Honda CR-V luxury SUV features: SUV కార్లకు మార్కెట్లో ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. కారు లోపల విశాలమైన స్పేస్ ఉండడంతో పాటు దూర ప్రయాణాలకు అనుగుణంగా ఉండడంతో చాలామంది ఈ వేరియంట్ కార్లనే ఎక్కువగా ఆదరిస్తారు. అందుకు అనుగుణంగా కంపెనీలు సైతం SUV లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటాయి. అయితే ప్రముఖ కార్ల కంపెనీ Honda వినియోగదారులను ఆకట్టుకునే విధంగా లేటెస్ట్ టెక్నాలజీతో.. లగ్జరీ ఫీచర్లు కలిగిన ఓ కారును తయారు చేస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఆన్లైన్లో సందడి చేయడంతో చాలామంది దీనిపై చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఈ కారు ఎలా ఉందంటే..?
2026 కొత్త ఏడాది సందర్భంగా Honda కంపెనీ నుంచి CR-V అనే కారు మార్కెట్లోకి రాబోతుంది. దీని డిజైన్ చూడగానే వెంటనే కొనాలని అన్నంత ఆకట్టుకునేలా ఉంది. ఇందులో నగర రోడ్లపై ప్రయాణిస్తే స్టైలిష్ గా కనిపిస్తారు. దీనికి విశాలమైన గ్రిల్ తోపాటు హెడ్ లాంప్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఒక వైపు నుంచి చూస్తే స్మూత్ గా కనిపిస్తూ టెంప్ట్ చేస్తుంది. వెనుక వైపు స్టైలిష్ టెయిల్ ఆకర్షనీయంగా ఉన్నాయి. బంపర్ డిజైన్ ప్రీమియం లుక్ ను అందిస్తుంది.
ఎక్స్టీరియర్ డిజైన్ మాత్రమే కాకుండా డిన్నర్ లో కూడా సౌకర్యవంతమైన స్పేస్ ఉండనుంది. క్యాబిన్ మొత్తం క్వాలిటీతో కలిగిన సీట్స్ ఉంటాయి. ప్రయాణికులకు తగిన విశ్రాంతి కలిగించేలా వెంటిలేటెడ్ సౌకర్యం ఉంటుంది. Legroom ఎక్కువగా ఉండడంతో దూర ప్రయాణం చేసినా కూడా ఎలాంటి అలసట కనిపించదు. అలాగే లాంగ్ టూర్ వేసినప్పుడు సామాగ్రి లేదా క్రీడా సామాగ్రిని తీసుకెళ్లడానికి తగినంత స్పేస్ ఉంటుంది. ఇందులో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం తో పాటు స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్, ఆడియో స్పీకర్ వంటివి ఉన్నాయి. డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే లో వేగం, కిందన స్థాయి, సెక్యూరిటీ వంటి హెచ్చరికలు కనిపిస్తాయి. యుఎస్బి చార్జింగ్ పోర్టు, వైర్లెస్ చార్జింగ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ వంటివి డ్రైవర్లకు సెక్యూరిటీని ఇస్తాయి.
ఈ కారులో నేటి తరం వారికి అనుగుణంగా ఇంజన్ ను సమకూర్చారు. ఇందులో 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజన్ కలిగి ఉంది. దీనితోపాటు టూ ఎలక్ట్రిక్ మోటార్స్ కూడా ఉత్పత్తి అయి 203 నుంచి 204 వరకు హార్స్ పవర్ అందిస్తుంది. అలాగే 1.5 లీటర్ టర్బో ఇంజన్ కూడా చూడవచ్చు. వీటితోపాటు 2 ADAS లెవెల్ 2 టెక్నాలజీ కలిగిన ఈ కారు లగ్జరీ లైఫ్ గడిపే వారితో పాటు ఫ్యామిలీతో కలిసి లాంగ్ టూర్ వేసేవారికి అనుగుణంగా ఉంటుంది.
