Ranbir Kapoor Shamshera: ఒక సినిమా సక్సెస్/ప్లాప్ ని డిసైడ్ చేసేది కంటెంట్ మాత్రమే కాదు. కథ, కథనం కుదిరినా కొన్ని చిత్రాలు అట్టర్ ప్లాప్ అవుతాయి. అవి రెండు ప్రతి సినిమా విజయంలో కీలకం అయినప్పటికీ… రిలీజ్ అయిన టైం, ప్రేక్షకుల మూడ్, ట్రెండ్, వాతావరణ పరిస్థితులు, క్యాస్ట్ వాళ్ళ లుక్స్ ఇలా అనేక కారణాలు డిసైడ్ చేస్తాయి. థియేటర్లో ఆడిన సినిమాలు ఓటీటీలో ఆడవు. ఓటీటీలో ఆదరణ దక్కించుకుంటున్న చిత్రాలు థియేటర్స్ లో డిజాస్టర్ కావచ్చు. కాబట్టి సినిమా విజయానికి ఒక స్పష్టమైన క్రైటీరియా ఉందని చెప్పలేం.

మహేష్ బాబు అతడు బుల్లితెరపై ఇండస్ట్రీ హిట్. కానీ థియేటర్స్ లో యావరేజ్ రిజల్ట్ అందుకుంది. అతడు ఎన్నిసార్లు టెలివిజన్ లో ప్రసారం చేసినా… మినిమమ్ టీఆర్పీ వస్తుంది. ఇక థియేటర్స్ లో ప్రభంజనం సృష్టించిన కార్తికేయ 2, సీతారామం బుల్లితెరపై కనీస ప్రభావం చూపలేదు. ఈ రామాయణమంతా చెప్పడానికి కారణం… ఒక సినిమా విజయాన్ని అనేక అంశాలు డిసైడ్ చేస్తాయని చెప్పడానికి.
కాగా బాలీవుడ్ స్టార్ హీరో నోటి నుండి ఇదే తరహా కామెంట్ వచ్చింది. ఆయన లేటెస్ట్ మూవీ షంషేరా ప్లాప్ కి కేవలం గడ్డం కారణం అంటున్నారు. రన్బీర్-వాణి కపూర్ హీరో హీరోయిన్స్ గా నటించిన షంషేరా చిత్రంలో సంజయ్ దత్ కీలక రోల్ చేశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ దారుణ పరాజయం మూటగట్టుకుంది. విడుదలైన రెండో రోజే థియేటర్స్ నుండి ఎత్తేసే పరిస్థితి నెలకొంది.

అగ్నిపథ్, బ్రదర్స్ వంటి హిట్ చిత్రాలు తెరకెక్కించిన కరణ్ మల్హోత్రా దర్శకుడు కావడంతో మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రోమోలు కూడా సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకాన్ని కలిగించాయి. థియేటర్స్ లో షంషేరా చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు పెదవి విరిచారు. ఈ చిత్రం ఫస్ట్ షో నుండే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్ర పరాజయంపై తొలిసారి రన్బీర్ స్పందించారు. షంషేరా ప్లాప్ కి ప్రధాన కారణాల్లో గడ్డం కూడా ఒకటి అన్నారు. నా పాత్రకు భారీ కృత్రిమ గడ్డం వాడారు. ఎండలో షూట్ చేస్తున్నప్పుడు అది అసహజంగా, అతికించినట్లు కనిపించేది. గడ్డం నా గెటప్ కి సెట్ కాలేదు. దీంతో రూ. 150 కోట్ల సినిమా పరాజయం పాలైందని చెప్పుకొచ్చాడు.