ఆంధ్రప్రదేశ్‌ఏపీ వ్యాక్సినేషన్ లో రికార్డు: అసలు కథ ఏమై ఉంటుందో?

ఏపీ వ్యాక్సినేషన్ లో రికార్డు: అసలు కథ ఏమై ఉంటుందో?

ఆంధ్రప్రదేశ్ లో ఒక్క రోజే పది లక్షల వ్యాక్సినేషన్ చేశామని చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్ని టీవీ ఛానళ్లు, వెబ్ సైట్లు, సోషల్ మీడియాలో హోరెత్తిన వార్త ఇది. నిజం చెప్పాలంటే దీని వెనుక పెద్ద కథే ఉందని తెలుస్తోంది. ఆదివారం ఒక రోజే ఏపీలో వేసిన వ్యాక్సిన్ల సంఖ్య13,26,271 గా నమోదైంది. ఒక రాష్ర్టం ఇన్ని వ్యాక్సిన్లు వేయడం రికార్డే. దీని గురించి జగన్ సర్కారు మద్దతుదారులు గొప్పలు చెప్పుకుంటున్నారు.

సోషల్ మీడియాలో దీనిపై హోరెత్తిస్తున్నారు. కానీ ఈ రికార్డు సాధించడం వెనుక ఓ వైఫల్యం కూడా దాగి ఉందనే విషయం చాలా మందికి తెలియదు. గత కొన్ని రోజుల నుంచి ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతోంది. ఆదివారం రికార్డు కోసం మిగతా రోజుల్లో టీకాలు వేయడం తగ్గించినట్లు తెలుస్తోంది. వారం రోజుల ముందు నుంచి తగ్గించి ఆదివారం ఒక్క రోజే వాటిని వేసేందుకు సిద్ధమైనట్లు కొవిడ్ యాప్ లో డేటాను పరిశీలిస్తే విషయం స్పష్టంగా తెలుస్తోంది.

ఆదివారానికి ముందు నాలుగు రోజులు కలిపి ఏపీలో వేసిన వ్యాక్సిన్లు కనీసం లక్ష కూడా లేవు. మొత్తంగా 90 వేల లోపే వేశారు. కానీ ఆదివారం మాత్రం అనూహ్య స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగింది. ఒక్క కృష్ణా జిల్లాలోనే ఆదివారం 1.40 లక్షల టీకాలు వేసినట్లు తెలుస్తోంది. గత వారం రోజుల్లో రాష్ర్టానికి సరిపడ వ్యాక్సిన్లు రాక అంత తక్కువగా జరిగిందా? లేక అప్పుడు కావాలనే వ్యాక్సిన్లు తగ్గించి ఆదివారం వేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఒక్క రోజులో 13 లక్షల వ్యాక్సిన్లతో రికార్డు నెలకొల్పడం ద్వారా ఏం సాధిస్తారనేదే ప్రశ్న. ఒక్క రోజు దేశం మొత్తం ఇటు చూస్తే సరిపోతుందా? ముందు రోజుల్లో అంత తక్కువగా వ్యాక్సినేషన్ వేసి ఒక్క రోజే ఇన్ని వ్యాక్సిన్లు వేశామని చెప్పుకోవడంలో విశేషమేముందోనని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

CM Jagan : వెంటపడితే వేటాడడమే.. బీజేపీని వదలని జగన్

దోస్తీకి దోస్తీ.. శత్రుత్వానికి శత్రుత్వం అని తెలిసిన జగన్ వదలలేదు. అంతటి సోనియాగాంధీని, కాంగ్రెస్ ను ఎదురించిన జగన్ కు ఈ బీజేపీ ఒక లెక్కకాదు. పైగా అసలు ఏపీలో బీజేపీకి ఏమాత్రం బలం లేదు.

Chiranjeevi Jagan: సీఎం జగన్ తో ముగిసిన చిరంజీవి భేటి.. కీలక విషయాలు వెల్లడి..!

Chiranjeevi Jagan Meeting: సినిమా టికెట్ల ధరల తగ్గింపు అంశం ఏపీలో కొద్దిరోజులుగా వివాదాస్పదంగా మారింది. గడిచిన రెండేళ్లుగా కరోనాతో ఇండస్ట్రీ అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లుండి ప్రభుత్వం...

Most Popular

Divvela Madhuri

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...
Delhi Protests

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...
Jagan

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...
Bhogapuram Airport Opening

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....