Homeజాతీయ వార్తలుWest Bengal politics BJP early development: గెలిచిన 24 గంటల్లోనే మార్చేశారు.. బెంగాల్ లో...

West Bengal politics BJP early development: గెలిచిన 24 గంటల్లోనే మార్చేశారు.. బెంగాల్ లో బిజెపి గెలవాలనేది ఇందుకే..

West Bengal politics BJP early development: రాజకీయ నాయకులు వ్యవస్థను వ్యవస్థ మాదిరిగా ఉంచాలి. వ్యక్తులలో భావోద్వేగాలు ఏర్పడకుండా చూడాలి. తమ రాజకీయాల కోసం రాజకీయ నాయకులు వ్యక్తులతో ఆడుకుంటే.. వ్యవస్థలలో వేలు పెడితే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. బెంగాల్ రాష్ట్రంలో గడిచిన 15 సంవత్సరాల కాలంలో జరిగింది ఇదే. అందువల్లే మమతా బెనర్జీ పరిపాలన మీద మెజారిటీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె తన తీరు మార్చుకోవాలని పదేపదే సూచించారు. అయినప్పటికీ […]

West Bengal politics BJP early development: రాజకీయ నాయకులు వ్యవస్థను వ్యవస్థ మాదిరిగా ఉంచాలి. వ్యక్తులలో భావోద్వేగాలు ఏర్పడకుండా చూడాలి. తమ రాజకీయాల కోసం రాజకీయ నాయకులు వ్యక్తులతో ఆడుకుంటే.. వ్యవస్థలలో వేలు పెడితే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. బెంగాల్ రాష్ట్రంలో గడిచిన 15 సంవత్సరాల కాలంలో జరిగింది ఇదే. అందువల్లే మమతా బెనర్జీ పరిపాలన మీద మెజారిటీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె తన తీరు మార్చుకోవాలని పదేపదే సూచించారు. అయినప్పటికీ ఆమె తగ్గలేదు.

మమత తన తీరు మార్చకపోవడంతో బెంగాల్ ప్రజలు ఈసారి విస్పష్టమైన తీర్పు ఇచ్చారు. మమతను ఓడించడమే కాదు.. ఆమె పార్టీకి శంకరగిరి మాన్యాలను చూపించారు.. బెంగాల్ రాష్ట్రంలో పదేపదే బిజెపి అధికారంలోకి రావాలని చాలామంది ఎందుకు కోరుకున్నారో.. ఎక్కడ జరిగిన ఒక సంఘటన నిరూపించింది.. పశ్చిమ బెంగాల్లో బిజెపి అధికారంలోకి వచ్చి 24 గంటలు కాకముందే.. అక్కడ జరిగిన ఓ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బిజెపి విజయం సాధించిన కొద్ది గంటల్లోనే ఆ పార్టీ కార్యకర్తలు ఒకసారిగా అల్లర్ట్ అయిపోయారు. ఇన్ని రోజులపాటు తమ గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేదనను తొలగించుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మసీదు పారా రోడ్డు పేరును మార్చేశారు. దానికి నేతాజీ పల్లి రోడ్డుగా నామకరణం చేశారు. ఈ క్రమంలో ఉన్న ద్వారంపై ఉన్న పాత నేమ్ బోర్డును తొలగించారు.

“ఇది మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నది. మా మీద బలవంతంగా కొన్ని పేర్లను రుద్దారు. ఓ సామాజికవర్గం మెప్పుకోసం మమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. కానీ ఇప్పుడు మాకు శక్తి వచ్చేసింది. ఆ శక్తి అనుకూలంగా మారింది. ఇకపై మాకు స్వేచ్ఛ ఉంటుంది. స్వాతంత్రం ఉంటుంది. నేతాజీ పేరును ప్రకటించడానికి గర్వంగా భావిస్తున్నాం. బెంగాల్ రాష్ట్రం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ది. ఆయన స్వాతంత్ర పోరాటంలో ఎటువంటి పాత్ర పోషించారో యావత్ దేశానికి మొత్తం తెలుసు.. కొందరు త్యాగ ధనుల పోరాటాలను తక్కువ చేసి చూసే విధంగా మాట్లాడారు. వారందరూ ఇప్పుడు తలదించుకుంటారు. ఎందుకంటే పోరాటాలు చేసిన వారు ఇప్పుడు గుర్తింపు పొందుతారు.. బెంగాల్ ఇకపై మారుతుంది. కచ్చితంగా మారుతుందని” బిజెపి కార్యకర్తలు పేర్కొంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper