Homeఆంధ్రప్రదేశ్‌Pawan kalyan Next CM of AP: నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్.. ముందే చెప్పిన...

Pawan kalyan Next CM of AP: నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్.. ముందే చెప్పిన బ్రహ్మంగారు… నెట్టింట వైరల్

Pawan kalyan Next CM of AP: ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికల సమీపిస్తున్న కొలదీ మరింత హీటెక్కిస్తున్నాయి. పార్టీలు వ్యూహప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. చిన్నపాటి అడ్వాంటేజ్ ను సైతం విడిచిపెట్టడం లేదు. సంక్షేమం పేరిట అధికార పార్టీ.. ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తునే ఉన్నాయి. జనసేన అధినేత పవన్ ఈ విషయంలో కాస్తా దూకుడుగా ఉన్నారు. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతీ మాట తూటాలా పేలుతోంది. ఓ వైపు పెండింగ్ సినిమాలు పూర్తిచేస్తూనే.. ప్రజా క్షేత్రంలో అడుగు పెట్టేందుకు ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే కౌలు రైతు భరోసా యాత్ర పేరిట రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలను చుట్టేస్తున్నారు. పనిలో పనిగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరును తీవ్రస్థాయిలో ఎండగడుతున్నారు. నేరుగా సీఎం జగన్ పైనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడుతున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అటు అధికార వైసీపీ, ఇటు విపక్ష టీడీపీ, జనసేనల మధ్య టఫ్ ఫైట్ నడవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కూడా ఈ సారి గట్టిగానే కొట్టాలన్న కసితో ఉన్నారు. ఈ క్రమంలో ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ గురించే చెబుతున్నట్లు బ్రహ్మంగారి చెప్పిన కాలజ్ఞానానికి సంబంధించిన ఓ ఫోటో హల్ చల్ చేస్తోంది. ఆ ఫోటో చూస్తే.. పవన్ కళ్యాణ్ నెక్ట్స్ సీఎం అన్న విషయం అర్థమవుతుంది. ఆ ఫోటో సారాంశం ఏంటంటే… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీఎం కాబోతున్నాడనేది ఆ ఫోటోలోని సారాంశం. ‘తెలుగు రాష్ట్రమున పవనుడొచ్చేనయ.. రాజవారసత్వము నశించినయ.. ప్రజారాజ్యము విరసిల్లునయ.. తప్పదు నా మాట నమ్మండయ’. ఇప్పుడిదే తెలుగునాట చర్చనీయాంశమైంది. ఏ ఇద్దరు కలిసినా ఇదే టాపిక్ నడుస్తోంది.

Pawan kalyan Next CM of AP
Pawan kalyan

వారసత్వ రాజకీయాలపై..
పోతలూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. తన కాలజ్ఞానంలో చెప్పిన చాలా విషయాలు ప్రపంచంలో వెలుగుచూశాయి. ఆయన ప్రవచనాలకు.. జరుగుతున్న పరిణామాలకు దగ్గర పోలికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మంగారు ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాల్ని శతాబ్ధాల కిందటే అంచనా వేసినట్టు ఫొటో వైరల్ కావడం అందరి ద్రుష్టిని ఆకర్షించింది.అయితే ఇది ఒక్క వ్యాఖ్యతో ఆగలేదు. రెండవ లైన్‌లో ‘రాజవారసత్వము నశించునయ ’అంటూ.. ఉంది. ఇదే తరహా రాజకీయం ఇప్పుడు ఏపీలో నడుస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా జగన్ ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు.ఆయన అకాల మరణంతో ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ ను రగిలించి ముఖ్యమంత్రి అయ్యారు. ఒకవేళ జగన్ ఓడిపోతే.. చంద్రబాబు వారసుడిగా లోకేష్ నేనున్నానంటూ ముందుకొస్తాడు.

టీడీపీ ఈ రెండు పార్టీల్లో ఎవరు వచ్చినా .. రాజుల కాలంలో మాదిరగా వారసత్వమే అవుతుంది. ఒకవేళ బ్రహ్మంగారు చెప్పినట్లు వైరల్ అవుతున్న ఫోటోలో వారసత్వాలు పోయి పవనుడు వచ్చేడయా మొదటి లైన్‌లో చెప్పినట్లు చూస్తే పవన్ కళ్యాన్ రావాలి. ఇదిలా ఉన్నా.. ఇటు పవన్ కళ్యాన్ కూడా ఈ సారి రాజకీయాల్ని ఎన్నికల్ని సీరియస్‌గా తీసుకున్నారు. నెక్ట్స్ ఏపీ సీఎం కావాలన్న పట్టుదలతో పాలిటిక్స్ నడుపుతున్నారు. ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలన్న తపనతో సీరియస్‌గా పనిచేస్తున్నారు. ఇటు జనసైనికులు కూడా ఈసారి గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాన్ కూడా తమ పంథా మార్చుకున్నారు. గతంలో టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ఇటీవల స్పీచ్ లలో పంథా మారింది. పొత్తు పెట్టుకున్నా కానీ సీఎం అభ్యర్థి నేనే అంటున్నారు. ఇది ఆయన సీఎం కావాలని కలలు కంటున్నవారికి ఆనందం కలిగించింది. తాజాగా బ్రహ్మంగారి వాక్కు బయటపడిందంటూ జన సైనికులు తెగ సంబరపడిపోతున్నారు. దీంతో మరింత దూకుడుగా వ్యవహరించడానికి తాజా అంశం ఎంతగానో దోహదపడుతోందని జనసేన నేతలు భావిస్తున్నారు.

