Indus Waters Treaty : ఇటీవల భారత్ సింధు జలాలను ఉగ్రవాద దేశానికి వెళ్లకుండా కట్టడి చేసింది.. అంతేకాదు గతంలో కుదుర్చుకున్న అగ్రిమెంట్ పూర్తిగా రద్దుచేసి పడేసింది. అంతేకాదు సింధు నీటి ప్రవాహాన్ని దారి మళ్ళేలా చేసింది. అక్కడితోనే కాదు యుద్ధ ప్రాతిపదికన సింధు రివర్ మీద ప్రాజెక్టులు కన్స్ట్రక్షన్ చేస్తోంది. మొత్తంగా ఉగ్రవాద దేశానికి చుక్కలు చూపించింది.. ఎప్పుడైతే పహల్గాం దాడికి పాల్పడి.. మన దేశ టూరిస్టులను ఉగ్రవాదులు చంపేశారో.. అప్పటినుంచి భారత్ మండే అగ్నిగోళం లాగా ఉగ్రవాద దేశంపై విరుచుకుపడింది. అంతేకాదు ఏ ఆకాశాన్ని కూడా వదలకుండా తొక్కిపడేస్తోంది. టెర్రర్ అటాక్స్ కు గట్టిగా బదులు చెబుతూనే.. దాడులు కూడా విపరీతంగా చేస్తోంది. మొత్తంగా తను ఏమిటో శత్రుదేశానికి అర్థమయ్యేలా చూపిస్తోంది.. తనతో పెట్టుకుంటే మట్టిలో కలిసిపోవడం ఖాయమని సంకేతాలు ఇస్తోంది.
Also Read : Also Read : అందుకే పాకిస్థాన్ కాల్పుల విరమణ కోరింది: సైనిక చరిత్రకారుడి సంచలన నిజాలు
కాళ్ళ బేరానికి..
సింధు నీటిని కట్టడి చేసిన తర్వాత భారత్ పై ఉగ్రవాద దేశం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు తీవ్ర స్వరంతో మాట్లాడింది.. ఫైరింగ్ నిలుపుదలకు ఒప్పుకున్న తర్వాత భారత్.. సింధు జలాల విషయంలో వెనక్కి తగ్గబోమని ప్రకటించింది. దీంతో ఉగ్రవాద దేశానికి మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. సింధూ నది నీళ్లు లేకపోతే ఉగ్రవాద దేశానికి తాగడానికి నీరు కూడా ఉండదు. చివరికి పంటలు పండడానికి కూడా నీరు ఉండదు. అప్పుడు ఉగ్రవాద దేశం తీవ్ర కరువులో కొట్టుమిట్టాల్సి ఉంటుంది. అంతేకాదు తిండి గింజల కోసం ఇబ్బంది పడాల్సి ఉంటుంది.. ఈ క్రమంలో సింధు వాటర్ ను కట్టడి చేస్తే మనదేశంలో తీవ్రమైన కరువు వాటిల్లుతుంది.. దీనికి సంబంధించి ఇండియన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు పాక్ గవర్నమెంట్ ఒక లెటర్ రాసింది. సింధు వాటర్ విషయంలో డిస్కస్ చేయడానికి తాము రెడీగా ఉన్నామని ఉగ్రవాద దేశం ఆ లెటర్లో స్పష్టం చేసింది.. ఇప్పటికే సింధు వాటర్ విషయంలో రక్తం, నీరు కలిసి ముందుకు సాగలేవని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్లారిటీ ఇచ్చారు.. ఉగ్రవాద దేశంతో చర్చలు జరిపితే టెర్రరిజం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పైనే అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. వాస్తవానికి సింధు వాటర్ అగ్రిమెంట్ 1960లో కుదిరింది. వరల్డ్ బ్యాంక్ మీడియేటర్ గా వ్యవహరించింది. నాడు అగ్రిమెంట్ పై అప్పట్లో ప్రధానమంత్రిగా పనిచేసిన నెహ్రూ.. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ సిగ్నేచర్లు చేశారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం సింధు కు సబ్ రివర్లు అయిన రావి, బియాస్, సట్లెజ్ పై ఇండియన్ గవర్నమెంట్ కు ఓవరాల్ రైట్స్ వచ్చాయి. సింధు.. అడిషనల్ రివర్స్ అయిన జీలం, చీనాబ్ పై పాక్ కు రైట్స్ దక్కాయి. టెర్రరిస్ట్ అటాక్ తర్వాత పాక్ కు దిమ్మ తిరిగే విధంగా సమాధానం చెప్పడానికి సింధూ రివర్ అగ్రిమెంట్ ను భారత్ పూర్తిస్థాయిలో క్యాన్సిల్ చేసింది.