Homeజాతీయ వార్తలుCEC Gyanesh Kumar: సీఈసీపై అభిశంసన నోటీసు.. విపక్షాల కోపానికి కారణాలు ఇవే!

CEC Gyanesh Kumar: సీఈసీపై అభిశంసన నోటీసు.. విపక్షాల కోపానికి కారణాలు ఇవే!

CEC Gyanesh Kumar: భారత ఎన్నికల ప్రధాన అధికారిపై విపక్ష పాటీలు ఒక్కటిగా అభిశంసన నోటీసులు ఇచ్చాయి. 193 మంది ఎంపీల సంతకాలతో ప్రతిపక్షాలు ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. 130 మంది లోక్‌సభ సభ్యులు 63 మంది రాజ్యసభ సభ్యులు తీర్మానంపై సంతకాలు చేశారు. ఎన్నికల పారదర్శకతపై అనుమానాలు, బీజేపీ సపోర్ట్‌ ఆరోపణలతో ఈ నోటీసులు ఇచ్చాయి. స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌ నోటీసులకు అనుమతి ఇస్తే పార్లమెంటులో చర్చ జరుగుతుంది. సీఈసీని తొలగించకపోయినా అభిశంసన ఎదుర్కొంటున్న […]

CEC Gyanesh Kumar: భారత ఎన్నికల ప్రధాన అధికారిపై విపక్ష పాటీలు ఒక్కటిగా అభిశంసన నోటీసులు ఇచ్చాయి. 193 మంది ఎంపీల సంతకాలతో ప్రతిపక్షాలు ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. 130 మంది లోక్‌సభ సభ్యులు 63 మంది రాజ్యసభ సభ్యులు తీర్మానంపై సంతకాలు చేశారు. ఎన్నికల పారదర్శకతపై అనుమానాలు, బీజేపీ సపోర్ట్‌ ఆరోపణలతో ఈ నోటీసులు ఇచ్చాయి. స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌ నోటీసులకు అనుమతి ఇస్తే పార్లమెంటులో చర్చ జరుగుతుంది. సీఈసీని తొలగించకపోయినా అభిశంసన ఎదుర్కొంటున్న తొలి సీఈసీగా జ్ఞానేష్‌ కుమార్‌ అప్రతదిష్ట మూటగట్టుకన్నారు.

ప్రధాన ఆరోపణలు..
ఓటర్ల జాబితా తయారీ నుంచి ఫలితాల వరకు అక్రమాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపణ. మహారాష్ట్ర, బిహార్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో పొంతన లేని లెక్కలు, ’సర్‌’ పేరుతో లక్షల ఓట్ల తొలగింపు (పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యంగా) కనిపించాయి. ఎన్నికల సంఘ వెబ్‌సైట్‌లోనే టాలీ నంబర్లు కనిపిస్తున్నాయని ఆధారాలు చూపించాయి.

సీఈసీ నియామకంలో మార్పు..
ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక సీఈసీ నియామక ప్రకియను మార్చింది. గతంలో సీఈసీ ఎంపిక కమిటీలో ప్రధాన మంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండేవారు. కానీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ప్రధాన న్యాయమూర్తిని తప్పించింది. ప్రధాన మంత్రి, కేంద్రంలోని సీనియర్‌ మంత్రి, ప్రతిపక్ష నేత ఉన్నారు. దీంతో సీఈసీ నియామకం పూర్తిగా అధికార ఎన్డీఏనే చేస్తుంది. మెజారిటీ అధికార పార్టీదే ఉంటుంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తొలగింపునకు కారణాలు కేంద్రం ఇప్పటి వరకు చెప్పలేదు.

Also Read: సంజు శాంసన్.. ఇక డీఎస్పీ సాబ్!

డేటా పరిరక్షణపై సవరణ..
ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన డాటా బహిరంగంగా ఉంచాల్సిన అవసరం లేదని, ప్రతిపక్షాలు అడిగినా ఇవ్వాల్సిన అవసరం లేదని కొత్త సవరణ తీసుకువచ్చింది. ఎన్నికల పారదర్శకత కోసం వీడియో చిత్రీకరణ, వెబ్‌ కెమెరాలు పెడుతున్నాం. కానీ వాటిని విపక్షాలకు ఇవ్వకపోతే వాటి ఉపయోగం ఏమిటి విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దీనికి కూడా కేంద్రం సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

చట్టపరమైన రక్షణ..
సీఈసీఐ ఏమైనా అభియోగాలు ఉంటే వాళ్లు క్రిమినల్‌ ప్రొసీజర్‌ పరిధిలోకి రారని, వారిని విచారణ చేయడానికి వీలు లేదని రక్షణ కల్పించింది కేంద్రం. సీఈసీ ఏం తప్పు చేసినా విచారణ చేసే అధికారం ఎవరికీ ఉండదు. 78 ఏళ్లుగా లేని ఈ రక్షణ ఇప్పుడు ఎందుకు కల్పించారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దీనికి కూడా కేంద్రం సమాధానం చెప్పాలి.

ఒకవైపు ఎన్నికలు జరుగుతున్న తీరుపై, ఫలితాల లెక్కలపై అనుమానాలు కలుగుతున్నాయి. సర్‌ పేరుతో ఓట్ల తొలగింపు కనబడుతుంది. ఓట్లు తొలగించినవారు తమ ఓట్లు తొలగించారని పలువురు ఆందోళన చేస్తున్నారు. దీనికి ఎన్నికల సంఘం సమాధానం చెప్పడం లేదు. ఇవన్నీ కూడా రాజకీయ పార్టీలకు, సామాన్య ప్రజలకు ఎన్నికల సంఘంపై నమ్మకాన్ని తగ్గించాయి. జ్ఞానేష్‌కుమార్‌ సీఈసీ అయిన తర్వాత ఎన్నికల సంఘం ప్రతిష్ట దిగజారింది. దీనిని సరిదిద్దే ప్రయత్నం కేంద్రం చేయడం లేదు. అందుకే విపక్షాలు అభిశంసన తీర్మానం ఇచ్చాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper