Homeజాతీయ వార్తలుBJP Next Target: బెంగాల్, అస్సాం లో విజయం.. బిజెపికి అక్కడ భారీ మెజారిటీ ఖాయం..

BJP Next Target: బెంగాల్, అస్సాం లో విజయం.. బిజెపికి అక్కడ భారీ మెజారిటీ ఖాయం..

BJP Next Target: బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో సాధించిన విజయాలు బిజెపికి తిరుగులేని బూస్ట్ ఇచ్చాయి. ఆ పార్టీ నాయకత్వంలో అనంతమైన పాజిటివిటీని పెంచాయి. ఇక్కడితోనే బిజెపి ఆగేటట్టు కనిపించడం లేదు. బిజెపికి కేవలం అసెంబ్లీలలోనే కాకుండా.. రాజ్యసభలో కూడా బలం పెంచేలా చేసింది అస్సాం, బెంగాల్ రాష్ట్రాలలో సాధించిన గెలుపు. కొంతకాలంగా బిజెపి ఆయా రాష్ట్రాల ఎన్నికలలో ఒకే ఫార్ములా పాటిస్తోంది. దాని పేరు లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం.. ఎంత కష్టమైనా సరే దానిని సాధించడం.. ఈ […]

BJP Next Target: బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో సాధించిన విజయాలు బిజెపికి తిరుగులేని బూస్ట్ ఇచ్చాయి. ఆ పార్టీ నాయకత్వంలో అనంతమైన పాజిటివిటీని పెంచాయి. ఇక్కడితోనే బిజెపి ఆగేటట్టు కనిపించడం లేదు. బిజెపికి కేవలం అసెంబ్లీలలోనే కాకుండా.. రాజ్యసభలో కూడా బలం పెంచేలా చేసింది అస్సాం, బెంగాల్ రాష్ట్రాలలో సాధించిన గెలుపు.

కొంతకాలంగా బిజెపి ఆయా రాష్ట్రాల ఎన్నికలలో ఒకే ఫార్ములా పాటిస్తోంది. దాని పేరు లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం.. ఎంత కష్టమైనా సరే దానిని సాధించడం.. ఈ సూత్రం ఆధారంగానే బిజెపి పని చేస్తోంది. ఈ సూత్రం 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి పనిచేయలేదు. అందువల్ల పార్లమెంటు స్థానాలు చాలావరకు తగ్గాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి సొంతంగా 303 స్థానాలను సాధించింది. 2024 ఎన్నికల్లో మాత్రం 240 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. జెడ్ యు, టిడిపి సపోర్టుతో బిజెపి 2024 లో సెంటర్లో గవర్నమెంట్ ఫామ్ చేయాల్సి వచ్చింది.

పార్లమెంటు ఎన్నికల్లో బిజెపికి గట్టి ఎదురు దెబ్బ తగిలిన నేపథ్యంలో.. దాని నుంచి అనేక పాఠాలు నేర్చుకుంది. అందువల్లే కమలం వరుసగా దూసుకుపోతోంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత హర్యానా, మహారాష్ట్ర, బీహార్, ఢిల్లీ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బిజెపి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం గత ఏడాది పాలిటిక్స్ లో సరికొత్త చరిత్ర. తాజాగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో బిజెపి మూడింటిని తన ఖాతాలో వేసుకుంది.

వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసమ ఎన్నికల జరగబోతున్నాయి. వీటిలో గోవా, మణిపూర్, ఉత్తరాఖాండ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో బిజెపి రూలింగ్ లో ఉంది. వాటిని కాపాడుకునేందుకు బిజెపి అధినాయకత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు పంజాబ్లో కూడా సత్తా చూపించేందుకు బిజెపి రెడీగా ఉంది. బిజెపి తర్వాత టార్గెట్ కూడా అదే. అనంతరం దక్షిణాదిలోని కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకోవాలని బిజెపి భావిస్తోంది.

ఒకవేళ ఈ మూడు రాష్ట్రాలలో బిజెపి గనుక విజయం సాధిస్తే దేశవ్యాప్తంగా ఐదింట నాలుగువంతులు కాషాయమయమే. ఒకవేళ ఈ సాధ్యమైతే రాజ్యసభలో మెజారిటీ దిశగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పయనం సాగించడం ఖాయం. ఫలితంగా జమిలి ఎన్నికలు.. నియోజకవర్గాల పునర్విభజన వంటి బిల్లులను ఆమోదింప చేసుకొని.. బిజెపి తన ఎజెండాను కచ్చితంగా ముందుకు తీసుకెళ్తుంది. అందువల్లే వచ్చే ఎన్నికల్లోను విజయం సాధించి , రాజ్యసభలో సొంతంగా మెజారిటీ సాధించాలని బిజెపి పెద్దలు భావిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper