హాసన్ తో పాటు తమిళ యంగ్ హీరో శింబు(Silambarasan TR) కూడా నటించాడు. ఇందులో ఆయన కమల్ కి పెంపుడు కొడుకుగా కనిపించబోతున్నాడు. అయితే సెన్సార్ కి వెళ్లే ముందు ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ కాపీ ని రీసెంట్ గానే కమల్ హాసన్ కొంతమంది సినీ ప్రముఖులకు, మీడియా మిత్రులకు వేసి చూపించాడట. వాళ్ళ నుండి వచ్చిన రెస్పాన్స్ ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
కథ విషయానికి వస్తే కొత్తదనం ఏది లేదట. కమల్ హాసన్ అసాంఘిక పనులు చేసే ఒక క్రిమినల్. అతనికి ఒక ఆపరేషన్ లో ఉన్నప్పుడు చిన్న పిల్లాడు(శింబు) దొరుకుతాడు. ఆ పిల్లాడు కమల్ హాసన్ కి ఎంతో నచ్చి తనతో పాటు పెంచుకుంటాడు. ఆ పిల్లాడు పెరిగి పెద్దయ్యాక కమల్ హాసన్ తో కలిసి ఆ చీకటి సామ్రాజ్యాన్ని ఏలడానికి సిద్ధం అవుతాడు. ఈ గ్యాప్ లో అతనికి ఆ చీకటి సామ్రాజ్యానికి నేనే ఏకైక రాజుని అవ్వాలనే కోరిక పుడుతుంది. ఆ కోరిక కారణంగా తండ్రీకొడుకుల మధ్య ఏర్పడిన సంఘటనలు, ఆ సంఘటనలు వీళ్ళిద్దరిని భద్ర శత్రువులుగా ఎలా మార్చాయి?, చివరికి తండ్రి గెలిచాడా?, లేకపోతే కొడుకు గెలిచాడా అనేది ఆసక్తికరంగా ఉండబోతుంది అట. సినిమా రొటీన్ స్టోరీ అయ్యినప్పటికీ మణిరత్నం మార్క్ టేకింగ్ అడుగడుగునా కనిపిస్తుందట. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా, ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఈ సినిమా ఉండనుంది అని సమాచారం.
Also Read : మణిరత్నం, కమల్ హాసన్ కాంబోలో వస్తున్న థగ్ లైఫ్ బడ్జెట్ ఎంతో తెలిస్తే మీ మతి పోతుంది..!
అయితే ఈ చిత్రం క్లైమాక్స్ మాత్రం కనీవినీ ఎరుగని రీతిలో ఉండబోతుందట. ఎవ్వరూ ఊహించలేరట కూడా. ఏమిటి ఆ క్లైమాక్స్ అనేది తెలియాలంటే మరో రెండు వారాలు ఆగాల్సిందే. మణిరత్నం అంటే ఒక బ్రాండ్, ఆయన నుండి ఒక సినిమా విడుదల అవుతుందంటే నటీనటులు ఎవరో కూడా చూడకుండా థియేటర్స్ కి వెళ్లిపోతుంటారు ఆడియన్స్. అలాంటిది ఆయన ఏకంగా ఇప్పుడు కమల్ హాసన్, శింబు లాంటి హీరోలతో కలిసి సినిమా చేసాడు. ఇక అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో మీరే ఊహించుకోండి. తెలుగు లో ఈ సినిమాపై చెప్పుకోదగ్గ అంచనాలు అయితే ఏర్పడలేదు కానీ, హిందీ లో మాత్రం భారీ రేంజ్ లో ఉన్నాయి. మరి ఆ రేంజ్ ని అందుకుంటుందా లేదా అనేది చూడాలి. విక్రమ్ తర్వాత కమల్ హాసన్ చేసిన ‘ఇండియన్ 2’ కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది, ఆ సినిమా తర్వాత రాబోతున్న చిత్రమిది, ఇది హిట్ అవ్వడం కమల్ హాసన్ కి అత్యవసరం అనొచ్చు.