spot_img
Homeజాతీయ వార్తలుDisha Encounter: దిశ ఎన్‌కౌంటర్‌ బూటకం.. సిర్పూర్కర్‌ కమిషన్‌ సంచలన నివేదిక

Disha Encounter: దిశ ఎన్‌కౌంటర్‌ బూటకం.. సిర్పూర్కర్‌ కమిషన్‌ సంచలన నివేదిక

Disha Encounter: దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ ఒక బూటకమి, కావాలనే నిందితులను పోలీసులు పాయిట్‌ బ్లాక్‌లో కాల్చి చంపారని సుప్రీంకోర్టు నియమించిన సిర్పూర్కర్‌ కమిటీ నివేదిక ఇచ్చింది. 387 పేజీల నివేదికను బాధిత కుటుంబాలకు పిటిషనర్లకు అందించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. నివేదిక సమర్పించిన చాలా రోజుల తర్వాత సుప్రీం దీనిపై స్పందించింది. ఇదే సమయంలో కేసులు తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. నివేదికపై ఎవరికైనా అభ్యంతరాలను హైకోర్టుకు చెప్పాలని సూచించింది. సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదిక కాపీలను ఇరు వర్గాలకు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Disha Encounter
Disha Encounter

మూడేళ్ల క్రితం…
తెలంగాణలో మూడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్ కౌంటర్‌ ఘటన బూటకమని.. ఈ ఘటనపై విచారణ చేపట్టిన సిర్పూర్కర్‌ కమిషన్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు 387 పేజీలతో సుప్రీంకోర్టుకు కమిషన్‌ రిపోర్ట్‌ సమర్పించింది. పోలీసులు కావాలనే నలుగురు నిందితులను ఎన్ కౌంటర్‌ చేశారని సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదికలో పేర్కొంది. పోలీస్‌ మ్యానువల్‌కు భిన్నంగా విచారణ చేపట్టినట్టు తెలిపిన కమిషన్‌.. నిందితుల్లో ముగ్గురు మైనర్లన్న విషయం పోలీసులు దాచారని నివేదికలో వెల్లడించింది. పోలీసులు గాయపడి ఆస్పత్రిలో చేరడం కట్టుకథ అని ఆరోపించింది. ఇక దిశ నిందితుల ఎన్ కౌంటర్‌ కేసును హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీంకోర్టు.. అభ్యంతరాలను హైకోర్టుకు చెప్పాలని సూచించింది. సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదిక కాపీలను ఇరు వర్గాలకు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Also Read: Pawan Kalyan :తెలంగాణ రాజకీయాల్లోకి పవన్ ఎంట్రీ ప్రకటన.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

సజ్జనార్‌కు శిక్ష?
ప్రస్తుత ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్‌ దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌కు నేతృత్వం వహించారు. సిర్పూర్కర్‌ కమిటి నివేదిక ఈ ఎన్‌కౌంటర్‌ బూటకమని తేల్చిన నేపథ్యంలో నాడు సీపీగా ఉన్న సజ్జనార్‌కు శిక్ష పడే అవకాశం ఉంది. దాదాపు ఆరు నెలలపాటు సాగిన కమిటీ విచారణలో సజ్జనార్‌ కూడా పలుమార్లు కమిటీ ముందు హాజరయ్యారు. ఆయనతోపాటు ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను, గాయపడినట్లు ఆస్పత్రిలో చేరిన పోలీస్‌ కానిస్టేబుల్‌తోపాటు వైద్యం చేసిన డాక్టర్లను కమిటీ విచారణ చేసింది. అన్ని వివరాలు సేకరించిన తర్వాతనే సుప్రీం కోర్టుకు నివేదిక అందించింది. ఈ ఎన్‌కౌంటర్‌ ఫేక్‌ అని, నిందితులను పట్టుకొచ్చి పాయింట్‌ బ్లాక్‌లో కాల్చరని కమిటీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ నివేదికపై హైకోర్టులో విచారణ జరుగనుంది. అయితే ఉద్యోగానికి, హోదాకు వన్నె తెచ్చే అధికారిగా గుర్తింపు ఉన్న సజ్జనార్‌కు ఇది మాయని మచ్చ. విచరణలో నేరం రుజువు అయితే సజ్జనార్‌ జైలుకు వెళ్లక తప్పదు.

Disha Encounter
Disha Encounter

బాధిత కుటుంబాలకు పరిహారం..
ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన నలుగురు నిందితుల కుటుంబాలకు కూడా ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈమేరకు బాధిత కుటుంబాలు కోర్టును కోరే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్‌కౌంటర్‌ తర్వాత నిందితుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గత సంఘటన గురించి మాట్లాడేందుకు కూడా నిందితుల కుటుంబ సభ్యులు ఇష్టపడడం లేదు. కానీ ఎన్‌కౌంటర్‌ మాత్రం బూటకమని మొదటి నుంచి చెబుతున్నారు. ఈ క్రమంలో తమ పరిస్థితిని కోర్టు దృష్టికి తీసుకెళ్లి ఆర్థికంగా ఆదుకోవాలని, ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించాలని వేడుకునే అవకాశం ఉంది. ఒక్కో నిందితుడికి రూ.కోటి వరకు పరిహారం అడిగే అవకాశం ఉన్నట్లు నిందితుల తరఫు న్యాయవాది తెలిపారు.

Also Read: YCP- Bendapudi Students: ఆ విద్యార్థుల ప్రతిభను వైసీపీ భలే క్యాష్ చేసుకుంటోంది

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Sonam Wangchuk

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...
Allu Arjun

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...
Pakistan Economy

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Jana Nayagan Movie

Jana Nayagan Movie: జన నాయకుడు మూవీ నుంచి తప్పించుకున్న స్టార్ డైరెక్టర్…

Jana Nayagan Movie: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న నటీనటులు చాలామంది ఉన్నారు. అక్కడ హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి దళపతి విజయ్ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్...
Pink Diamond Conspiracy

Pink Diamond Conspiracy: తేలిపోనున్న ‘పింక్ డైమండ్’ కుట్ర!

Pink Diamond Conspiracy: 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు చేయని ప్రయత్నం అంటూ...
Oktelugu Epaper