Pawan Kalyan :తెలంగాణ రాజకీయాల్లోకి పవన్ ఎంట్రీ ప్రకటన.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

Pawan Kalyan Nalgonda Tour  జనసేన పార్టీని స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో తన పార్టీని విస్తరించారు. కానీ అనూహ్యంగా పవన్ కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితం అయ్యి తెలంగాణకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ చివరి నిమిషంలో తప్పుకున్నారు. ఓసారి అధికార టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చారు. నేరుగా పోటీచేయలేకపోయారు. అయితే తెలంగాణలోనూ పవన్ కళ్యాణ్ కు అశేష అభిమానులు ఉన్నారు. ఆయన రాక కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నా […]

  • Written By: NARESH ENNAM
  • Published On:
Pawan Kalyan :తెలంగాణ రాజకీయాల్లోకి పవన్ ఎంట్రీ ప్రకటన.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

Pawan Kalyan Nalgonda Tour  జనసేన పార్టీని స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో తన పార్టీని విస్తరించారు. కానీ అనూహ్యంగా పవన్ కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితం అయ్యి తెలంగాణకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ చివరి నిమిషంలో తప్పుకున్నారు. ఓసారి అధికార టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చారు. నేరుగా పోటీచేయలేకపోయారు.

అయితే తెలంగాణలోనూ పవన్ కళ్యాణ్ కు అశేష అభిమానులు ఉన్నారు. ఆయన రాక కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నా పవన్ మాత్రం తెలంగాణ రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్ గా లేరు.కానీ ఇప్పుడు తెలంగాణలోనూ పార్టీ పటిష్టతకు దృష్టి సారిస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు.

ఆంధ్రాలోనే కాదు.. తెలంగాణలోనూ తన అడుగులు గట్టిగానే పడుతాయని జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో జనసేన పార్టీ పటిష్టతపై దృష్టి సారించినట్లు ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించిన సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

నల్లగొండకు బయలుదేరిన పవన్ కళ్యాణ్ కు హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ వద్ద జనసైనికులు, పవన్ ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కూడా జనసేన పార్టీ పటిష్టతపై దృష్టి కేంద్రీకరిస్తున్నట్టుగా పవన్ ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులే కీలక పాత్ర పోషించారని.. జనసేనకు వాళ్లే బలం అని పవన్ అన్నారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జనసేన కార్యకర్త కొంగరి సైదులు కుటుంబాన్ని పరామర్శించి 5 లక్షల ఆర్థికసాయాన్ని పవన్ అందజేశారు. కోదాడలో మరో కార్యకర్త శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించి రూ.5 లక్షల చెక్ అందించారు.

ఏపీలోనూ చనిపోయిన జనసైనికులను పవన్ కళ్యాణ్ ఆదుకుంటున్నారు. కౌలు రైతుల కుటుంబాలకు రూ. 1 లక్షచొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలోనూ పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం చేస్తూ ఉదారత చాటుకుంటున్నారు. పరామర్శలతో ప్రజల్లో పవన్ కళ్యాణ్ మంచి పేరు, పరపతి వస్తోంది. పవన్ లోని మానవత్వానికి ప్రశంసలు కురుస్తున్నాయి. అదే బలమైన ఓటు బ్యాంకుగా మారడం ఖాయమంటున్నారు.

తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఇక్కడ కూడా పార్టీ బలోపేతంపై పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఉన్నారని అర్థమవుతోంది. తెలంగాణలోనూ బీజేపీతో పొత్తుతో పవన్ ముందుకెళితే మంచి అవకాశాలు ఉంటాయి. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఉన్న జనసైనికులను ఎన్నికల్లో నిలబెట్టే యోచనలో పవన్ ఉన్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే పవన్ తెలంగాణలో పర్యటనలు పెట్టుకుంటున్నట్టు సమాచారం.

పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ కు పెద్ద షాకింగ్ గా మారింది. ఎందుకంటే బీజేపీ బలం దక్షిణ తెలంగాణలో లేదు. ఇంకొన్ని నియోజకవర్గాల్లోనూ లేదు. ఇప్పుడు పవన్ వస్తే జనసేనకు సీట్లు రావడంతోపాటు బీజేపీకి బలం చేకూరుతుంది.తద్వారా ప్రభుత్వ వ్యతిరేకత ఈ రెండు పార్టీలకు చేరి టీఆర్ఎస్ అధికారానికి దెబ్బ పడుతుంది. అందుకే తెలంగాణ రాజకీయాల్లోకి పవన్ ఎంట్రీ ప్రకటన అధికార టీఆర్ఎస్ కు ఖచ్చితంగా షాకింగ్ అనే చెప్పొచ్చు.

Read Today's Latest Ap politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు