CM Jagan Song: నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతీ అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి జగన్ వెనుక నుంచి మద్దతు ఇస్తూనే ఉంటారు. ఏ అవసరం వచ్చినా వారికి మద్దతు ఇస్తూ వారి అవసరం వచ్చినప్పుడు తీర్చుకుంటుంటారు. ప్రధాని మోడీ విశాఖ వచ్చిన సందర్భంగా జగన్ ప్రశంసల జల్లు కురిపించారు. జన ప్రభంజనాన్ని చూసి మురిసిపోయారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ప్రధాని మోడీ సభకు వచ్చిన అశేష జనవాహినిని చూసి జగన్ ఉప్పొంగారు.

ఉత్తరాంధ్రలో ప్రజాకవి వంగపండు తన రచనలతో జనాన్ని చైతన్యం కలిగించారు. దీంతో ఆయన అర్థరాత్రి స్వాతంత్ర్యం అనే సినిమాలో రాసిన పాట ఏం పిల్లడో ఎళ్దం వస్తవా అంటూ సభకు వచ్చిన జనాన్ని హోరెత్తించారు. తన మాటలతో అందరిని ఆకట్టుకున్నారు. వంగపండు వాడిన పదాలను పలుకుతూ అందరిలో ఉత్సాహం నింపారు. సభకు వచ్చిన వారిని చూసి ఆశ్చర్యపోయారు. ప్రధాని సభకు ఇంత పెద్ద మొత్తంలో జనం హాజరవడం పై సంతోషంగా మాట్లాడారు. జగన్ నోటి వెంట పలికిన మాటలకు ప్రజలు కూడా అంతే స్థాయిలో గోల చేయడం గమనార్హం.
వంగపండు రాసిన ఏం పిల్లడో ఎళ్దం వస్తవా అంటూ పాట అందుకోవడంతో అందరిలో జోష్ పెరిగింది. జగన్ తనదైన శైలిలో మాట్లాడి హుషారెత్తించారు. ప్రధాని మోడీని కూడా అంతే స్థాయిలో ప్రశంసించారు. కేంద్రం చేపడుతున్న నిర్ణయాలతో రాష్ట్రం పురోగమనంలో పయనిస్తుందని జగన్ వ్యాఖ్యానించడంతో కరతాళ ధ్వనులతో సభ ధ్వనించింది. దీంతో ఉత్తరాంధ్ర సభను విజయవంతం చేసిన బీజేపీ దక్షిణాదిలో పాగా వేయడానికి గల దారులను కూడా అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే ఇక్కడ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది.

పీఎం సభలో అధిక సంఖ్యలో పాల్గొన్న జనం నాయకుల మాటలకు ఫిదా అయ్యారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి సీట్లు వస్తాయని ధీమా కల్పించారు. ఈ నేపథ్యంలో ప్రధాని సభ సక్సెస్ తో బీజేపీ నేతల్లో ఉత్తేజం కలుగుతోంది. దక్షిణాదిలో సత్తా చాటాలని చూస్తున్న బీజేపీకి ఆంధ్రపర్యటన కలిసొచ్చింది. విశాఖ నుంచి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పున:ప్రారంభించేందుకు వెళ్లనున్నారు. ఆంధ్రలో జగన్ ప్రధానికి ఆహ్వానం పలికి తన స్వామి భక్తిని నిరూపించుకున్నా తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ సభకు రాడనే విషయం ఆందోళన కలిగిస్తోంది. రాజకీయాలు వేరు మర్యాదలు వేరు. కానీ కేసీఆర్ మాత్రం వాటిని పట్టించుకోకుండా తానేదో సాధించినట్లు భ్రమించడం తెలిసిందే.
https://www.youtube.com/watch?v=_eh9Dv3QEeM