Sriram Rajagopalan : మనదేశంలో కేరళలో లాటరీ టికెట్లు ఏ విధంగానైతే విక్రయిస్తారు.. యూఏఈ లో ఎమిరేట్స్ డ్రా పేరుతో లాటరీ టికెట్లు విక్రయిస్తారు. కాకపోతే యూఏఈ మారక విలువ మన దేశ కరెన్సీ తో పోల్చి చూస్తే కాస్త ఎక్కువ కాబట్టి.. అక్కడ ప్రైజ్ మనీ విలువ అధికంగానే ఉంటుంది. అయితే ఈ టికెట్ ను దేశంలోనే చెన్నై నగరను చెందిన విశ్రాంత ఇంజనీర్ శ్రీరామ్ రాజగోపాలన్ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఆ విషయాన్ని అతడు మర్చిపోయాడు. అయితే లాటరీలో అతని టికెట్ కు ప్రైజ్ మనీ లభించింది. ఇండియన్ మారకంలో అది 225 కోట్లని తేలింది. ఈ ఏడాది మార్చి నెలలో 16వ తేదీన శ్రీరామ్ రాజగోపాలన్ తన పుట్టినరోజు సందర్భంగా లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఆ విషయాన్ని అతడు పెద్దగా పట్టించుకోలేదు. డ్రా లో అతడు కొనుగోలు చేసిన టికెట్ కు అదృష్టం వరించింది. ఫలితంగా 225 కోట్ల నగదు రాజగోపాలన్ సొంతమైంది.
Also Read : ఆ మాజీ మంత్రిని ఉపేక్షిస్తున్న కూటమి!
శ్రీరామ్ 1998లో సౌదీ అరేబియా వెళ్లిపోయాడు. అక్కడే కుటుంబంతో స్థిరపడ్డాడు. ఒక స్థిరాస్తి కంపెనీలో ఇంజనీర్గా అనేక హోదాలలో పనిచేశాడు. అక్కడ పనిచేసినప్పటికీ చెన్నైలోనే ఆస్తులను కూడ పెట్టాడు. చివరికి తన పిల్లల్ని కూడా ఇక్కడే చదివించాడు. అయితే ఇటీవల అతడు తన పదవి నుంచి శాశ్వత వీడ్కోలు తీసుకున్నాడు. ప్రస్తుతం చెన్నై వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. చెన్నై వచ్చే కంటే ముందు మార్చి 16న అతడు తన పుట్టినరోజును పురస్కరించుకొని లాటరి టికెట్ కొనుగోలు చేశాడు. ఆ టికెట్ డ్రాలో సెలెక్ట్ కావడంతో 225 కోట్ల ప్రైజ్ మనీ శ్రీరామ్ రాజగోపాలన్ సొంతమైంది.
ఈ విషయాన్ని ఎమిరేట్స్ డ్రా ప్రతినిధులు రాజగోపాలన్ కు ఫోన్ ద్వారా తెలిపారు. దీంతో శ్రీరామ్ రాజగోపాలన్ ఆనందానికి అవధులు లేవు. ” ఇంత మొత్తంలో డబ్బు వస్తుందని కలలో ఊహించలేదు. ఏదో నా పుట్టినరోజు సందర్భంగా టికెట్ కొనుగోలు చేశాను. అది సెలెక్ట్ అవుతుందని ఊహించలేదు. ఈ స్థాయిలో డబ్బు రావడం ఆనందంగా ఉంది. కాకపోతే ఈ డబ్బులు మా కుటుంబ వృద్ధికి ఉపయోగిస్తాను. చేయాల్సిన పనులు కొన్ని మిగిలి ఉన్నాయి. అవి పూర్తి అయిన తర్వాత.. కొంత డబ్బుతో సహాయ కార్యక్రమాలు చేపడతాను. కొంత డబ్బును దాతృత్వ సంస్థలకు అప్పగిస్తానని” రాజగోపాలన్ వెల్లడించాడు. రాజగోపాలన్ ఇంజనీరింగ్ ఇండియాలోనే చదివాడు. కాకపోతే కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో అతడు 1998లో సౌదీ అరేబియా వెళ్లిపోయాడు. ఇక అక్కడే ఉంటూ డబ్బులు సంపాదించాడు. తన పిల్లల్ని బాగా చదివించాడు. తన కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసుకున్నాడు. చివరికి రిటైర్ అయినప్పటికీ కూడా లాటరీ టికెట్ ద్వారా 225 కోట్లు సంపాదించాడు.