spot_img
Homeజాతీయ వార్తలుNithiin: ఆ పార్టీ ప్రచారానికి హీరో నితిన్.. తెలంగాణ పాలిటిక్స్ లో సినీ గ్లామర్.. ఈ...

Nithiin: ఆ పార్టీ ప్రచారానికి హీరో నితిన్.. తెలంగాణ పాలిటిక్స్ లో సినీ గ్లామర్.. ఈ హీరోల క్యూలో..

Nithiin: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. అన్ని అధికార బీఆర్‌ఎస్‌తోపాటు విపక్ష కాంగ్రెస్, బీజేపీలు సమాయత్తమవుతున్నాయి. బీఆర్‌ఎస్‌ ఒక అడుగు ముందుకేసి అభ్యర్థులను ప్రకటించింది. త్వరలో ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందని ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో అన్ని పార్టీలూ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మేనిఫెస్టోపై బీఆర్‌ఎస్‌ కసరత్తు చేస్తుండగా, ప్రధాని పర్యటనతో ఎన్నికల శంఖారావం పూరించేందుకు బీజేపీ సిద్ధమైంది. కాంగ్రెస్‌ కూడా ఓట్లు రాల్చే ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు సినీ గ్లామర్‌ను కూడా నమ్ముకోవాలని ఆలోచన కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. ఈ క్రమంలో యువ హీరో నితిన్‌ను ప్రచారంలోకి దింపేందుకు ప్లానింగ్‌ జరుగుతోంది.

ఎన్నికల బరిలో నితిన్‌ మేనమామ
ఎన్నికల్లో సినీ గ్రామర్‌ను ఉపయోగించుకోవడంలో టీడీపీ, బీజేపీ ముందుంటాయి. గతంలో టీడీపీ, బీజేపీ నుంచి సినీ నటులు పోటీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్‌ కూడా అదే బాటలో పయనిస్తోంది. నితిన్‌ మేనమామ నగేశ్‌ రెడ్డి నిజామాబాద్‌ రూరల్‌ నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు టికెట్‌ కన్ఫామ్‌ అయితే నితిన్‌ ద్వారా ప్రచారం చేయించాలనే ఆలోచన తెలంగాణ కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. దీనికి సంబందించి హైకమాండ్‌తో టీకాంగ్రెస్‌ పెద్దలు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

టీపీసీసీ కార్యదర్శిగా నగేశ్‌రెడ్డి..
నితిన్‌ మేనమామ నగేశ్‌రెడ్డి ప్రస్తుతం టీపీసీసీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా పదేళ్లు పనిచేశారు. డీఎస్‌ మనిషి అని నగేశ్‌రెడ్డికి పేరుంది. డీఎస్‌ పార్టీ మారినా ఆయన మాత్రం కాంగ్రెస్‌లోనే ఉన్నారు. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం పరిధిలోకి మోపాల్‌ మండలానికి చెందిన వారు నితిన్‌. ఆయన దగ్గర బంధువులు చాలా మంది సినీ రంగంలో ఉన్నారు. కొందరు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు.

బీజేపీ కూడా..
బీజేపీ కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సినీ నటులను దించాలని భావిస్తోంది. హోం మంత్రి తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రతీసారి సినిమా, క్రీడారంగాలకు చెందిన వారిని కలుస్తున్నారు. ఇది కూడా ప్రచారంలో ఒక భాగమే అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ రాగానే, ఇండస్ట్రీకి చెందిన నటీ నటులతో బీజేపీ సభల్లో ప్రచారం చేయించాలని కమలనాథులు భావిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Team India

Team India: బంగారు పళ్లెంలో పెట్టి ఇస్తే కిందపడేసుకున్నారు.. ఈ నలుగురి కెరియర్ గోదారిలో కలిసినట్టే..

Team India: టీమిండియాలో చోటు లభించడమే చాలా కష్టం. పైగా ఒక స్థానానికి చాలామంది పోటీ పడుతున్నారు. ఈ ఫార్మాట్ అయినా సరే పోటీ అత్యంత ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో...
AP Rain Forecast

AP Rain Forecast: మళ్లీ నైరుతి.. ఏపీకి చల్లటి కబురు!

AP Rain Forecast: రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. గత ఏడాదికంటే సాధారణ వర్షపాతం తక్కువగానే నమోదయింది.. జూన్లో లోటు కనిపించింది. జూలైలో సైతం కొనసాగింది....
Chandrababu

Chandrababu: స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సంచలనం!

Chandrababu: ఏపీలో స్థానిక ఎన్నికలకు కూటమి ప్రభుత్వం సిద్ధపడింది. వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. ముందుగా మున్సిపల్, తర్వాత ప్రాదేశిక, చివరిగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. అయితే ఈసారి...
Modi Gen Z Video

Modi Gen Z Video: అర్ధరాత్రి సొంతంగా మరో వీడియో.. తనలోని Gen-Zని ఆవిష్కరిస్తున్న మోదీ

Modi Gen Z Video: దేశవాసియో అనే మాట లేదు. బయో బహనో అనే వాక్యం లేదు. భారత్ మాతాకీ జై అనలేదు. జైశ్రీరామ్ అని చెప్పలేదు. జస్ట్ మై ఫ్రెండ్స్ అన్నాడు...
Oktelugu Epaper