Phonepe- Google Pay Users: ఆన్ లైన్ లో మోసాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వినూత్న పద్ధతుల్లో మోసగించేందుకు కొత్త దారులు వెతుకుతున్నారు. గతంలో బ్యాంక్ ఏటీఎం కార్డు, పాస్ వర్డ్ లు తెలుసుకుని డబ్బు కాజేసేవారు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి మన వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పకూడదని పోలీసులు వారిస్తున్నా తొందరలో చెప్పేస్తున్నారు. దీంతో బ్యాంకుల్లో నగదు మాయమవుతోంది. ఇలా పలు దారుల్లో డబ్బులు దోచుకోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. మోసాలతో సులభంగా డబ్బు సంపాదించే మార్గాలు అన్వేషిస్తున్నారు.

ఇటీవల కాలంలో చోరులు కొత్త కళలు చూపిస్తున్నారు. మీ ఫోన్ కు పొరపాటున ఫోన్ పే, గూగుల్ పే, యూపీఐ ద్వారా డబ్బు వస్తే అప్రమత్తంగా ఉండండి. ఏమరుపాటుగా మీ నెంబర్ కు డబ్బులు వచ్చాయి. తిరిగి పంపించండి అని మామూలుగా అడుగుతారు. మనం ఆ డబ్బును తిరిగి పంపగానే మన ఖాతానెంబర్, వివరాలు తెలుసుకుని మన ఖాతా నుంచి క్యాష్ మాయం చేయడం జరుగుతుంది. దీంతో మనకు ఎవరైనా పొరపాటున డబ్బు పంపితే తిరిగి పంపకండి. పంపితే మన వివరాలు తెలిసి మోసం చేసే అవకాశాలున్నాయి.
బ్యాంక్ ఖాతా ను హ్యాక్ చేసి డబ్బు కాజేస్తున్నారు. తెలియని వ్యక్తులు పంపే డబ్బులపై జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కానీ ఎంత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినా పట్టించుకోవడం లేదు. నిర్లక్ష్యంతోనే డబ్బు పోగొట్టుకుంటున్నారు. అపరిచితులు ఎప్పుడైనా డబ్బు పంపిస్తే వెంటనే రిటర్న్ పంపడం చేయకండి. ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతూ దాచుకున్న డబ్బును దోచుకుంటున్నారు.

ఫోన్ పే, గూగుల్ పే వాడే వినియోగదారులు సహనంతో ఉండాలి. అన్ని విషయాల్లో తొందరపాటుకు గురైతే మనకు నష్టం కలుగుతుంది. మన వివరాలు గోప్యంగా ఉంచుకోవాలి. ఎవరికైనా చెబితే అంతే సంగతి. మన అకౌంట్ లో నుంచి డబ్బు క్షణాల్లో జారిపోతుంది. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిందే. ఆన్ లైన్ లో మోసాలు పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు దాచుకున్న డబ్బును దోచుకునేందుకు పలు మార్గాల్లో వస్తున్నారు. బీ కేర్ ఫుల్ మనం మన డబ్బును ఎవరికి ధారాదత్తం చేయకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.