Homeజాతీయ వార్తలుModi Bengal strategy Jhalmuri: నరేంద్ర మోడీ ఝల్ మురి.. టీఎంసీ కూసాలు అప్పుడే కదిలాయి..

Modi Bengal strategy Jhalmuri: నరేంద్ర మోడీ ఝల్ మురి.. టీఎంసీ కూసాలు అప్పుడే కదిలాయి..

Modi Bengal strategy Jhalmuri: ఒకప్పుడు రాజకీయాలలో విమర్శలు ఉండేవి. ప్రతి విమర్శలు కూడా ఉండేవి. కాకపోతే అవి హుందాగా సాగుతూ ఉండేవి. రాజకీయ నాయకులు కూడా రాజకీయాలను వ్యక్తిగత విషయాలతో ముడిపెట్టే వారు కాదు. ప్రజల్లో పార్టీలపరంగా విభేదాలు.. అంతగా ఉండేవి కాదు. ఇప్పుడు అలా కాదు కదా. తిండి నుంచి మొదలుపెడితే కట్టుకునే వస్త్రాల వరకు ప్రతిదీ కూడా రాజకీయమే. ఒక దశలో రాజకీయాలను ప్రతిదీ ప్రభావితం చేస్తోంది. దీనికి తోడు సామాజిక మాధ్యమం […]

Modi Bengal strategy Jhalmuri: ఒకప్పుడు రాజకీయాలలో విమర్శలు ఉండేవి. ప్రతి విమర్శలు కూడా ఉండేవి. కాకపోతే అవి హుందాగా సాగుతూ ఉండేవి. రాజకీయ నాయకులు కూడా రాజకీయాలను వ్యక్తిగత విషయాలతో ముడిపెట్టే వారు కాదు. ప్రజల్లో పార్టీలపరంగా విభేదాలు.. అంతగా ఉండేవి కాదు.

ఇప్పుడు అలా కాదు కదా. తిండి నుంచి మొదలుపెడితే కట్టుకునే వస్త్రాల వరకు ప్రతిదీ కూడా రాజకీయమే. ఒక దశలో రాజకీయాలను ప్రతిదీ ప్రభావితం చేస్తోంది. దీనికి తోడు సామాజిక మాధ్యమం ఉండనే ఉంది . అందువల్ల నేటి కాలంలో రాజకీయాలు సాగించడానికి విశ్లేషకులు పుట్టుకొచ్చారు. వారు ఏం చెబితే అది చేసేందుకు రాజకీయ నాయకులు వెనుకాడటం లేదు. కాకపోతే కొంతమంది నాయకులు సొంత రాజకీయ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. చివరికి దాని ద్వారానే అక్కడి రాజకీయాలను పూర్తిగా మార్చేస్తున్నారు. ఈ జాబితాలో దేశ ప్రధాని నరేంద్ర మోడీకి సింహభాగం ఇవ్వవచ్చు.

మనదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా సరే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిజెపి తరఫున ప్రచారం చేస్తున్నారు. సాధ్యమైనంతవరకు ఆ రాష్ట్రాల ఆహారపు అలవాట్లను.. ఆచార వ్యవహారాలను ప్రదర్శించేందుకు ఇష్టపడుతున్నారు. ఇటీవల కాలంలో పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరిగినప్పుడు.. ప్రచారానికి నరేంద్ర మోడీ వెళ్లారు. అక్కడ ఆయన బెంగాల్ ప్రముఖులైన రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, స్వామి వివేకానంద వంటి వారిని పదేపదే ప్రస్తావించారు. అంతేకాదు బెంగాలీ ఆహారపు అలవాట్లను కూడా ప్రముఖంగా పేర్కొన్నారు.

నరేంద్ర మోడీ శాకాహారి అయినప్పటికీ బెంగాల్ ప్రజలకు ఎంతో ఇష్టమైన చేపలను కూడా ప్రస్తావించారు. బెంగాలీ ప్రజలు చేపలను బాగా తింటారని.. కాకపోతే ఆ చేపలను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని.. మమతా పరిపాలన కాలంలో సొంతంగా చేపలు కూడా ఉత్పత్తి చేసుకోవాలని స్థితికి పశ్చిమ బెంగాల్ దిగజారిపోయిందని నరేంద్ర మోడీ అనేక సభల్లో ఆక్షేపించేవారు.

చేపలు మాత్రమే కాదు.. పశ్చిమ బెంగాల్ స్ట్రీట్ ఫుడ్ కూడా ఈ ఎన్నికల్లో టీఎంసీకి అపరాధం చేసింది. దీనంతటి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఆయన మన దేశానికి ప్రధాని.. పైగా ఆయన ఏం చేసినా సరే క్షణాల్లో పాపులారిటీ వచ్చేస్తూ ఉంటుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ గ్రామంలో ఆయన పర్యటించారు. ఓ వీధి పక్కన ఉన్న దుకాణంలో ఝల్ మరి అనే స్ట్రీట్ ఫుడ్ తిన్నారు. ఫలితంగా అందరి దృష్టి దాని మీద పడింది..

ఝల్ మరి అనేది బెంగాల్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన స్ట్రీట్ ఫుడ్.. ఝల్ అంటే బెంగాలీ భాషలో కారం.. మరి అంటే మరమరాలు.. వీటి కాంబినేషన్లో చేసే వంటకం ఇది.. ఈ స్ట్రీట్ ఫుడ్ కారంగా.. పుల్లగా ఉంటుంది. మసాలా కూడా గట్టిగా వేస్తారు. కాబట్టి అత్యంత రుచికరంగా ఉంటుంది. ఝల్ మరి ప్రధానమంత్రి మోడీ తిన్న తర్వాత దీని గురించి వెతకడం మొదలైంది. వాస్తవానికి ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా బెంగాలీ స్ట్రీట్ ఫుడ్ గురించి మాట్లాడలేదు. కనీసం పట్టించుకోలేదు. దీంతో బెంగాలీ ప్రజల్లో నరేంద్ర మోడీ మీద అభిమానం పెరిగింది. అందువల్లే ఈసారి ఆయన పార్టీకి ఓట్లు వేశారు.

ఝల్ మరి మరమరాలు.. ఉడికించిన ఆలుగడ్డలు.. ఉల్లిపాయలు.. టమాటాలు.. పల్లీలు.. కీరా దోసకాయ.. పచ్చిమిర్చి.. పుదీనా.. నిమ్మరసం.. ఆవనూనె.. ఉప్పు.. కారం.. జీలకర్ర పొడి.. చాట్ మసాలా వేసి తయారుచేస్తారు. అయితే దీనిని వెంటనే తినాలి. లేకపోతే మరమరాలు పూర్తిగా మెత్తబడిపోతాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper