
మన దేశంలో ముంబై.. అస్సాం రాష్ర్టాలను ప్రతీ ఏడాది వర్షాలు ముంచెత్తాయి. ఈ ఏడాది కూడా అలాగే వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. మొత్తానికి అక్కడి ప్రజలకు ఈ వర్షాలు.. వరదలు వారి జీవితంలో ఓ భాగమైపోయాయి. ముఖ్యంగా అస్సాం ప్రజలు దృష్టిలో వర్షాలంటే.. ఓ భయానక వాతావరణం. ఎందుకంటే వాళ్లకు వర్షాలు వరదలతో సమానం. వరదల వల్ల వాళ్ళు ఆస్తి నష్టంతో తీవ్రంగా ఇబ్బందులు పడటం వాళ్లకు అలవాటుగా మారిపోయింది. ఒకటి రెండు సంవత్సరాలు కాదు, దశాబ్ధాలుగా వారి జీవితాలు వరదల్లోనే మగ్గిపోతున్నాయి. పైగా వరదలు కారణంగా తమ ఆప్తుల్ని కోలుపోవడమే కాకుండా.. ఆ వరదల సమయంలో తిండి కోసం ఎదురుచూస్తూ బతకడం నరకం అంటుంటారు వారు. ఇలా వాళ్ల జీవితాలు ఆ వరదల కాలంలో నల్లమబ్బు కమ్మేసిన సూర్యుడులా బిక్కుబిక్కుమంటూ బతుకుతారు.
Also Read: టాలీవుడ్ డ్రగ్స్ దందాపై హీరోయిన్ కామెంట్? పోలీసుల కౌంటర్
అయితే ఇలాంటి అనుభవాన్ని తానూ అనుభవించానని.. నరకాన్ని చూశానని.. మన శత్రువుకి కూడా అలాంటి ఎక్స్ పీరియన్స్ రాకూడదని తెగ బాధ పడుతుంది హాట్ బ్యూటీ నభా నటేష్. ఎప్పుడూ టర్కీకోడిలా ఎనర్జిటిక్ గా ఉల్లాసంగా కనిపించే నభా జీవితంలో కన్నీళ్లు పెట్టించే కష్టాలు కూడా ఉన్నాయని తెలిసిన అమెగారి అభిమానులు తెగ కలత చెందుతున్నారు. ఇంతకీ నభా వరదల వల్ల వచ్చే కష్టాలు గురించి చెబుతూ.. ‘ఆ మధ్య మేము అంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి అస్సాం వెళ్ళాము. జస్ట్ ఎంజాయ్ చేద్దామని. కానీ మాకు అప్పుడు నరకమే కనిపించింది. అస్సాంలో ఉండగా వరదలు వచ్చాయి. ఓ రోజు రాత్రంతా మేము వర్షాల్లో..వరదల్లో గడపాల్సి వచ్చింది. సరిగ్గా వర్షాల సీజన్ ప్రారంభ సమయంలోనే కజిరంగా పార్క్ ని చూడటానికి మేము వెళ్లి తప్పు చేశాము. మధ్నాహ్నం వరకూ బాగుంది. కానీ సడెన్ గా భారీగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలైంది.
Also Read: పవర్ స్టార్ బర్త్ డే రెండో గిప్ట్.. #PSPK27 ప్రీ లుక్ రిలీజ్
మేము అప్పటికే బయటకు వచ్చేసాం. దాంతో ఆ వరదల్లో చిక్కుకున్నాం. ఆ రోజే కాకుండా మరుసటి రోజు వరకూ బాగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవు. అని తన వరదల బాధా అనుభవాన్ని నభా చెప్పుకుని తెగ బాధ పడింది. ప్రస్తుతం నభా `సోలో బ్రతుకే సోబెటర్` సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. అలాగే `అల్లుడు అదుర్స్` సినిమాలో కూడా నటిస్తోంది. మొత్తానికి `ఇస్మార్ట్ శంకర్`తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుని లైమ్ లైట్ లోకి వచ్చిన ఈ స్మాల్ బ్యూటీ బాగానే కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుంది.