జాతీయ వార్తలుజైలులో పెరోల్ వద్దంటున్న చిన్నమ్మ శశికళ

జైలులో పెరోల్ వద్దంటున్న చిన్నమ్మ శశికళ


మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి, చిన్నమ్మగా పిలువబడే శశికళ బెయిల్ పై బయటకు పంపడానికి అధికారులు సిద్ధంగా ఉన్నా, ఆమె మాత్రం జైలులోనే ఉంటానని అంటున్నట్లు చెబుతున్నారు. తమిళ రాజకీయాలలో చక్రం తిప్పడం కోసం మొదట్లో బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కోర్టులు అంగీకరించలేదు.

కానీ ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా ఖైదీలను ఉదారంగా బెయిల్ పై బయటకు పంపుతున్నారు. కానీ ఆమె జైలు లోపలనే తగు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకొంటూ గడపడానికి ఇష్ట పడుతున్నారు. బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఆమె ప్రస్తుతం వదినమ్మ ఇలవరసి, అబ్బాయి సుధాకరన్‌ లతో కలసి ఉండడం తెలిసిందే.

కరోనా కలవరం రెట్టింపు కావడంతో జైలులో మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటిస్తున్నారు. ఆమెను పేరోలపై బయటకు తీసుకు రావడానికి మక్కల్‌ మున్నేట్ర కళగం పార్టీ వర్గాలు ప్రయత్నం చేసినా ఆమె తిరస్కరించారు. ప్రస్తుత పరిస్థితులలో ఆమె ఉంటున్న జైలు నుంచి 1,112 మంది ఖైదీలు తాత్కాలిక బెయిల్, పెరోల్‌ మీద వెళ్లడంతో జైలులో దాదాపుగా అనేక గదులు, పరిసరాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

భోజనం కోసం బారులు తీరాల్సిన పరిస్థితి లేని దృష్ట్యా, తమకు కావాల్సింది తెచ్చుకుని ఆరగిస్తున్నారట. చిన్నమ్మ ఉన్న గదిలో అయితే ఇదివరకు ముగ్గురు ఉండేవారు. వారిలో ఒకరు పెరోల్‌ మీద బయటకు వెళ్లడంతో ప్రస్తుతం శశికళ, ఇలవరసి మాత్రమే ఉంటున్నారు. ఆమె జైలు నుండి బైటకు రాకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి.

ఇప్పుడు బైటకు వచ్చినా రాజకీయంగా తమిళనాడులో చేయగలిగింది ఏమీ ఉండదు. ఇప్పట్లో ఎన్నికలు అంటూ కూడా ఏమీ లేవు. పైగా రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఎటువంటి ప్రభావం చూపలేదు. బైటకు వచ్చిన కాలం మేరకు అదనంగా శిక్ష పూర్తి అయ్యేందుకు జైలులో గడపవలసి వస్తుంది.

వచ్చే సంవత్సరం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగవలసి ఉన్నాయి. ఆ లోపుగా శిక్షాకాలం పూర్తిచేసుకొని బైటకు వస్తే ఎన్నికలలో ప్రభావం చూపవచ్చని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి గత ఏడాదే `సత్ప్రవర్తన’ పేరుతో శిక్షాకాలం పూర్తి చేసుకొని ముందుగా జైలు నుండి బైటకు రావడానికి కర్ణాటలోని కాంగ్రెస్ ప్రభుత్వం సహకారంతో ప్రయత్నం చేశారు. కానీ అంతలో ఆ ప్రభుత్వం అస్థిరత్వానికి గురికావడంతో ఆమె ప్రయత్నాలు ఫలించలేదు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Chennai To Vladivostok: సముద్ర మార్గాలపై చైనా ఆధిపత్యం.. రష్యాతో కలిసి చెక్‌ పెట్టిన భారత్‌!

Chennai To Vladivostok: డ్రాగన్‌ కంట్రీ చైనా.. ప్రపంచంలో రెండో సంపన్న దేశం. మొదటి స్థానం సాధించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా దొడ్డిదారులు కూడా అనుసరిస్తోంది. మరోవైపు ప్రపంచ దేశాలపై...

KTR Kavitha : ఒకే వేదికపై కేటీఆర్, కవిత.. కనీసం పలకరించుకుంటారా?

KTR Kavitha : రాజకీయాలు రక్తసంబంధీకులను కూడా దూరం చేస్తాయి. చివరికి అన్నా చెల్లెలిని కూడా ప్రత్యర్థులుగా మారుస్తాయి. అయితే ఇటీవల కాలంలో రాజకీయాల తీరు మారింది కాబట్టి ప్రత్యర్థుల స్థానంలో శత్రుత్వం...

Most Popular

Delhi Protests

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...
ISI Agents In India

ISI Agents In India: అమాయక హిందువులే పాకిస్తాన్ ఐఎస్ఐ టార్గెట్.. ఎంతటి దుర్మార్గానికి పాల్పడిందంటే..

ISI Agents In India: సరిహద్దుల్లో మారణ హోమం సృష్టిస్తూ ఉంటుంది. మన సైనికులపై దాడులకు పాల్పడుతూ ఉంటుంది. ప్రశాంతమైన మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నకిలీ నగదు.....

13-year-old boy : కమీషన్ ఇస్తేనే పనిచేస్తారా.. 13 ఏళ్ల బాలుడి ప్రశ్నకు కలెక్టర్ కు నోటి మాట...

13-year-old boy : అది కలెక్టర్ కార్యాలయం.. కలెక్టర్.. ఇతర అధికారులు ప్రజల సమస్యలు వింటున్నారు. ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకోవడానికి అక్కడికి వచ్చారు. వారంతా కూడా తమ సమస్యల మీద...

NITI Aayog Rankings : కాలం చెల్లిన గణాంకాలతో నీతి ఆయోగ్ ర్యాంకులు

NITI Aayog Rankings : కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణాయక సంస్థ 'నీతి ఆయోగ్' (NITI Aayog) రాష్ట్రాల ప్రగతిని అంచనా వేసేందుకు విడుదల చేసే నివేదికలు ఎల్లప్పుడూ చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా...

Cockroach Janata Party : చొచ్చుకొచ్చిన బొద్దింకలు.. దిగొస్తున్న బీజేపీ సర్కార్.. ఢిల్లీలో నాటకీయ పరిణామాలు

Cockroach Janata Party : దేశ రాజధాని ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీ నగరంలో పోలీసులు సహజంగానే ఆంక్షలు విధిస్తూ ఉంటారు. అయితే ఈసారి ఆ...