Homeజాతీయ వార్తలుBJP Uttar Pradesh: యూపీలో హ్యాట్రిక్‌పై కన్నేసిన బీజేపీ.. ప్లాన్‌ రెడీ చేసిన కమలం పార్టీ!

BJP Uttar Pradesh: యూపీలో హ్యాట్రిక్‌పై కన్నేసిన బీజేపీ.. ప్లాన్‌ రెడీ చేసిన కమలం పార్టీ!

BJP Uttar Pradesh: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. బెంగాల్‌లో బీజేపీ ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ గెలుపు తర్వాత ఇప్పుడు బీజేపీ ఉత్తరప్రదేశ్‌పై దృష్టిపెట్టింది. ఈ రాష్ట్రంలో 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. యూపీ దేవంలో అతిపెద్ద రాష్ట్రం. ఇక్కడ అత్యధిక ఎంపీలు ఉన్నారు. ఇక్కడ గెలవడం బీజేపీకి అవసరం. ఇప్పటికే రెండుసార్లు వరుసగా గెలిచింది. వచ్చే ఏడాది కూడా గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని చూస్తోంది. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో యోగి […]

BJP Uttar Pradesh: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. బెంగాల్‌లో బీజేపీ ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ గెలుపు తర్వాత ఇప్పుడు బీజేపీ ఉత్తరప్రదేశ్‌పై దృష్టిపెట్టింది. ఈ రాష్ట్రంలో 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. యూపీ దేవంలో అతిపెద్ద రాష్ట్రం. ఇక్కడ అత్యధిక ఎంపీలు ఉన్నారు. ఇక్కడ గెలవడం బీజేపీకి అవసరం. ఇప్పటికే రెండుసార్లు వరుసగా గెలిచింది. వచ్చే ఏడాది కూడా గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని చూస్తోంది. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్‌కు మూడోసారి అవకాశం కల్పించుకుని, 2029 లోక్‌సభలో ఘన విజయం లక్ష్యంగా పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. యూపీ అతిపెద్ద రాష్ట్రంగా 80+ లోక్‌సభ సీట్లతో కీలకం. ఇక్కడ హ్యాట్రిక్‌లే దేశ రాజకీయాల భవిష్యత్తు నిర్ణయిస్తుంది.

బెంగాల్‌ విజయం నేపథ్యం
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం పతనం తర్వాత సువేందు అధికారి సీఎం కావడం బీజేపీకి భారీ ఆత్మవిశ్వాసం. ఈ గెలుపు హిందుత్వ, అభివృద్ధి వ్యూహాల విజయంగా మారింది. ఇప్పుడు యూపీలో 2017, 2022 విజయాలను మూడోసారి పునరావృతం చేయాలని పార్టీ లక్ష్యం. స్పంస్త్‌ గాంధీ, ప్రతిపక్షాల బలహీనతను పట్టుకుని బీజేపీ ముందస్తు చర్యలు ప్రారంభించింది.

కొత్త ఎన్నికల ఆయుధం
బీజేపీ యూపీలో పంచాయతీ, ఉప ఎన్నికల్లో ప్రయోగించిన ఫేషియల్‌ రికగ్నిషన్‌ సాంకేతికత గొప్ప విజయం వహించింది. ఓటర్‌ జాబితా డేటాబేస్‌తో ఏఐ పోలిక చేసి నకిలీ ఓట్లను ఆపడం సులభమైంది. తెలంగాణ స్థానిక ఎన్నికల్లోనూ విజయవంతమైంది. 2023–24 నుంచి పరీక్షల్లో ఒకరి పేరిట ఇతరుల రాతలను అరికట్టిన ఈ సాంకేతికత, 2027లో 2 లక్షలకుపైగా బూత్‌లలో అమలు చేస్తారు. ఈవీఎం, వీవీప్యాట్‌తో పాటు ఎస్‌వీఎన్‌(స్టేట్‌ వోటర్‌ నంబర్‌) అమలు తప్పుడు ఓట్లను పూర్తిగా తొలగిస్తుంది.

ఇప్పటికే సర్‌ అమలు..
ఉత్తరప్రదేశ్‌లో ఈసీ ఇప్పటికే సర్‌ పూర్తి చేసింది. దీంతో 15 శాతం ఓటర్లను తొలగించింది. ఇక వచ్చే ఎన్నికల్లో ఏఐ బేస్‌ ఫేషియల్‌ రికగ్నిషన్‌ అమలు చేయనుంది. దీంతో సమాజ్‌వాదీ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో నకిలీ ఓట్లకు చెక్‌ పడుతుంది. దీంతో బీజేపీ గెలుపు ఈజీ అవుతుంది. ఈ సంస్కరణలు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

బెంగాల్‌ విజయం బీజేపీకి యూపీలో హ్యాట్రిక్‌ అవకాశం తెచ్చిపెట్టింది. ఏఐ ఫేషియల్‌ రికగ్నిషన్‌ వంటి ఆధునిక సాంకేతికతలు నిస్పక్ష ఎన్నికలకు మార్గం సుగమం చేస్తాయి. ప్రతిపక్షాలు ఈ మార్పులకు తగ్గట్టు స్థానిక వ్యూహాలు రూపొందించాలి. యోగి మ్యాజిక్‌ మూడోసారి పునరావృతం అవుతుంది. 2029 లోక్‌సభలో బీజేపీ ఆధిపత్యం మరింత బలపడుతుంది. టెక్నాలజీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందనే సందేశం ఈ ప్రయోగాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper