Jana Nayagan Postponed: సెన్సార్ బోర్డు నుండి ఒక సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ రాకుండా ఉండడం ఇప్పటి వరకు హిస్టరీ లో ఏ సినిమాకు జరగలేదు. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ ‘పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ సినిమాకు సెన్సార్ నుండి సమస్యలు వచ్చాయి. కానీ ఎన్టీఆర్ తన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చిత్రాన్ని విడుదల చేసుకునేలా చేసాడు. ఇక ఆ తర్వాత ఎప్పుడూ కూడా సెన్సార్ నుండి ఇబ్బందులు పడిన సినిమాలు లేవు. A సర్టిఫికేట్ కాకుండా UA లేదా U సర్టిఫికేట్ కోసం పోరాటం చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ, అసలు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించడం మాత్రం ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు అలాంటి సంఘటన తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) నటించిన ‘జన నాయగన్'(Jana Nayagan Movie) విషయం లోనే మనం చూస్తున్నాము. జనవరి 9 న ఈ చిత్రం విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.
ఓవర్సీస్ లో ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా రికార్డు స్థాయిలో జరిగాయి. రీసెంట్ గానే బుక్ మై షో యాప్ లో ఈ బెంగళూరు మరియు ఇతర ప్రాంతాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టారు. సినిమా విడుదలకు సర్వం సిద్ధం, ఒక సెన్సార్ సర్టిఫికేట్ తప్ప. ఈ సినిమాలో సమాజం పై విద్వేషాలు రెచ్చగొట్టే సన్నివేశాలు ఉన్నాయని, అందుకే ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదని సెన్సార్ బోర్డు వారు చెప్తున్నారు. ఈ చిత్రం బాలయ్య ‘భగవంత్ కేసరి’ కి రీమేక్ గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి నేషనల్ అవార్డు వచ్చింది. ఏ సినిమాకు అయితే నేషనల్ అవార్డు వచ్చిందో, అలాంటి సినిమా రీమేక్ కి సెన్సార్ అభ్యంతరం చెప్పడం గమనార్హం. అయితే మూవీ టీం మద్రాసు హై కోర్టు లో పిటీషన్ వేసింది. నేడు ఈ పిటీషన్ ని విచారించిన హై కోర్టు, తుది తీర్పుని జనవరి 9 ఉదయానికి వాయిదా వేసింది.
అంటే ఈ సినిమా విడుదల తేదీ రోజునే తీర్పు ఇస్తుంది అన్నమాట. ఆ రోజు తీర్పు రావడం అంటే, సినిమా అధికారికంగా వాయిదా పడినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే తీర్పు వచ్చిన తర్వాత సెన్సార్ చేయాలి. సెన్సార్ చేసిన తర్వాత బోర్డు మెంబెర్స్ చెప్పే కట్స్ ని ఎడిట్ చెయ్యాలి. అవన్నీ చేసిన తర్వాతే సినిమా బయటకు వస్తుంది. ఇవన్నీ చేయడానికి కనీసం రెండు రోజుల సమయం పడుతుంది. కాబట్టి ఈ చిత్రాన్ని జనవరి 14 కి వాయిదా వేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించబోతున్నారు. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఇలా ఒక సినిమాని ఇబ్బంది పెట్టడం దారుణం, ఇదంతా స్టాలిన్ ప్రభుత్వమే చేయిస్తుందని సోషల్ మీడియా లో విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.