ఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan- CM Jagan: విశాఖ నుంచే జగన్‌కు చెక్‌ పెట్టనున్న పవన్‌.. పంచ్‌ అదిరింది!

Pawan Kalyan- CM Jagan: విశాఖ నుంచే జగన్‌కు చెక్‌ పెట్టనున్న పవన్‌.. పంచ్‌ అదిరింది!

Pawan Kalyan- CM Jagan: వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశే లక్ష్యంగా ఏపీలో రాజకీయ దూకుడు పెంచిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్‌ పర్యటన ఊపి ఇచ్చిందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వచ్చిన ప్రధాని.. ఏపీలో తన మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌తో సుమారు 30 నిమిషాలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై చర్చించి ఉంటారని ఊహాగానాలు వస్తున్నాయి. కొంతకాలంగా బీజేపీతో మైత్రిపై నిరుత్సాహంగా ఉన్న జనసేనాని.. మోదీతో సమావేశం తర్వాత ఉత్సాహంగా కనిపించారు. ఆంధ్రప్రదేశ్‌కు మంచి రోజులు రాబోతున్నాయని ప్రకటించారు. దీంతో మోదీ ఏపీలో పవన్‌కు ఫ్రీహ్యాండ్‌ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది.

Pawan Kalyan- CM Jagan
Pawan Kalyan- CM Jagan

ప్రధాని పర్యటన ముగియక ముందే యుద్ధం షురూ..
ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్‌ పర్యటన ముగియక ముందే.. జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ జగన్‌ సర్కార్‌పై యుద్ధం ప్రకటించారు. సీఎం జగన్‌ ప్రధానితో కలిసి విశాఖ బహిరంగ సభలో ఉండగానే పవన్‌ పోరాటం మొదలు పెట్టేశారు. జగనన్న మోసం హ్యాష్‌ట్యాగతో పవన్‌ కళ్యాణ్‌ ఫైట్‌ స్టార్ట్‌ షురూ చేశారు. దీంతో ప్రధాని మోడీ–పవన్‌ కళ్యాణ్‌ దాదాపు అరగంట సేపు భేటీతో జన సేనానిలో కొత్త జోష్‌ వచ్చిందన్న చర్చ జరుగుతోంది. తాజాగా పవన్‌ ఫైట్‌ మొదలు పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ‘‘జగనన్న ఇళ్లు..పేదలందరికీ కన్నీళ్లు’’ అంటూ క్యాంపెయిన్‌ స్టార్ట్‌ చేసి తొలి పంచ్‌ అదిరిపోయాలా ఇచ్చారు జనసేనాని.

విశాఖ నుంచే యుద్ధం షురూ..
వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్‌ తన లక్ష్యం అని పవన్‌ గతంలోనే ప్రకటించారు. ఈ క్రమంలోనే దూకుడు పెంచారు. దాదాపు ఏడాదిగా జగన్‌ సర్కార్‌కు నిద్రపట్టకుండా చేస్తున్నారు. ఒకవైపు ప్రజా సమస్యలపై పోరాటం.. ఇంకోవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో విశాఖలో భవన నిర్మాణరంగ కార్మికులకు మద్దతుగా భారీ ర్యాలీ తీశారు. తాజాగా విశాఖ గర్జన పేరుతో సభ నిర్వహించి ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చేయాలని భావించారు. కానీ జగన్‌ సర్కార్‌ దీనిని అడ్డుకుంది. పోలీసుల సహాయంతో పవన్‌ను రెండు రోజులు హోటల్‌లో నిర్బంధించింది. తర్వాత అక్కడి నుంచి మంగళగిరికి పంపించింది.

Pawan Kalyan- CM Jagan
Pawan Kalyan- CM Jagan

అవమానించబడిన చోటే నిలబడి తొడగొట్టిన పవన్‌..
ఎక్కడైతే తనను వైసీపీ సర్కార్‌ అవమానించిందో అక్కడే పవన్‌ ఏసీ సీఎం జగన్‌ అధిరిపోయే పంచ్‌ ఇచ్చారు. కాకతీళీయమో.. ప్లాన్‌ ప్రకారం జరిగిందో తెలియదు కానీ, వైసీపీ సర్కార్‌ అడ్డుకున్న చోటే.. పవన్‌ కళ్యాణ్‌ను ప్రధాని పిలిచి మరీ మాట్లాడారు. అది కూడా వైసీపీ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చి.. జనసేనానితో మోదీ భేటీ అయ్యారు. దీంతో జగన్‌ సర్కార్‌ షాక్‌లో ఉంది. ఆ షాక్‌ నుంచి తేరుకోకముందే.. పది నిమిషాల భేటీ షెడ్యూల్‌ అరగంటకు పెరిగింది. దీంతో పవన్‌–మోదీ ఏం చర్చించారో తెలియక వైసీపీ నేతలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో పవన్‌ అధికార వైసీపీకి మరో పంచ్‌ ఇచ్చారు. తనను అడ్డుకున్న విషాక నుంచి ఏపీ సర్కార్‌పై మరో యుద్ధం మొదలు పెట్టారు. ‘‘జగనన్న మోసం’ పేరుతో క్యాంపెయినింగ్‌ షురూ చేసి.. సవాల్‌ విసిరారు జనసేనాని.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Most Popular

Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...
Jagan

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...
Bhogapuram Airport Opening

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....
Tammineni Sitaram

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...
Tammineni Family

Tammineni Family: పోలీసుల కళ్ళుగప్పి.. పరారీలో తమ్మినేని ఫ్యామిలీ!

Tammineni Family: ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ లీడర్ తమ్మినేని సీతారాం. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఆయన సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఒకసారి...