chicken neck corridor : గత వారం నుంచి సోషల్ మీడియాలోపెద్ద పుకార్లు వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర భాగానా చికెన్ కారిడార్… బీహార్ లోని సీమాంచల్ కలిపి కేంద్రం ఒక యూనియన్ టెరిటరీగా (కేంద్రపాలిత ప్రాంతంగా ) చేయబోతున్నది విపరీతమైన ప్రచారం చేస్తోంది. దీనికి బీహార్, బెంగాల్ నేతలు మండిపడుతున్నారు. సీఎం మమతా బెంగాల్ ను విభిస్తున్నారని కేంద్రంపై ఆరోపించారు. దీనికి కారణం కేంద్రం ఇద్దరు గవర్నర్లను మార్చడం ఆయువుపోసింది.
పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి ప్రాంతంలో ఉన్న ఈ చికెన్ నెక్ కారిడార్ భారత్‌కు వ్యూహాత్మకంగా చాలా కీలకం. కేవలం సుమారు 20-22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉన్న ఈ సన్నని భూభాగం ద్వారానే ఈశాన్య భారతదేశంలోని ఎనిమిది రాష్ట్రాలు దేశ మిగతా భాగాలతో అనుసంధానమై ఉంటాయి. అందుకే దీనిని “సిలిగురి కారిడార్” లేదా “చికెన్ నెక్” అని పిలుస్తారు.
ఇటీవల అంతర్జాతీయ పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో ఈ ప్రాంత భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. చైనా, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ సరిహద్దులకు సమీపంలో ఉన్న ఈ కారిడార్‌పై ఎప్పటికప్పుడు వ్యూహాత్మక చర్చలు జరుగుతూనే ఉంటాయి.
ఈ నేపథ్యంలోనే బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో గవర్నర్ల మార్పు జరిగిందని, భద్రతా మరియు పరిపాలనా సమన్వయం కోసం కేంద్రం కొత్త వ్యూహం అమలు చేస్తోందేమోనన్న పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా మాత్రం ఇది సాధారణ పరిపాలనా నిర్ణయమేనని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి.
ఏమైనప్పటికీ, దేశ భద్రత పరంగా అత్యంత కీలకమైన చికెన్ నెక్ కారిడార్ చుట్టూ జరుగుతున్న రాజకీయ, పరిపాలనా పరిణామాలు ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి.
బెంగాల్ బీహార్ గవర్నర్ల మార్పు తో ఏదో జరుగుతుందని పుకార్లపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
