Homeహెల్త్‌Drink Water: పురుషులు, స్త్రీలు.. రోజూ ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి?

Drink Water: పురుషులు, స్త్రీలు.. రోజూ ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి?

Drink Water: మన శరీరంలో జీవనక్రియలు జరగడానికి ప్రధాన ఆధారం నీరు. తాగే నీటి ఆధారంగానే మన శరీరంలో ఉన్న మూత్రపిండాల పనితీరు ఆధారపడి ఉంటుంది. కొందరు దాహాంగా ఉన్నప్పుడు మాత్రమే నీరు తాగుతూ ఉంటారు. మరికొందరేమో అధికంగా నీరు తాగుతూ ఉంటారు. దాహంగా ఉన్నప్పుడు మాత్రమే నీరు తాగడం.. అతిగా నీరు తాగడం ఇవి రెండూ కూడా శరీరానికి ప్రమాదకరమే. దాహంగా ఉన్నప్పుడు మాత్రమే నీరు తాగితే మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడతాయి. రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. […]

Drink Water: మన శరీరంలో జీవనక్రియలు జరగడానికి ప్రధాన ఆధారం నీరు. తాగే నీటి ఆధారంగానే మన శరీరంలో ఉన్న మూత్రపిండాల పనితీరు ఆధారపడి ఉంటుంది. కొందరు దాహాంగా ఉన్నప్పుడు మాత్రమే నీరు తాగుతూ ఉంటారు. మరికొందరేమో అధికంగా నీరు తాగుతూ ఉంటారు. దాహంగా ఉన్నప్పుడు మాత్రమే నీరు తాగడం.. అతిగా నీరు తాగడం ఇవి రెండూ కూడా శరీరానికి ప్రమాదకరమే.

దాహంగా ఉన్నప్పుడు మాత్రమే నీరు తాగితే మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడతాయి. రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఒకవేళ నీరు అధికంగా తాగితే మూత్రపిండాలమీద ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. సోడియం, పొటాషియం వంటి లవణాలు తగ్గుతాయి. అప్పుడు గుండె మీద తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది.

వైద్యుల సూచన ప్రకారం.. ప్రతిరోజు 2.2 లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుంది. అలాగే పురుషులు మూడు లీటర్ల వరకు నీటిని తాగాలి. అయితే మధుమేహం.. ఇతర వ్యాధులతో బాధపడేవారు తీవ్రమైన దాహంతో ఉంటారు. అప్పుడు వారు ఎక్కువగా నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. మధుమేహం ఉన్నవారిలో చెక్కర నిల్వలు అధికంగా ఉంటాయి. పైగా మూత్రపిండాలు ఎక్కువగా బయటికి పంపించడం వల్ల ఎక్కువగా మూత్రం వస్తూ ఉంటుంది. అలాంటివారు ఎక్కువగా నీటిని తాగుతూ ఉంటారు. నీటిని అధికంగా తాగడం వల్ల మూత్రపిండాల మీద ఒత్తిడి పడుతుంది. అలాకాకుండా వైద్యులు సూచించిన దాని ప్రకారం నీటిని తాగాల్సి ఉంటుంది

వేసవికాలంలో విపరీతమైన దాహార్తి ఉంటుంది.. ఎండాకాలంలో శరీరం నుంచి లవణాలు అధికంగా బయటకు వెళ్తూ ఉంటాయి. చెమట విపరీతంగా పట్టడం వల్ల శరీరం అలసటకు గురవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కువగా నీరు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో నీరు అధికంగా తాగినప్పటికీ ఉపయోగం ఉండదు. మజ్జిగ లేదా పండ్ల రసాలు లేదా కొబ్బరినీళ్ళను తాగి చాలామంది తమ దాహాన్ని తీర్చుకుంటారు. అప్పుడు శరీరంలో లవణాల శాతం పెరిగి నీరసం అనేది తగ్గిపోతూ ఉంటుంది.

గమనిక: ఈ కథనం వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా పాఠకులకు అందించాం. ఈ కథనం వైద్యుల వైద్యానికి ప్రత్యామ్నాయం కాదని పాఠకులు గమనించాలి. ఒక వ్యక్తి ఎంత నీరు తీసుకోవాలి.. అనేది అతడి ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాలలో నీరు ఎక్కువగా తీసుకోవాల్సి కూడా ఉంటుంది. అలాంటి వారు వైద్యుల సలహాలు ఆధారంగా నీటిని తాగాల్సి ఉంటుందని గమనించాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper