Homeజాతీయ వార్తలుAkhilesh Yadav Bengal Tour: అఖిలేష్‌ ఆకస్మిక బెంగాల్‌ పర్యటన... కీలక అగ్రిమెంట్‌ క్యాన్సిల్‌!

Akhilesh Yadav Bengal Tour: అఖిలేష్‌ ఆకస్మిక బెంగాల్‌ పర్యటన… కీలక అగ్రిమెంట్‌ క్యాన్సిల్‌!

Akhilesh Yadav Bengal Tour: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గవర్నర్‌ రద్దు చేశారు. తాను రాజీనామా చేసేది లేదన్న మమతా బెనర్జీతోపాటు ప్రభుత్వం మొత్తాన్ని రద్దు చేస్తున్నట్లు గరవ్నర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మే 7వ తేదీ అర్ధరాత్రితో మమత పాలన అంతమైంది. రాజ్యాంగంలోని 174 అధికరణ, క్లాస్‌ 2, సబ్‌క్లాస్‌ 3 ఆధారంగా రద్దు చేశారు. మే 9న సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఎన్నికల ఓటమి నేపథ్యం..
ఏప్రి. 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరిగిన ఎన్నికల్లో 92.47 శాతం పోలింగ్‌ రికార్డు సృష్టించింది. బీజేపీ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారాలను అధిగమించి స్పష్ట ఆధిక్యత సాధించింది. మమతా ‘ఓడలేదు, కుట్ర జరిగింది‘ అంటూ ఎన్నికల కమిషన్, కేంద్ర బలగాలపై ఆరోపణలు చేసి రాజీనామా నిరాకరించారు. రాహుల్‌ గాంధీ సమర్థనతో ధైర్యం చెందిన ఆమె, 15 సభ్యుల వాస్తవ పరిశీలన కమిటీ ఏర్పాటు చేసి పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. గవర్నర్‌ రాజ్యాంగ పరిధుల్లో చర్య తీసుకుని ప్రజల ఆశీస్సులకు అందుకున్నారు.

అఖిలేష్‌–మమత రహస్య చర్చలు..
ఓటమి తర్వాత మమత పదవి తొలగించే కొన్ని గంటల ముందు ఆమె ఇంటికి అఖిలేష్‌ యాదవ్‌ వచ్చారు. మమతను ఓదార్చారు. అంతా మమత కోసమే వచ్చారనుకున్నారు. కానీ అఖిలేష్‌ వెళ్లిపోయిన తర్వాత పార్టీ చేసిన ప్రకటన ఆశ్చర్యానికి గురిచేసింది. ఐప్యాక్‌తో (ప్రశాంత్‌ కిశోర్, వీణా దీ) ఉన్న ఒప్పందాన్ని రద్దు చేస్తుమని ప్రకటించారు. మమత సమాజ్‌వాదీ పార్టీ వ్యూహాల ఫైల్‌ అందజేసి, 2027 యూపీ ఎన్నికలకు ముందుగా ఐప్యాక్‌ను తప్పించుకున్నారు. దీనికోసమే అఖిలేష్‌ వచ్చారని వర్గాల విశ్లేషణ.

ఐప్యాక్‌ మేనేజ్‌మెంట్‌ క్షీణత
2012–14లో బీజేపీ మోదీ తేజస్సును ఎత్తిచూపిన ఐప్యాక్‌ తర్వాత వ్యతిరేక పక్షాలకు మారి విఫలమైంది. బెంగాల్, డీఎంకే, వైసీపీ, ఏపీలో పార్టీలు–సీఎంలు ఘోరంగా ఓడిపోయారు. ఈడీ దాడులు, గెలిచినవారికి క్రెడిట్‌ ఆపాదన వల్ల నమ్మకం పోయింది. బీజేపీ 2014 తర్వాత దూరం చేసింది. చైతన్య, నారాయణ విద్యా సంస్థల్లా ‘మంచి విద్యార్థులను మరింత మెరుగుపరచి క్రెడిట్‌ తీసుకునే‘ వ్యూహం ఐప్యాక్‌కు కూడా వర్తించింది. ఇప్పుడు అది కాలం చెల్లిన సంస్థగా మారింది.

మమతా పతనం ప్రజాస్వామ్య విజయం, రాజ్యాంగ ఆధారాలపై గెలుపు. అఖిలేష్‌ ఆచరణాత్మకత రాష్ట్రీయ రాజకీయాల్లో కొత్త మార్గం. ఐప్యాక్‌ వంటి ’మ్యాజిక్‌ బులెట్‌’లపై ఆధారపడకుండా స్థానిక వ్యూహాలే గెలుపు రహస్యం. బీజేపీ ధైర్యం పెరిగినా, ప్రతిపక్షాలు అలయన్స్‌లతో ప్రతిఘటించాలి. లేకపోతే, దేశ విధానాలు ఏకపక్షంగా సాగతాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular