spot_img
Homeజాతీయ వార్తలురైతులతోపాటు దీక్ష చేయనున్న ఢిల్లీ సీఎం.. ఎప్పుడంటే?

రైతులతోపాటు దీక్ష చేయనున్న ఢిల్లీ సీఎం.. ఎప్పుడంటే?

arvind kejriwal
కేంద్ర ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ సంస్కరణ పేరిట కొత్తగా మూడు చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాలను రద్దు చేయాలంటూ గత కొద్దిరోజులుగా ఢిల్లీలో రైతులు దీక్షలు చేస్తున్నారు. పంజాబ్.. హర్యానా.. యూపీకి చెందిన రైతులలు ఢిల్లీలో దీక్షలు చేస్తున్న సంగతి తెల్సిందే..!

Also Read: కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్.. అయోమయంలో ‘బండి’..!

ఈక్రమంలోనే రైతులకు మద్దతుగా డిసెంబర్ 8న భారత్ బంద్ కు రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపి విజయం చేశాయి. పలుమార్లు కేంద్రం రైతుల సంఘాల నాయకులతో చర్చలు జరిపినా ఫలితం రావడం లేదు.

ఇప్పటికే రైతులకు రాజకీయ పార్టీలతోపాటు ప్రముఖ వ్యక్తులు.. సినీ సెలబ్రెటీలు రైతులకు మద్దతు ప్రకటించారు. ఢిల్లీలో రైతులు చేపడుతున్న దీక్షలకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీ వాల్ ఇప్పటికే మద్దతు ప్రకటించిన సంగతి తెల్సిందే. భారత్ బంద్ సమయంలోనూ ఢిల్లీ సీఎంను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.

Also Read: బీజేపీకి బంపరాఫర్ ఇస్తున్న కేసీఆర్.. వ్యూహంలో భాగమేనా?

ఇదిలా ఉంటే సీఎం అరవింద్ క్రేజీవాల్ మరోసారి రైతు దీక్షల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. సోమవారం ఒక్కరోజు రైతులకు మద్దతుగా ఢిల్లీ సీఎం నిరాహార దీక్షలో పాల్గొనబోతున్నట్లు తాజాగా ప్రకటించారు.

సోమవారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రైతులు నిర్వహించే దీక్షలో తాను పాల్గొనబోతున్నట్లు అరవింద్ క్రేజ్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అయితే కేంద్రం పలుమార్లు రైతులతో చర్చలు జరిపినా ఫలితం రాకపోవడం గమనార్హం.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Venkatesh Kalyan Ram Movie

Venkatesh Kalyan Ram Movie: అనిల్ రావిపూడి కి తెలియకుండా వెంకటేష్ – కళ్యాణ్ రామ్ ఎంజాయ్ చేస్తున్నారుగా…

Venkatesh Kalyan Ram Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలను చేస్తూ...
Bigg Boss Telugu

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ ఆఫర్ పై జబర్దస్త్ బ్యూటీ హాట్ కామెంట్స్.. ఈ...

Bigg Boss 10 Telugu: సెప్టెంబర్ 6 న ఇండియా వైడ్ గా అన్ని భాషలకు సంబంధించిన బిగ్ బాస్ సీజన్స్ గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్...
Nagarjuna

Nagarjuna: నాగార్జున కొడుకుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడా…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చిన వాళ్ళలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను మైమరపింపజేసిన ఆయన ఇతర ఇండస్ట్రీలో నుంచి ఎదురయ్యే...
Oktelugu Epaper