Pawan kalyan Next CM of AP
Pawan kalyan

జగన్ కు అంతా వ్యతిరేకత..
బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని కొందరు నమ్మవచ్చు.. నమ్మక పోవచ్చు కానీ.. పరిస్థితులైతే మాత్రం పవన్ కు అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు. రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీల పరిస్థితి ప్రస్తుతం ఏమంత ఆశాజనకంగా లేవు. 2019 ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విజయం సొంతం చేసుకున్న జగన్ పాలన విషయానికి వచ్చేసరికి చతికిల పడ్డారు. మూడేళ్లకే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. కేవలం సంక్షేమ మంత్రాన్ని జపించి పాలనను గాలికొదిలేశారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించారు. అప్పుల రాష్ట్రంగా మార్చేశారు. దీంతో అన్నివర్గాల ప్రజలు కూడా జగన్ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు.పార్టీలో కూడా తొలినాళ్లలో ఉన్నంత క్రమశిక్షణ లేదు. పార్టీపై జగన్ కు అదుపు తప్పుతోంది. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై ఉన్న అభిమానంతో చాలా మంది సీనియర్ నాయకులు కిమ్మనకుండా ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నకొలదీ తిరుగుబాట్లు ఎదురయ్యే అవకాశముంది. అటు పార్టీ అంతర్గత సర్వేల్లో సైతం ఇదే విషయం ప్రస్పుటమవుతుండడంతో జగన్ లో కలవరం ప్రారంభమైంది. అందుకే ఆయన విరుగుడు చర్యలు ప్రారంభించారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో పవన్ ను కట్టడి చేసే ప్రయత్నంలో ఉన్నారు.

లోకేష్ లో కనిపించని పురోగతి..
మరోవైపు ప్రధాన విపక్షం టీడీపీ పరిస్థితి కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. చంద్రబాబు చరిష్మ చాలడం లేదు. అందుకే ఆయన పొత్తుల రూపంలో అదనపు బలం సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే టీడీపీలో చంద్రబాబు తరువాత ఆయన కుమారుడు లోకేష్ నంబర్ టూగా ఉన్నారు. కానీ ఆ పార్టీలో మెజార్టీ కేడర్ మాత్రం చంద్రబాబు పై చూపుతున్న అభిమానం లోకేష్ పై చూపడం లేదు. గత టీడీపీ ప్రభుత్వంలో లోకేష్ వ్యవహార శైలే ఇందుకు కారణం. నాడు పార్టీని పట్టించుకోకుండా ఒకరిద్దరు నాయకుల మాటలనే ఆయన పరిగణలోకి తీసుకునేవారు. ఒక విధంగా చెప్పాలంటే గత ఎన్నికల్లో ఓటమికి లోకేషే కారణమంటూ ఎక్కువ మంది కార్నర్ చేశారు. 2019 ఎన్నికల్లో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో కొంత మంది వైసీపీ పంచన చేరారు. వెళుతూవెళుతూ వారు లోకేష్ పై నింద మోపి వెళ్లిపోయారు. దానికి తగ్గట్టుగానే లోకేష్ లో కూడా రాజకీయ పరిణితి విషయలో ఎటువంటి పురోగతి లేదు. పక్కన ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ లా లోకేష్ రాజకీయ పరిణితి సాధించకపోవడంపై సొంత పార్టీ శ్రేణుల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు తన రాజకీయ వారసుడిగా లోకేష్ ను తెరపైకి తెచ్చినా లాభం లేకపోతోంది. అటు వైసీపీ, ఇటు టీడీపీ పరిణామాల నేపథ్యంలో బ్రహ్మంగారి కాలజ్ఞాన వ్యాఖ్యల ఫొటో మాత్రం ఆలోచింపజేస్తోంది. తాజా పరిణామాలకు అతికినట్టు సరిపోతోంది. చూద్దాం ఏం జరుగుతుందో..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular