Software Jobs layoffs: Tata Consultancy Service ఇటీవల కొంతమంది ఉద్యోగులను పక్కన పెట్టిన విషయం అందరికీ షాక్ తగిలినట్లు అయింది. దీంతో మిగతా స్టార్టప్ లలో పనిచేసే వారు కూడా ఆందోళనతో ఉన్నారు. తమ ఉద్యోగం ఎలా ఉంటుందో అని మధనపడుతూ ఉంటున్నారు. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పలేని విధంగా మారింది. అయితే ప్రైవేట్ ఉద్యోగం అనేది శాశ్వతం కాదని అందరికీ తెలిసిన విషయమే. కానీ కొంతమంది కొత్తగా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి కాస్త ఆదాయం రాగానే దుబారా ఖర్చు చేస్తూ ఉంటారు. ఇలా చేసేవారు సడన్లిగా జాబ్ పోతే తీవ్ర కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కష్టాలు రాకుండా ఉండాలంటే ముందుగానే కొన్ని రకాల ప్లాన్స్ వేసుకోవాలి. ఈ ప్రణాళికలతో ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఉంటుంది. మరి అవి ఏంటో చూద్దాం..
మొన్నటి వరకు ఉద్యోగం పోయిందంటే ఎంతో బాధపడేవారు. కానీ ఇప్పుడు సంస్థలు ఉద్యోగులను తీసివేయడం సర్వ సాధారణం అయిపోతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం సంస్థలు, కంపెనీల్లో ఉన్నవారు జాగ్రత్తగా విధులు నిర్వహిస్తున్నారు అయితే ఇదే సమయంలో కొందరు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసుకోలేని వారు కూడా కొన్ని రకాల ఆదాయ వనరులను ఏర్పాటు చేసుకోవాలి.
అనుకోకుండా ఉద్యోగం ఊడిపోతే వెంటనే హైరానా పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉద్యోగం పోయిందని బాధపడుతూ కూర్చుంటే సమస్య పరిష్కారం కాదు. అందుకోసం కనీసం 6 నెలల పాటు జీవితం గడిచేలా ముందే ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఈ ఫండ్ ఏర్పాటు చేసుకోలేని వారు ఇప్పటికే మ్యూచువల్ ఫండ్, ఎల్ఐసి వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టినవారు.. వాటిపై రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ రుణం తాత్కాలికంగానే ఉండాలి. అయితే ఇది కేవలం ఇంటి ఖర్చుల కోసం మాత్రమే తీసుకోవాలి.
ఉద్యోగం పోయిన సమయంలో సాధ్యమైనంతవరకు ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా బయట రెస్టారెంట్ ఫుడ్ కట్టేసి.. ఇంట్లోనే సాధారణ ఫుడ్ కు అలవాటు పడాలి. కొన్ని రోజులపాటు ఓటీపీ సబ్స్క్రిప్షన్ ఆఫ్ చేసుకోవడం మంచిది. మొబైల్ కూడా రెండు వాడేవారు ఒకటి మూలన పెట్టుకోవడం బెటర్. విహారయాత్రలకు ప్లాన్ చేయకుండా ఉండాలి. అయితే పిల్లల సరదా కోసం దగ్గరి ప్రదేశాలకు వెళ్లి తక్కువ ఖర్చుతో హాయిగా గడపాలి. ఏదైనా బర్త్డే లేదా చిన్నపాటి పార్టీలు ఉంటే ఇంట్లో వరకు జరుపుకోవడమే మంచిది. ఇలాంటి సమయంలో కొత్త అప్పులు చేస్తే తీరే అవకాశం ఉండదు.
సడలిగా జాబ్ పోతే.. వెంటనే ఆదాయం వచ్చే జొమాటో, స్విగ్గి లాంటి వాటిల్లో పనిచేయడం మంచిది. ఎందుకంటే వీటిలో డైలీ వైస్ ఆదాయం కూడా తీసుకోవచ్చు. అయితే ఓవైపు ఇందులో పనిచేస్తూనే.. మరోవైపు శాశ్వతమైన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉండాలి. ఇక పాత పద్ధతిలో కాకుండా నేటి కాలపు వారితో సమానంగా ఉండే విధంగా శిక్షణ తీసుకోవాలి. ఏఐ లాంటి వాటిల్లో ప్రావీణ్యం పొందుతే కొత్త ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది.