Uttar Pradesh: నేటి కాలంలో యువతకు స్వేచ్ఛ పెరిగిపోయింది. ఆర్థిక స్థిరత్వం పెరగడం.. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడంతో విచ్చలవిడిగా వ్యవహరించడం పెరిగిపోయింది. చదువు పేరుతో.. ఉద్యోగం పేరుతో కన్నవాళ్ళకు దూరంగా ఉంటున్నవారు.. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా మాయలో పడి అడ్డగోలు పనులు చేస్తున్నారు. ఇన్ని రోజుల వరకు అబ్బాయిలే ఇలాంటి దారుణాలు చేస్తున్నారని అందరూ అనుకునేవారు.. కానీ ఇప్పుడు అబ్బాయిలను మించిపోయారు అమ్మాయిలు.. పైగా సోషల్ మీడియాలో పిచ్చిపిచ్చి గెంతులు వేస్తూ.. అడ్డగోలు పనులు చేస్తూ విమర్శలు పాలవుతున్నారు.
సోషల్ మీడియా పిచ్చిలో పడి పనికిమాలిన పనులు చేస్తున్న వారిలో అమ్మాయిలే ప్రథమ స్థానంలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆమధ్య మహారాష్ట్రలో ఓ అమ్మాయి రీల్స్ చేస్తూ లోయలో పడి చనిపోయింది. కర్ణాటక ప్రాంతంలో ఓ అమ్మాయి తన స్నేహితుడితో కలిసి అటవీ ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ రీల్స్ చేస్తూ.. ఆమె కూడా గాయపడింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు.. కాకపోతే ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా అమ్మాయిలు మారడం లేదు.
ఇప్పటివరకు రహస్య ప్రదేశాలలోనే అమ్మాయిలు రీల్స్ చేసేవారు. ఇప్పుడు ఏకంగా నడిరోడ్డు మీదికి వచ్చేసారు. పైగా అధునాతన దుస్తులు ధరించి.. శరీర భాగాలు కనిపించే విధంగా పిచ్చిపిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో, కాన్ పూర్ హైవే ప్రాంతంలో ఇద్దరు అమ్మాయిలు రెచ్చిపోయారు. పోటాపోటీగా డాన్సులు వేసి రీల్స్ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ వారిద్దరూ నాగిని పాటకు డ్యాన్స్ వేసి.. వివాదానికి దారి తీశారు. అందులో ఒక అమ్మాయి మోడ్రన్ డ్రెస్సులు ధరించి ఉంది. నాగిని పాటకు డ్యాన్స్ చేసే క్రమంలో ఆమె తన శరీరాన్ని పూర్తిగా మర్చిపోయింది. పిచ్చిపిచ్చిగా గంతులు వేసింది. అయితే వారిద్దరూ మద్యం తాగి ఉంటారని.. అందువల్లే జాతీయ రహదారిపై ఇటువంటి పిచ్చి ప్రయత్నం చేశారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఇటువంటి పనుల వల్ల సభ్య సమాజానికి చదువుకున్న యువత ఎటువంటి సందేశం ఇస్తుందో అర్థం కావడం లేదని నెటిజన్లు వాపోతున్నారు. ఇప్పటికైనా ఇటువంటి వారి మీద ప్రభుత్వం నిఘా పెట్టాలని.. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసే వారిని జైల్లో పెట్టాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
उन्नाव : लखनऊ-कानपुर हाईवे पर लड़कियों का डांस
➡बेखौफ होकर गाने पर बीच कर रही डांस
➡रीलबाजी के चक्कर में नियमों की अनदेखी
➡उन्नाव सदर कोतवाली क्षेत्र का मामला#Unnao #Highway #Dance #Violation #Reel @unnaopolice pic.twitter.com/JmwlmVJNDu— भारत समाचार | Bharat Samachar (@bstvlive) January 6, 2026