Former Gujarat CM Vijay Rupani: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి దుర్మరణం పాలయ్యారు. ఈ విషయాన్ని గుజరాత్ బిజెపి అధ్యక్షుడు సిఆర్ పాటిల్ ప్రకటించారు.. మొదట్లో విజయ్ చనిపోలేదని అందరూ అనుకున్నారు. కాని చివరికి ఆయన చనిపోయిన విషయాన్ని పాటిల్ వెల్లడించడంతో.. ఆయన మృతి చెందారని అధికారికంగా తెలిసింది.
విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని ఏబీవీపీ కార్యకర్తగా ప్రారంభించారు. ఏబీవీపీలో విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. ఆ తర్వాత తన రాజకీయ జీవితాన్ని క్రమక్రమంగా మలచుకున్నారు.. ఏకంగా గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మనసును చూరగొన్నారు. వాస్తవానికి విజయ్ రూపాని మయన్మార్ లోని 1956లో రంగూన్ ప్రాంతంలో జన్మించారు. ఆ తర్వాత ఆయన కుటుంబం 1960లో గుజరాత్ రాష్ట్రానికి వలస వచ్చింది. అప్పటికి ఆయన వయసు నాలుగు సంవత్సరాలు. ఆ తర్వాత తన విద్యాభ్యాసాన్ని గుజరాత్ రాష్ట్రంలోనే విజయ్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఏబీవీపీలో చేరారు. సాధారణ కార్యకర్తగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత విద్యార్థి సంఘం నాయకుడిగా ఎదిగారు. చివరికి స్టాక్ బ్రోకర్ గా కూడా పనిచేశారు.
ఏబీవీపీలో కీలక స్థానాలలో పనిచేయడంతో.. ఆయన బిజెపిలోకి రావడం పెద్ద కష్టం కాలేదు. ఏబీవీపీలో కీలక స్థానాలలో పనిచేయడంతో.. బిజెపి పెద్దలతో పరిచయాలు సులభంగానే ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఆయన గుజరాత్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. 2006లో ఇది జరిగింది. 2006 నుంచి 2012 వరకు రాజ్యసభకు సభ్యుడిగా విజయ్ ఉన్నారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత తన నియోజకవర్గంలో అభివృద్ధి ముద్ర వేశారు. తద్వారా సరికొత్త చరిత్ర సృష్టించారు. 2016లో ఎవరూ ఊహించని విధంగా విజయ్ రూపాని ముఖ్యమంత్రి అయ్యారు. నరేంద్ర మోడీ మరో మాటకు చావులేకుండా విజయ్ రూపాని వైపు మొగ్గు చూపించడంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 2016 నుంచి 2021 వరకు నరేంద్ర మోడీ సొంత రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ గా పనిచేశారు. అంతేకాదు గుజరాత్ రాష్ట్రంలో చెరగని అభివృద్ధి ముద్ర వేశారు. ఆయన హయాంలో గుజరాత్ రాష్ట్రంలో వేలాదికోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. ఇక విజయ్ రూపాని లండన్ లో ఉన్న తన కుటుంబ సభ్యులను కలవడానికి ఆయన అభిమానం ఎక్కారు. ఆ విమానం అనుకోకుండా ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో చాలామంది చనిపోయారు. చనిపోయిన వారిలో విజయ్ రూపాని ఉండరని అందరూ అనుకున్నారు. కానీ గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు పాటిల్ విజయ్ రూపాని చనిపోయాడని ప్రకటించడంతో.. ఆయన కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. అయితే ఈ వ్యవహారంపై విచారణ జరిపిస్తామని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. సంఘటన జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలను కేంద్రం వేగవంతం చేసింది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సంఘటనా స్థలంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నారు.