Homeఆంధ్రప్రదేశ్‌Polavaram- Shivalingam: పోలవరంలో బయటపడిన శివలింగం ఏ కాలం నాటిది?

Polavaram- Shivalingam: పోలవరంలో బయటపడిన శివలింగం ఏ కాలం నాటిది?

Polavaram- Shivalingam: ఆంధ్రప్రదేశ్ జీవనాధార ప్రాజెక్టు పోలవరం. దీనిపైనే వారి ఆశలు ఉన్నాయి. కానీ పనుల్లో మాత్రం వేగం కనిపించడం లేదు. దీంతో నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నా కుదరడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా పోలవరం తవ్వకాల్లో ఓ శివలింగం బయటపడింది. దాన్ని పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు. ఇది చాలా ఏళ్ల క్రితందని తేల్చారు. ఇది దాదాపు 12వ శతాబ్ధం నాటిదని ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ తిమ్మరాజు తెలిపారు.

Polavaram- Shivalingam
Shivalingam

800 ఏళ్ల క్రితం గోదావరి గట్టుపై శివాలయాలు ఉండేవని చెబుతున్నారు. అప్పటి దేవాలయాల్లోని శివలింగమే ఇప్పుడు బయటపడిందని తెలుస్తోంది ఇంకా తవ్వితే దేవాలయం కూడా బయట పడుతుందని అధికారులు భావిస్తున్నారు. 1996-2022మధ్య కాలంలో పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో రెండో శతాబ్దం నాటి ఇటుకలు, ఆలయాలు బయటపడినట్లు చెబుతున్నారు.

Also Read: Disha Encounter: దిశ ఎన్‌కౌంటర్‌ బూటకం.. సిర్పూర్కర్‌ కమిషన్‌ సంచలన నివేదిక

పోలవరం ముంపు ప్రాంతంలో దొరుకున్న వాటిని భద్రపరచేందుకు ఓ మ్యూజియం ఏర్పాటు చేయాలని పురావస్తు శాఖ భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. పోలవరం ప్రాంతంలో దొరికిన ఆనవాళ్లను ఒక చోట ఉంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాజమహేంద్రవరం, ఏలూరు రుద్రం కోట వద్ద కొన్ని ప్రాంతాల్లో ఏళ్లనాటి శిథిలాలు బయటపడినట్లు తెలిపారు.

Polavaram- Shivalingam
Shivalingam

పోలవరం ప్రాజెక్టు దగ్గర శివాలయం నిర్మించి ఆ శివలింగాన్ని అందులో ప్రతిష్టించి పూజలు జరిపేందుకు కూడా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. పోలవరం ప్రాంతాన్ని అభివృద్ధి చేసే క్రమంలో దొరికిన పురాతన వస్తువులు ఒక చోట ఉంచి భవిష్యత్ తరాలకు అందించడమే ధ్యేయంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. అందుకే మ్యూజియం ఏర్పాటు ప్రక్రియకు ప్రభుత్వం ఓకే అంటుందో లేక నో చెబుతుందో వేచి చూడాల్సిందే.

Also Read:China Foods: ప్రపంచానికి మరో ఉపద్రవం.. అందరినీ అనారోగ్యానికి గురిచేస్తున్న చైనా ఫుడ్స్‌.. షాకింగ్‌ నిజాలు

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular