Bhairav Sena: ప్రపంచంలో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఒక దేశం మీద మరొక దేశం ఆధిపత్యం కోసం దాడులు చేయడం వంటి సంఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. ఆసియాలో ఇరాన్ నుంచి మొదలు పెడితే యూరప్ లో రష్యా వరకు ఇలా ఏ దేశం చూసుకున్నా సరే.. అయితే దాడులు, లేకుంటే ప్రతి దాడులతో నిత్యం వార్తలో నిలుస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్, అమెరికా, వెనిజులా, ఇజ్రాయిల్, పాలస్తీనా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దేశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా యుద్ధాలలో పాల్గొంటున్నాయి.
ప్రపంచం సంగతి పక్కన పెడితే, మన దేశానికి చుట్టూ శత్రువులే. చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక.. ఇలా ప్రతి దేశంతోనూ ముప్పే. ఇలాంటప్పుడు కచ్చితంగా సైన్యాన్ని ఆధునికరించుకోవాలి. అవసరమైతే అత్యంత కఠినమైన ఆపరేషన్లు చేయగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. మన రక్షణ వ్యయం అంతగంతకు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఉన్న వనరులతోనే సమర్థవంతమైన దళాన్ని నిర్మించుకుంది భారత్.
భవిష్యత్తులో ఎదురయ్యే ఎటువంటి పరిణామాలైన ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది భారత్. ఈ క్రమంలోనే లక్ష మందికి పైగా డ్రోన్ ఆపరేటర్లతో అతిపెద్ద సైన్యాన్ని రూపొందించింది. శత్రువులకు సంబంధించిన స్థావరాలను ధ్వంసం చేయడానికి.. భైరవ్ అనే పేరుతో కొత్తగా బలగాన్ని రూపొందించింది. అత్యంత ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ దళం పని చేస్తుంది. సాధారణమైన దళానికి, పారా స్పెషల్ ఫోర్సెస్ కు మధ్య సంధానకర్త లాగా ఇది పనిచేస్తూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో జరిగిన యుద్ధంలో డ్రోన్ ల వాడకం పెరిగిపోయింది. అందువల్ల డ్రోన్ల వాడకంలో ప్రతి సైనికుడికి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు. వీరంతా కూడా శత్రువుల భూభాగాలలోకి డ్రోన్లు చొరబడేలా.. ఖచ్చితమైన లక్ష్యంతో దెబ్బకొట్టేలా శిక్షణ ఇచ్చారు. వీరు అత్యంత వేగంగా వెళ్తారు. అదే సమయంలో దాడులు కూడా చేస్తారు.
భైరవ్ దళంలో ఇప్పటికే 15 బెటాలియన్లను రిక్రూట్ చేసుకున్నారు. వీరందరిని చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరించారు. భవిష్యత్తు కాలంలో బెటాలియన్ల సంఖ్యను 25 కు పెంచబోతున్నారు. రాజస్థాన్లోని ఎడారి ప్రాంతంలో భైరవ్ దళాలకు అత్యంత కఠినమైన శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ “సన్స్ ఆఫ్ ది సాయిల్” అనే సూత్రాన్ని అమలు చేస్తున్నారు. ఈ ప్రకారం ఈ దళంలో స్థానికులకు పెద్దపీట వేస్తున్నారు. రాజస్థాన్ ప్రాంతంపై పూర్తిస్థాయిలో అవగాహన ఉన్న వారిని మాత్రమే ఈ దళంలోకి తీసుకుంటున్నారు. వీరిని డెజర్ట్ ఆఫ్ సాయిల్స్ అని పిలుస్తున్నారు. ఈనెల 15న జైపూర్ ప్రాంతంలో ఆర్మీ డే జరుగుతుంది. ఆ రోజున జరిగే కవాతులో బైరవ్ దళం తొలిసారిగా పరేడ్లో పాల్గొంటుంది..
కేవలం ఈ సైన్యాన్ని మాత్రమే కాకుండా, రుద్ర బ్రిగేడ్స్ పేరుతో అత్యంత శక్తివంతమైన వ్యవస్థను భారత సైన్యం ఏర్పాటు చేసింది. ఇటీవల అమెరికా వెనిజులలో దాడి జరిపినప్పుడు డెల్టా ఫోర్స్ అనే విభాగాన్ని ఉపయోగించింది. దాని గురించి ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరిగింది. అయితే డెల్టా ఫోర్స్ కు మించి భారత్ భైరవ్ అనే దళాన్ని సిద్ధం చేసింది.