Ajit Doval operation : ఇవన్నీ తెలుసు కాబట్టే అజిత్ దోవల్ వరల్డ్ నెంబర్ వన్ డిఫెన్స్ అడ్వైజర్ అయ్యారు. ఆయన పేరుకు మాత్రమే డిఫెన్స్ అడ్వైజర్.. ఆయన చేసిన పనులు మాత్రం జేమ్స్ బాండ్ సినిమాను మించి ఉంటాయి. ఎక్కడి పాకిస్తాన్.. ఎక్కడి ఇండియా.. ఏడు సంవత్సరాల పాటు గూడ చర్యం చేయడం ఏంటి.. ఉగ్రవాదుల పనితీరును పసిగట్టడం ఏంటి.. పాకిస్తాన్ యాసలో ఉర్దూ మాట్లాడి.. ఏమాత్రం అనుమానం రాకుండా చేసుకోవడమేంటి.. రాస్తుంటేనే రోమాలు నిక్కబొడుస్తుంటే.. ఈ పని చేసిన వ్యక్తికి ఇంకెలా ఉండాలి. ఇలాంటి పనులు చేశాడు కాబట్టే కదా అజిత్ దోవల్ ను నరేంద్ర మోడీ ఏరి కోరి తనను డిఫెన్స్ అడ్వైజర్ గా నియమించింది.. కనీసం మోడీ పైన అయినా విమర్శలు వస్తాయేమో గాని.. అజిత్ దోవల్ మీద ఒక విమర్శ కూడా రాదు. ఎందుకంటే అతడు అసలైన దేశభక్తుడు. సిసలైన ఇండియన్ ప్రేమికుడు. అతడి దేశభక్తిని చూసి శత్రుదేశాలు సైతం ముచ్చట పడుతుంటాయి. అతనిని చూసి సెల్యూట్ చేసేస్తుంటాయి. మాకు కావాలి ఇటువంటి సెక్యూరిటీ అడ్వైజర్ అని అనుకుంటాయి.
Also Read : సింధూ జలాలివ్వండి ప్లీజ్.. భారత్ తో పాకిస్తాన్ కాళ్లబేరం.. ఇప్పుడు తెలిసొచ్చింది..
ఇప్పుడు ఉగ్రవాద దేశంతో ఇంకా ఇబ్బందికర పరిస్థితే కొనసాగుతోంది. అజిత్ దోవల్ మాస్టర్ మైండ్ చిత్ర విచిత్రమైన ఎత్తులు వేస్తూనే ఉంది. ఎక్కడ నొక్కాలి.. ఎక్కడ తొక్కాలి.. ఇంకెక్కడ ఇబ్బంది పెట్టాలి అనే దిశగానే ఆలోచనలు సాగుతున్నాయి. అందువల్లే పహల్గాం ఘటన తర్వాత దేశ ప్రధాని నరేంద్ర మోడీ నమ్మింది నలుగురు వ్యక్తులను మాత్రమే. అందులో అజిత్ దోవల్ మొదటి స్థానంలో ఉంటాడు. అజిత్ దోవల్ ఆధ్వర్యంలో ఎన్నో గూడచారి ఆపరేషన్లు జరిగాయి. అందులో ఎంతమంది కరుడుగట్టిన ఉగ్రవాదులు పాకిస్థాన్ లోనే చనిపోయారు. ఇది ఎవరు చేశారు.. ఎప్పుడు చేశారు.. ఎందుకు చేశారు అనే ప్రశ్నలకు సమాధానం అజిత్ దోవల్ మాత్రమే. అప్పుడే కాదు ఇప్పుడు కూడా అజిత్ దోవల్ అలాంటి ఆపరేషన్ మొదలుపెట్టారు. అందువల్లే పాకిస్తాన్ మాజీ సైనికాధిపతి అసిన్ మునీర్ కాళ్ళ బేరానికి వచ్చాడు.. బాబ్బాబూ.. దయచేసి నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు.. ఆ ఏడుగురు ఉగ్రవాదుల జాబితా మాత్రమే కాదు.. వారిని బతికి ఉండగానే నీకు అప్పగిస్తాను.. నువ్వు ఏమైనా చేసుకో.. నాకు మాత్రం ప్రాణ భిక్ష పెట్టు అని వర్తమానం పెంపాడు. ఇవన్నీ అజిత్ దోవల్ కు తెలియనివి కాదు. ఆయన చూడనివి కాదు. అందుకే అత్యంత నిశ్శబ్దంగా తన ఆపరేషన్ మొదలుపెట్టాడు. ఇప్పటికే ఆసీమ్ మునీర్ ప్రతిపాదించిన ఏడుగురు ఉగ్రవాదుల జాబితాలో.. ఇద్దరు చనిపోయారని తెలుస్తోంది. ఇంకా మిగతా 5 గురు రోజులు లెక్కపెట్టుకుంటున్నారని తెలుస్తోంది.. వాళ్లు బంకర్లలో దాక్కున్నా.. అమెరికాలో దాక్కున్నా.. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో నక్కినక్కి ఉన్నా.. తరుముకుంటూ వస్తాడు అజిత్ దోవల్.. చేతికి మట్టి అంటకుండా.. తుపాకీ లోనుంచి గుండు బయటపడకుండా.. నిశ్శబ్దంగా పనిచేస్తాడు.. అక్కడ ఆ ఉగ్రవాదులు చనిపోయారని.. లోకాన్ని విడిచి వెళ్లిపోయారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అజిత్ దోవల్ జేమ్స్ బాండ్ 007 కు మించిన గూడచారి..