Homeజాతీయ వార్తలుWest Bengal Politics: మమతకు ఎదురొడ్డి నిలిచిన వ్యక్తి... కంటపడగానే సువెందు అధికారి ఏం చేశాడో...

West Bengal Politics: మమతకు ఎదురొడ్డి నిలిచిన వ్యక్తి… కంటపడగానే సువెందు అధికారి ఏం చేశాడో తెలుసా

West Bengal Politics: పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి గతంలో హింస లేదా దాడులు లేదా బంగ్లాదేశ్ నుంచి చోటుచేసుకుంటున్న అక్రమ వలసల గురించి వార్తలు వచ్చేవి. కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారుల మీద దాడులు.. ప్రతిపక్ష నాయకుల మీద దాడులు.. ప్రభుత్వ పథకాలలో టీఎంసీ నేతల దోపిడీ.. ఇటువంటి అంశాల గురించే స్థానిక మీడియా నుంచి జాతీయ మీడియా వరకు వార్తలు వచ్చేవి. కానీ ఇప్పుడు బెంగాల్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా అక్కడ మమతా […]

West Bengal Politics: పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి గతంలో హింస లేదా దాడులు లేదా బంగ్లాదేశ్ నుంచి చోటుచేసుకుంటున్న అక్రమ వలసల గురించి వార్తలు వచ్చేవి. కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారుల మీద దాడులు.. ప్రతిపక్ష నాయకుల మీద దాడులు.. ప్రభుత్వ పథకాలలో టీఎంసీ నేతల దోపిడీ.. ఇటువంటి అంశాల గురించే స్థానిక మీడియా నుంచి జాతీయ మీడియా వరకు వార్తలు వచ్చేవి. కానీ ఇప్పుడు బెంగాల్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా అక్కడ మమతా బెనర్జీ అధికారం కోల్పోయిన తర్వాత బెంగాల్ రాష్ట్రంలో సంపూర్ణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

ఆర్జీ కార్ ఆస్పత్రిలో..

ఆర్జీ కార్ ఆస్పత్రిలో జరిగిన దారుణంలో వైద్య విద్యార్థిని కన్ను మూసింది. ఈ ఘటన వెనుక ఉన్న వ్యక్తులను పట్టుకోవడంలో నాటి మమతా ప్రభుత్వం విఫలమైంది. విచారణలో జాప్యం చేసింది. దీనిని నిరసిస్తూ నాడు బెంగాల్ రాష్ట్రం మొత్తం అట్టుడికి పోయింది. నిరసనలు అణిచివేయడానికి బెంగాల్ ప్రభుత్వం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసింది. చివరికి నిరసనకారుల మీద రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడానికి కూడా వెనకాడ లేదు. నాడు పోలీసులను నిరసిస్తూ బలరాంబోసు అనే సాధువు.. జాతీయ జెండాను చేతుల్లో పట్టుకుని ఆందోళన నిర్వహించాడు. అతడు చేసిన ఆందోళన అప్పట్లో సంచలనం కలిగించింది. పోలీసులు ఏ స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ అతడు ఏమాత్రం వెనకాడ లేదు. దానికి సంబంధించిన వీడియోలను తొక్కివేయడానికి మమత చేయని ప్రయత్నం అంటూ లేదు. కాని చివరికి ఆ వీడియోలు బయటికి రావడంతో మమత ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది.

అతడి పేరు బలరాంబోస్

పోలీసులకు వ్యతిరేకంగా అభ్యసన వ్యక్తం చేసిన ఆ వ్యక్తి పేరు బలరాంబోస్. అతడు చేసిన నిరసన సంచలనం కలిగించడం మాత్రమే కాదు… మమత ప్రభుత్వానికి అంతిమ ఘడియలను తీసుకొచ్చింది. ఇటీవల బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఒక సమావేశంలో మాట్లాడుతుండగా.. బలరాం బోస్ ముందు వరుసలో కూర్చున్నారు. ఆయనను గుర్తుపట్టి సువేందు కుర్చీ దిగి కిందికి వచ్చారు. బోస్ చేతులను పట్టుకున్నారు. గట్టిగా ఆలింగణం చేసుకున్నారు. ఆ తర్వాత శాలువా కప్పి సన్మానించారు. తనకు ఈ సన్మానాలు వద్దని.. ప్రభుత్వపరంగా గొప్పగా పరిపాలించి.. మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన సూచించారు. మమత మాదిరిగా దుర్మార్గపు విధానాలకు పాల్పడకుండా.. ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం కలిగించాలని సూచించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper