FASTag : సంక్రాంతి పండగ వచ్చిందటే.. తెలంగాణలోని సెటిలర్లంతా ఏపీ బాట పడతారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారితోపాటు విదేశీల్లో ఉన్న తెలుగువారుసైతం ఏపీకి వస్తారు. హైదరాబాద్ 60 శాతం ఖాళీ అవుతుంది. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ నేపథ్యంలో పండక్కి ఊరెళ్లేవారు టోల్ ప్లాజాల వద్ద జాప్యం జరగకుండా ఉండేందుఉ ఫాస్టాగ్ తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. లేదంటే రద్దీవేళ చాలా సమస్యగా మారుతుంది. నగదు అయిపోయి ఉంటే వెంటనే రీచార్జి చేసుకోవాలి. టోల్ ప్లాజాకు వచ్చాక బ్యారియర్ పైకి లేపకపోవడంతో ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్‌లో పడిందని తెలుసుకుని వెనక్కి వెళ్లి రెండింతల అదనంగా టోల్ రుసుము చెల్లించాల్సి వస్తుంది. మరికొందరు టోల్ ప్లాజా దగ్గరికి వచ్చాక రీచార్జి చేస్తుంటారు.
యాక్టివేషన్‌కు సమయం..
టోల్ వద్దకు వచ్చాక రీజార్జి చేస్తే యాక్టివేషన్ కావడానికి 15 నిమిషాల సమయం పడుతుంది. నెట్‌వర్క్ సమస్య ఉంటే ఇంకా ఎక్కువ సమయం పడుతుంది రద్దీవేళ ఇది చాలా సమస్యగా ఉంటుంది. నగదు అయిపోయి ఉంటే వెంటనే రీచార్జి చేసుకోవడం వలన ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే ఇంటి నుంచి బయల్దేరే సమయంలోనే ఫాస్టార్‌లో బ్యాలెన్స్ చెక్‌చేసుకోవడం మంచింది. ఇదిలా ఉంటే ఫాస్టాగ్ మినిమం బ్యాలెన్స్‌ను ఎన్‌హెచ్‌ఏఐ 2020, ఫిబ్రవరిలో ఎత్తేసింది. కానీ, కొన్ని బ్యాంకులు రూ.100 నుంచిరూ.200 బ్యాలెన్స్ నిబంధన ఇప్పటికీ అమలు చేస్తున్నాయి. మినిమం బాయలెన్స్ నుంచి టోల్ రుసుం కట్ అయితే మైనస్ బ్యాలెన్స్‌లోకి వెల్లి కొన్ని మస్యలు వస్తాయని టోల్ సిబ్బంది పేర్కొంటున్నారు.
ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా…
ఫాస్టాగ్ చెక్‌చేసుకుని బయల్దేరితే మధ్యలో ట్రాఫిక్ సమస్య ఉండదు. ఏ ఒక్క వాహనం టోల్ ప్లాజా వద్దకు వెళ్లాక ఆగినా మిగతా వారు ఇబ్బంది పడతారు. దీంతో గొడవలు కూడా జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గంటల తరబడి టోల్ వద్ద వేచి ఉండాల్సి వస్తుంది. అందుకే చిన్నపాటి జాగ్రత్తతో పండగ ప్రయాణం సాఫీగా సాగిపోతుంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Those traveling to the festival must check their fastags to avoid delays at toll plazas
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com