BJP : ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి.. ప్రభుత్వం కొలువదీరింది. రేఖా గుప్త ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలయ్యాయి.. అసలు ఢిల్లీలో బీజేపీ గెలుపునకు కారణం ఏంటన్న ప్రశ్న నెలకొంది. ఇండియా కూటమి కలిసి ఉంటే బీజేపీ గెలిచేది కాదన్న వాదనలో నిజమెంత?
ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్తానాల్లో 34 సీట్లలో బీజేపీకి మెజార్టీ ఉంది. ఇందులో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ ఓట్లు కలిపినా బీజేపీ ఇక్కడ విజయం సాధించింది. ఇక 18 స్థానాల్లో మాత్రమే బీజేపీ కన్నా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లు కొంచెం ఎక్కువగా ఉన్నాయి.

బీజేపీ నాయకులు తమ సుదృఢమైన నాయకత్వం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందారు.పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసింది, ఇది ప్రజలకు నచ్చింది.బీజేపీ సమర్థవంతమైన ఎన్నికల వ్యూహాలను అనుసరించింది, ఇది విజయంలో కీలక పాత్ర పోషించింది.
ఢిల్లీలో బీజేపీ గెలుపుకు ప్రధాన కారణాలేంటి? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.