Manchu Lakshmi Yoga: మంచు వారి ఫ్యామిలీ ఏమి చేసినా ట్రోల్ చేయడానికి కొందరు సిద్ధంగా ఉంటారు. మోహన్ బాబు, మంచు లక్ష్మీ, విష్ణు తరచుగా ట్రోల్స్ కి గురవుతూ ఉంటారు. కొన్ని యూట్యూబ్ చానల్స్ వీరి ట్రోల్ల్స్ పైనే బ్రతికేస్తూ ఉంటాయి. ముఖ్యంగా మంచు లక్ష్మీ మాట్లాడే తెలుగు, ఆమె ఇంగ్లీష్ యాక్సెంట్ పై సెటైర్స్ పేలుతూ ఉంటాయి. మీమ్స్ రాయుళ్లు రెచ్చిపోతూ ఉంటారు. తాజాగా మరోసారి ఆమెపై నెటిజెన్స్ నెగిటివ్ కామెంట్స్ తో దాడి చేశారు.

జూన్ 21 ఇంటర్నేషనల్ యోగ డే. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు యోగా ఫోటోలు,వీడియోలు షేర్ చేశారు. ఇక మంచు లక్ష్మీ సైతం కొన్ని కఠిన ఆసనాలు వేస్తూ ఫోటో షూట్ చేశారు. ఆ ఫోటోలు ఇంస్టాగ్రామ్ పోస్ట్ చేశారు. మంచు లక్ష్మీ యోగా ఫోటోలపై కొందరు దారుణమైన కామెంట్స్ చేశారు. ఒకరు ‘అట్లుంటది మరి ఆంటీతోని’ అని కామెంట్ చేయగా, మరొకరు ‘బామ్మగారు మనకు అవసరమా చెప్పండి’ అంటూ కామెంట్ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈ కామెంట్స్, ట్రోల్స్ హాట్ టాపిక్ మారాయి, ఇక ఇలాంటి పోకిరీల గురించి వదిలేస్తే… మంచు లక్ష్మీ యోగా భంగిమలను చాల మంది కొనియాడుతున్నారు. ఆమె అద్భుతంగా యోగా చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. మంచు లక్ష్మికి యోగాపై మంచి అవగాహనా ఉంది. యోగాలోని కఠిన ఆసనాలు ఆమె వేయగలరు. ఇక ట్రోల్స్ గురించి ఆమె పెద్దగా పట్టించుకోరు. ఈ ట్రోల్స్ పై పలుమార్లు ఆమె స్పందించారు.
పనిలేని వాళ్ళు ఖాళీగా ఉండి ఇలాంటి ట్రోల్స్, మీమ్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళను పట్టించుకుంటే మనం ఏమి చేయలేము. ఎవరు ఏమనుకున్నా మనసుకు నచ్చింది చేసుకుంటూ పోవడమే అంటారు. ఇక తండ్రి వారసత్వంతో మంచు లక్ష్మీ నటిగా మారారు. ఆమె అమెరికాలో టెలివిజన్ హోస్ట్ గా చేశారు. ఒకటి రెండు ఇంగ్లీష్ సిరీస్లలో నటించారు. అనంతరం ఇండియా వచ్చి తెలుగులో హీరోయిన్ కావాలనుకున్నారు. అయితే ఆమెకు బ్రేక్ రాలేదు. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు.
View this post on Instagram
[…] […]
[…] […]