Fastag: హైవేలపై టోల్ చెల్లించడానికి ఫాస్టాగ్ వ్యవస్థను కేంద్రం అమలులోకి తెచ్చింది. వాహనాలు ఎక్కువ సేపు నిలిచి ఉండకుండా ఈ విధానంలో టోల్(Toll) వసూలు చేస్తోంది. ఎప్పటికప్పుడు ప్రయాణికుల కోసం మార్పులు చేర్పులు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త నియమాలను అమలులోకి తెచ్చింది. టోల్ ప్లాజాల(Toll Plaza) వద్ద రద్దీని నివారించడమోల భాగంగా ఫాస్టాగ్ విధానంలో ఆన్‌లైన్ పద్ధతిలోనే టోల్ వసూలు చేస్తోంది. కొత్త నిబంధనలతో టోల్ వసూలు వేగవంతం అవుతుంది. అదే సమయంలో వాహనదారులకు కూడా కొన్ని ఇబ్బందులు ఎదురు కానున్నాయి. గతంలో ఫాస్టాగ్(Fastag) ఖాతాలో తగినంద బ్యాలెన్స్ లేకపోతే.. టోల్ బూత్‌లో రీచార్జ్ చేసుకునే అవకాశం ఉండేది. ఇకపై అది సాధ్యం కాదు. కొత్త నిబంధనల ప్రకారం టోల్‌ప్లాజా దాటక ముందు గంటసేపు ఫాస్టాగ్ పనిచేయకపోయినా.. బా‍్యలెన్స్ లేకపోయినా.. టెల్ చెల్లింపును రిజక్ట్ చేస్తారు. టోల్ బూత్ నుంచి వెళ్లన 10 నిమిషాల్లోపు ఫాస్టాగ్ పనిచేయకపోతే లేదా బ్లాక్ లిస్ట్‌లో ఉంటే.. లావాదేవీలను తిరస్కరిస్తారు. ఇలా జరిగితే రుసుముకన్నా రెట్టింపు జరిమానా విధిస్తారు.
మినిమం బ్యాలెన్స్…
కేవైసీ పూర్తి కాకపోవడం, పెండింగ్‌లో ఉన్న ధ్రువీకరణ ప్రక్రియ, వాహన రిజిస్ట్రేషన్ వివరాలలో వ్యత్యాసం కారణంగా ఫాస్టాగ్ బ్లాక్‌లిస్టింగ్ జరుగుతుందని భారత జాతీయ చెల్లింపుల సంస్థ(ఎన్‌పీసీఐ) ప్రకటించింది. ఫాస్టాగ్ ఖాతాలో కనీస బ్యాలెన్స్(రూ.100) లేకపోయినా.. దానిని రీచార్జ్ చేయకపోయినా బ్లాక్ లిస్ట్‌లోకి వెళ్తుంది. బ్లాక్ లిస్ట్‌లో ఉండగానే టోల్ దాటితే ఎర్రర్ కోడ్ 176 గా పరిగణిస్తారు. దీతో జరిమానా పడుతుంది. ఎర్రర్ కోడ్ 176 వచ్చినప్పుడు.. 10 నిమిషాల్లోపు రీచార్జ్/అన్‌బ్లాక్ చేసుకుంటే.. జరిమానా మొత్తం వెనక్కి వస్తుంది. ఈ నేపథ్యంలో యాప్‌లో ‘ఆటో రీచార్జ్’ విధానాన్ని అనుసరించడం మంచిది.