Homeఅంతర్జాతీయంIran war political impact in India: ఇరాన్‌ యుద్ధంలో ఓట్లు ఏరుకుంటున్న విపక్షాలు..

Iran war political impact in India: ఇరాన్‌ యుద్ధంలో ఓట్లు ఏరుకుంటున్న విపక్షాలు..

Iran war political impact in India: ఇరాన్‌ అణు కార్యకలాపాలు ఆపడం లేదని అమెరికా మిడిల్‌ ఈస్ట్‌లో అగ్ని పుట్టించింది. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై దాడులు చేస్తోంది. తొలిరోజు దాడిలోనే సుప్రీం లీడర్‌ అయతుల్లా ఖమేనీ మరణించాడు. దీంతో ఇరాన్‌ కూడా ప్రతిదాడులు తీవ్రతరం చేసింది. అమెరికాకు అండగా నిలిచిన సున్నీ జనాభా అధికంగా ఉండే గల్ఫ్‌ దేశాలపై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్‌ ప్రధాని కార్యాలయాన్ని అటాక్‌ చేసింది. ఇక సౌదీ అరేబియాలోని ఆరామ్‌కో రిఫైనరీపై దాడిచేసింది. దీంతో ఆయిల్‌ ఉత్పత్తి, శుద్ధి నిలిచిపోయాయి. మరోవైపు ఆర్మూజ్‌ జలసంధి మూసివేసింది. ఈ క్రమంలో కేంద్రం గల్ఫ్‌ దేశాల్లోని భారతీయలను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే చాలా మందిని స్వదేశానికి రప్పించింది. యుద్ధం నేపథ్యంలో దేశంలో ఆయిల్‌ సంక్షోభం తలెత్తకుండా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ తరుణంలో దేశంలోని విపక్ష పార్టీలు లౌకికవాదం ముసుగులో మోదీ టార్గెట్‌గా కేంద్రంపై విమర్శలు చేస్తున్నాయి.

ఖమేనీ హత్యపై ప్రకటన చేయాలి డిమాండ్‌..
ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీని అమెరికా చంపేసిందని దీనిని ప్రధాని మోదీ ఖండించాలని కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియాగాంధీ డిమాండ్‌ చేశారు. ఒక దేశా అధినేతను చంపితే మోదీ అమెరికాకు లొంగిపోయి మౌనం పాటిస్తున్నాడని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఇజ్రాయెల్, అమెరికా యుద్ధాన్ని ఖండించాలని డిమాండ్‌ చేశారు.

ఇదంతా ఎవరి కోసం..
ఖమేనీ హత్య తర్వాత ప్రపంచ వ్యాప్తంగా షియాలు నిరసన తెలిపారు. భారత దేశంలోని జమ్మూ కశ్మీర్‌లో, మిగతా కొన్ని ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు తీశారు. జమ్మూ కశ్మీర్‌లో ర్యాలీ ఉద్రికతతకు దారితీసింది. అయితే విపక్షాలు ఈ ర్యాలీలకు మద్దతు తెలిపాయి. అయితే ఇదంతా ఎందుకుం అంటే తమ ఓటు బ్యాంకు అయిన ముస్లింల కోసమే. ఇరాన్‌ యుద్ధం సాకుతో ముస్లింలకు అండగా ఉండడంతోపాటు మోదీని టార్గెట్‌ చేయడం ద్వారా తమ ఓటు బ్యాంకు బలపడుతుందని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తోపాటు వామపక్షాలు, ఇతర ప్రాంతీయ విపక్ష పార్టీలు భావిస్తున్నాయి.

Also Read: చమురు సంక్షోభం.. భారత్‌ అధిగమించే మార్గాలివే!

దేశంలో షియాలు 15 శాతమే..
అయితే విపక్షాలు గమనించాల్సింది ఏమిటంటే.. ఈ యుద్ధం మొదట ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్‌ మధ్య మొదలైంది. కానీ, తర్వాత ఇరాన్‌ సున్నీలను టార్గెట్‌ చేస్తూ గల్ఫ్‌ దేశాలపై దాడులు చేయడంతో ఇప్పుడు సున్నీలు, షియాల మధ్య యుద్ధంగా మారింది. మన దేశంలో ముస్లిం జనాభాలో 85 శాతం సున్నీలే. షియాలతోపాటు మిగతా చిన్నచిన్నచిన్న ఇస్లామిక్‌ మతాలు కలిపి 15 శాతం ఉన్నాయి. షియాలకు మద్దతు తెలుపుతున్న దేశంలోని విపక్ష పార్టీలు. 85 శాతం ఉన్న సున్నీలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నామన్న విషయాన్ని విస్మరిస్తున్నాయి.

కేరళ, అస్సాం, బెంగాల్‌ ఎన్నికలపై ప్రభావం..
త్వరలో దేశంలోని కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. బెంగాల్, అస్సాం, కేరళ రాష్ట్రాల్లో ముస్లిం జనాభా ఎక్కువ. ఇందులోనూ సున్నీలే 90 శాతం విపక్షాలు షియాలకు మద్దతుగా నిలవడం ద్వారా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సున్నీల ఓట్లు కోల్పోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మోదీ వ్యతిరేక ముస్లింలు మాత్రమే విపక్షాలకు మద్దతు తెలుపుతారని, షియా వ్యతిరేక సున్నీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉండదని పేర్కొంటున్నారు.

మొత్తంగా భారత దేశంలో విపక్షాల తీరు చూస్తుంటే.. యుద్ధం సాకుతో ఓటు బ్యాంకు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అలా కాకుండా దేశం కోసం, అదే సమయంలో తమకు అనుకూలంగా ఉండే అంశాలపై మాట్లాడితే కొంత లబ్ధి కలుగుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular