Homeజాతీయ వార్తలుPM Modi- Media: ఎట్టెట్టా.. ఓడితే నడ్డా వేస్టా.. గెలిస్తే మోడీ బెస్టా? ఇదేం పాత్రికేయం...

PM Modi- Media: ఎట్టెట్టా.. ఓడితే నడ్డా వేస్టా.. గెలిస్తే మోడీ బెస్టా? ఇదేం పాత్రికేయం ఆర్కే?

PM Modi- Media: చంద్రబాబుకు భజన చేయవచ్చుగాక… టిడిపి అంటే పడి చచ్చిపోవచ్చుగాక.. కానీ ఆ ఈనాడు కంటే, ఆ సాక్షి కంటే ఆంధ్రజ్యోతి చాలా విషయాల్లో నయమే. ఫస్ట్ పేజీ ప్రయారిటీస్, ప్రజెంటేషన్ కు వంక పెట్టే అవకాశం ఉండదు. బహుశా దాని టెంపర్ మెంట్ అదే. ఆర్కే ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి… పెద్దగా వంకపెట్టే అవకాశం ఉండదు. తను ఫీల్డ్ జర్నలిస్ట్.. కాబట్టి ప్రయారిటీస్ తెలుసు. మొన్నామధ్య మునుగోడు ఫలితం మీద “గెలవడమే పది వేలు” అని సూపర్ హెడ్డింగ్ పెట్టింది. ఇవ్వాలేమో “గుజరాత్ లో కమల్… హిమాచల్ ఢమాల్.. ” అంటూ ఒక థర్డ్ క్లాస్ శీర్షిక పెట్టింది. ఆ ఒక్క శీర్షికతో తన వార్తలను చప్పిడి ఉప్మా చేసింది. కేవలం ఒక ఆంధ్రజ్యోతి మాత్రమే కాదు.. మిగతా మీడియా మొత్తం కూడా నిన్న ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను గుజరాత్ కోణంలో మాత్రమే చూశాయి. మోడీ యాంగిల్ లో మాత్రమే రాశాయి.. ఆ లెక్కలనే పలవరించాయి. దీనిని దమ్మున్న పాత్రికేయం ఎలా అంటారో ఆ యాజమాన్యాలకే తెలియాలి. కమ్యూనిస్టులు, అర్బన్ నక్సలైట్లు, ఇతర మతాల ఫండమెంటలిస్టులు ఎంతసేపు మోడీ కోణంలో దేశంలోని ప్రతి పరిణామాన్ని చూస్తూ ఉంటారు. విశ్లేషిస్తారు. అరుస్తారు. సోషల్ మీడియాలో కరుస్తారు. కానీ బర్డ్ వ్యూలో చూసేందుకు, రాగద్వేషాలు లేకుండా మాట్లాడేందుకు అసలు ఇష్టపడరు.. సరే వాళ్ళ కంటే రాజకీయాలు కావాలి. మోడీ దిగి పోవడం చూడాలి. చైనా వాడు అంతకంతకు ఎదిగిగిపోవడం వాళ్ల కనులకు ఇంపవ్వాలి. కానీ మీడియా కూడా అలాగే ఉండాలా?

PM Modi- Media
PM Modi- jp nadda

ఏం ఉపయోగం

నిన్న ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఆంధ్రజ్యోతి కూడా నాలుగు పేజీల్లో ప్రత్యేక కథనాలు ప్రచురించింది.. కానీ ఏం ఉపయోగం? ఆ ప్రయాస గంగలో కలిసిపోయింది. మునుగోడు ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఇచ్చిన వార్తల్లో విపరీతమైన ఎక్స్పోజర్, టెంపర్ మెంట్ ప్రదర్శించిన ఆ పత్రిక… గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఫస్ట్ పేజీ హెడ్డింగ్ పెట్టడంలో విఫలమైంది. వాస్తవానికి ఎన్నికలు, ఫలితాలు అంటేనే ప్రజాభిప్రాయ కోణంలో చూడాలి. అసలు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు పోలిక ఎక్కడ? వాటి మధ్య బోలెడు వ్యత్యాసం కదా ఉంది! మరి ఆ రెండింటినీ బేరీజు ఎందుకు వేసుకోవడం? ఎందుకు ఈ పిచ్చి పాత్రికేయ మైండ్ సెట్?

అది ఎలాగూ రాయదు

నమస్తే అంటేనే అది గులాబీ “కసి”పాత్రికేయం. రోజూ బోలెడు వ్యతిరేక కథనాలు వండి వార్చుతుంది. మోది మీద టన్నుల కొద్ది ద్వేషాన్ని కుమ్మరిస్తుంది. ఏ పత్రిక కైనా ఎడిటోరియల్ పేజీ ఒకటే ఉంటుంది. కానీ నమస్తే విషయానికి వస్తే ఈమధ్య రెండు పేజీలు ప్రచురిస్తోంది. అందులో మోడీకి వ్యతిరేకంగా రాస్తే చాలు.. అయినప్పటికీ వీసమెత్తు ప్రభుత్వ వ్యతిరేకత తన మీద ప్రభావం చూపించకుండా… మునుపెన్నడూ ఎరగనంత అత్యంత భారీ విజయాన్ని బిజెపి కైవసం చేసుకుంది.. మొన్నటిదాకా గుజరాత్లో బిజెపికి వ్యతిరేక పవనాలు అంటూ రాసుకుంటూ వచ్చిన ఆ పత్రిక… ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియకుండా పోయింది దానికి. మిగతా పార్టీలకు సీన్ లేదు కాబట్టి… వాటి కోణంలో శీర్షిక అక్కర్లేదు.. మరి ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి కోణంలో అసలు అక్కర లేదు. గుజరాత్ కమల్, హిమాచల్ ఢమాల్ సాంకేతికంగా ఈ హెడ్డింగ్ కరెక్ట్ కావచ్చు. కానీ గుజరాత్ కోణం మాత్రమే ఎందుకు చూడాలి. కాంగ్రెస్ కోణమైతే హిమాచల్ లో కమల్, గుజరాత్ లో ఢమాల్ అని ఉండాలి. అదే చీపురు పార్టీ కోణంలో అయితే గుజరాత్ లో ఉనికి… హిమాచల్ లో బెణికి అని రాసుకోవాలి.

PM Modi- Media
ABN RK

కొంచెం కూడా లేదా

దేశంలో ఏం జరిగినా మోడీకి, హిందుత్వ విధానానికి, భారతీయ జనతా పార్టీకి ముడిపెట్టి రాసేయడం ఒక ఫ్యాషన్ గా మారింది.. నమస్తే నుంచి అమ్ముడుపోయిన మన తెలంగాణ వరకు ఇదే తంతు.. ఇదే ధోరణి.. పైగా ఈరోజు ఆంధ్రజ్యోతి అప్పర్ డెక్ లో “రెండు కాదు ఒకటి” అంటూ మరో చిరు పైత్యం… దానికి తోడు మోడీ విక్టరీ సింబల్ ను “వీ” ఆకారంలో రెండు వేళ్ళు చూపించడమే జనానికి తెలుసు.. కానీ ఒకటి గుజరాత్ రిఫ్లెక్ట్ అయ్యేలా.. మరొకటి హిమాచల్ హైడ్ అయ్యేలా ఒక వేలుతో విక్టరీ సింబల్ ను ఎలా చూపిస్తారో ఆ సెంట్రల్ డెస్క్ ఇన్చార్జికే తెలియాలి. ఇంకా దారుణం ఏంటంటే… మోడీ సొంత రాష్ట్రంలో గెలిచారు. నడ్డా సొంత రాష్ట్రంలో ఓడిపోయారు.. అంటే నడ్డా దేనికి పనికిరాడు అని సర్టిఫికెట్ ఇస్తున్నట్టా? గుజరాత్ విజయంలో అతని పాత్ర లేదా? ఆ మాటకు వస్తే హిమాచల్ ప్రదేశ్ లో మోడీ కూడా ప్రచారం చేశాడు. ఏవేవో అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశాడు.. కొన్నింటిని ప్రారంభించాడు కూడా.. అమిత్ షా కూడా తిరిగాడు… మరి గుజరాత్ విజయంలో మోడీకి భాగం ఉంటే… హిమాచల్ ప్రదేశ్ లో కూడా బాగా ఉన్నట్టే కదా.. హేమిటో ఈ హాఫ్ బేక్డ్ వార్తలు?!

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular