spot_img
Homeలైఫ్ స్టైల్Healthy summer breakfast foods: వేసవిలో బ్రేక్ ఫాస్ట్ కోసం ఈ ఆహారం చాలా...

Healthy summer breakfast foods: వేసవిలో బ్రేక్ ఫాస్ట్ కోసం ఈ ఆహారం చాలా అవసరం..

Healthy summer breakfast foods: వేసవిలో బ్రేక్‌ఫాస్ట్ ఎంపికలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్లాల్సి వస్తే ఈ సీజన్‌లో శరీరం ఎక్కువగా నీరు, ఎలక్ట్రోలైట్స్ కోల్పోతుంది. కాబట్టి తేలికగా జీర్ణమయ్యే, నీరు ఎక్కువగా ఉండే, చల్లదనాన్ని ఇచ్చే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అంతేకాకుండా ఈ సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వాటి గురించి తెలుసుకుందాం..

వేసవిలో శరీరం చెమట ద్వారా నీటిని కోల్పోతుంది. అందుకే ఉదయం నుంచే నీటిశాతం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. పుచ్చకాయ, కీర, ముసంబి, కొబ్బరి నీరు వంటి వాటిలో 90% వరకు నీరు ఉంటుంది. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా డీహైడ్రేషన్‌కి అడ్డుకట్ట వేస్తాయి. బ్రేక్ ఫాస్ట్ గా వీటిని తీసుకోవడం వల్ల రోజంతా ఎనర్జీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. పెరుగు, మజ్జిగ వంటి పదార్థాలు వేసవిలో ఉత్తమ బ్రేక్‌ఫాస్ట్‌గా భావిస్తారు. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, గట్ హెల్త్‌ను కాపాడుతాయి. అలాగే శరీరాన్ని చల్లగా ఉంచే సహజ గుణాలు కలిగి ఉంటాయి.

రాగి, జొన్నలు, ఓట్స్ వంటి ధాన్యాలు తేలికగా జీర్ణమవుతాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి. వేసవిలో ఇవి బరువు పెరగకుండా, అలసట రాకుండా సహాయపడతాయి. పండ్లు, బాదం, వేరుశెనగలు వంటి డ్రైఫ్రూట్స్ కలిపి తీసుకుంటే మంచి బ్రేక్‌ఫాస్ట్ అవుతుంది. ఇవి విటమిన్లు, ఫైబర్, మంచి ఫ్యాట్స్ ఇస్తాయి. శరీరాన్ని తేలికగా ఉంచి ఎక్కువసేపు ఎనర్జీ ఇస్తాయి. కొబ్బరి నీటితో చేసిన స్మూతీలు వేసవిలో చాలా మంచివి. ఇవి శరీరానికి ఎలక్ట్రోలైట్స్ అందించి అలసట తగ్గిస్తాయి. కీర, పుదీనా వంటి చల్లని పదార్థాలతో చేసిన సాండ్విచ్‌లు ఉదయం తేలికగా తినడానికి మంచివి. ఇవి జీర్ణక్రియకు సులభం మరియు శరీరానికి చల్లదనం ఇస్తాయి.

ఇదే సమయంలో కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. పకోడీలు, ఫ్రైడ్ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్స్ వంటి వాటిని వేసవిలో తగ్గించాలి. ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది మరియు శరీరంలో వేడి పెంచుతాయి. అధిక మిరపకాయలు, మసాలాలు ఉన్న ఆహారం తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది డీహైడ్రేషన్, గ్యాస్, ఆమ్లత్వం వంటి సమస్యలకు దారి తీస్తుంది. ప్యాకేజ్డ్ చిప్స్, బిస్కెట్లు వంటి వాటిలో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీరంలో నీటి లోపం పెంచుతాయి. సోడా, కోల్డ్ డ్రింక్స్, ప్యాక్డ్ జ్యూసులు వేసవిలో తాత్కాలికంగా కూల్‌గా అనిపించినా, ఇవి డీహైడ్రేషన్ పెంచుతాయి. ఫ్యాటీ మీట్, క్రీమ్ ఆధారిత ఫుడ్స్ వేసవిలో జీర్ణానికి కష్టంగా ఉంటాయి. ఇవి అలసట, బరువు, వేడి పెరగడానికి కారణమవుతాయి. వేసవిలో ఉదయమే పండ్లు, పెరుగు, మిల్లెట్స్, కొబ్బరి నీరు వంటి ఆహారం తీసుకుంటే శరీరం చల్లగా ఉండి రోజంతా ఎనర్జీగా ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Balakrishna

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...
Thalapathy Vijay

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...
Anil Ravipudi

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా...
Oktelugu Epaper