Homeఎంటర్టైన్మెంట్Star Director supports Puri Jagannadh: నా ఆస్తులు అమ్ముకుని నీ అప్పులు తీర్చుకో!.. పూరి...

Star Director supports Puri Jagannadh: నా ఆస్తులు అమ్ముకుని నీ అప్పులు తీర్చుకో!.. పూరి కోసం స్టార్ డైరెక్టర్ గొప్ప మనసు…

Star Director supports Puri Jagannadh: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న దర్శకుడు పూరీ జగన్నాథ్…ఇడియట్, పోకిరి లాంటి సినిమాలతో పెను సంచలనాలను క్రియేట్ చేశాడు. సినిమా ఇండస్ట్రీలో తనలాగా చాలా తొందరగా సినిమాలు చేసే దర్శకుడు ఇంకెవరు లేరనెంతలా గుర్తింపును పొందాడు. కొద్దిరోజుల నుంచి ఆయన చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయి. దాంతో ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో ఆయన చాలా క్లారిటిని మైంటైన్ చేస్తున్నాడు. విజయ్ సేతుపతి మెయిన్ లీడ్ […]

Star Director supports Puri Jagannadh: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న దర్శకుడు పూరీ జగన్నాథ్…ఇడియట్, పోకిరి లాంటి సినిమాలతో పెను సంచలనాలను క్రియేట్ చేశాడు. సినిమా ఇండస్ట్రీలో తనలాగా చాలా తొందరగా సినిమాలు చేసే దర్శకుడు ఇంకెవరు లేరనెంతలా గుర్తింపును పొందాడు. కొద్దిరోజుల నుంచి ఆయన చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయి. దాంతో ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో ఆయన చాలా క్లారిటిని మైంటైన్ చేస్తున్నాడు. విజయ్ సేతుపతి మెయిన్ లీడ్ లో చేస్తున్న ‘స్లమ్ డాగ్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను మొదట అనుకున్న రోజుల కంటే చాలా తక్కువ రోజుల్లో తెరకెక్కించారు. అలాగే సినిమా ఔట్పుట్ చూసిన మేకర్స్ బాగుందని హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా ని తొందరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు… పోకిరి సినిమా సక్సెస్ అయిన తర్వాత తన డబ్బులు మొత్తాన్ని తన ఫ్రెండు కాజేశాడు అంటూ పూరి జగన్నాథ్ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ తర్వాత తను ఎలాంటి డిప్రెషన్ లోకి వెళ్లకుండా మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవాలి డబ్బులు ఎక్కువగా సంపాదించాలనే ఉద్దేశ్యంతో సినిమాలను చాలా ఫాస్ట్ గా చేసుకుంటూ తన సత్తా ఏంటో చూపిస్తూ వచ్చాడు.

ఇక అప్పటినుంచి ఇప్పటివరకు తన కెరీర్ లోనే చాలా గొప్ప సినిమాలను చేస్తూ వచ్చాడు… తన ఫ్రెండ్ ఆయన్ని మోసం చేశాడని తెలిసిన వెంటనే డైరెక్టర్ వివి వినాయక్ పూరి జగన్నాథ్ దగ్గరికి వచ్చి నీకు ఏమైనా అప్పులు ఉంటే నా ఆస్తులను అమ్మి కట్టుకో అంటూ అంటూ ఆస్తి పేపర్లు ఇచ్చారట.

Also Read: ఛార్మి కేవలం పూరి జగన్నాథ్ తోనే ఎందుకు సినిమాలు చేస్తుంది..? వాళ్ళిద్దరు మధ్య ఏముంది..?

దాంతో పూరి ఇప్పుడు అవి ఏమీ వద్దు అప్పులు పెద్దగా ఏమీ లేవు ఉన్నవి నేను సెట్ చేసేస్తాను అని చెప్పారట.ఆ సమయంలో వినాయక్ సైతం పూరి జగన్నాథ్ కి కొంతవరకు అండగా నిలిచాడు. వినాయక్ చాలా ఇంటర్వ్యూలో తనకి పూరి జగన్నాథ్ అంటే ఇష్టమని బతికితే ఆయనలాగా బతకాలని చెబుతుంటాడు.

ఎందుకంటే ఆయన ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా ఫ్రీగా తన పని తాను చేసుకుంటు ముందుకు సాగుతాడని అందుకే ఆయనంటే నాకు చాలా ఇష్టమని వినాయక్ చెప్పాడు…నిజానికి పూరి కి ఇంతమంచి స్నేహితుడు ఉండటం నిజంగా ఆయన చేసుకున్న దృష్టమనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper