Drink Water: మానవ శరీరం 65 శాతం నీటితో నిండి ఉంటుంది. అయితే శరీరం నుంచి వచ్చే చెమట, మూత్రం ద్వారా నీరు బయటకు వెళ్తుంది. దీంతో దాహం వేయడంతో మళ్లీ నీరు తాగే అవసరం ఏర్పడుతుంది. అయితే కొందరు నీరు తాగడానికి ఇష్టపడరు. కానీ ప్రతిరోజు మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా క్రమ పద్ధతిగా నీటిని తీసుకోవడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అని పేర్కొంటున్నారు. మరి ఏ సమయాల్లో నీటిని తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
Also Read: బిడ్డ జోలికి వచ్చిన అభిమాని పై కోపంతో ఊగిపోయిన దీపికా పదుకొనే!
కొందరు భోజనం చేసేటప్పుడు ఎంత తింటే అంతా నీరు తాగుతూ ఉంటారు. కానీ అలా చేయడం వల్ల జీర్ణ క్రియ సమస్యలు ఏర్పడతాయి. భోజనం చేయడానికి అంటే 15 నిమిషాల ముందే నీటిని తీసుకోవాలి. ఇలా నీరు తాగడం వల్ల జీర్ణ క్రియ సమస్యలు రాకుండా ఉంటాయి. తిన్నావా హారం ఆమ్లం ద్వారా జీర్ణం అవుతుంది. అయితే ముందే నీరు తాగడం వల్ల ఆమ్లం మరింతగా ఎక్కువ ఆహారం త్వరగా జీర్ణం కావడానికి అవకాశం ఉంటుంది.
స్నానం చేసే ముందు నీటిని తాగడం వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గే అవకాశం ఉంటుంది. స్నానం చేసేటప్పుడు శరీరంలోని అవయవాలు అన్ని కదులుతాయి. అయితే అంతకుముందే నీటిని తీసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. నీతో గుండె సమస్యల నుంచి బయటపడతారు.
ఉదయం లేవగానే చాలామంది టీ లేదా కాఫీ తాగుతూ ఉంటారు. కానీ వాటి స్థానంలో గోరువెచ్చటి నీటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతిరోజు ఒకే సమయంలో గోరువెచ్చని నీటిని తీసుకోవడం వల్ల.. కడుపులో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్తాయి. దీంతో ఆ తర్వాత ఎటువంటి ఆహారం తీసుకున్నా.. త్వరగా జీర్ణం అవుతుంది. లేకుంటే అప్పటికే కడుపులో ఉన్న వ్యర్థాలు తినే ఆహారం జీర్ణం కాకుండా అడ్డుపడుతూ ఉంటాయి.
రాత్రి నిద్రపోయే సమయంలో చాలామంది నీటిని తాగడం మర్చిపోతూ ఉంటారు. వాస్తవానికి నిద్రపోయే ముందు నీటిని తీసుకోవడం వల్ల హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ రాకుండా అడ్డుకోవచ్చు. నీరు తాగి నిద్రించడం వల్ల అప్పటికే తిన్నా ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. ఉదయం లేవగానే కడుపు ఖాళీగా ఉండడంతో ఎంతో ఉల్లాసంగా ఉండగలుగుతారు. అందువల్ల నిద్రపోయే ముందు తప్పనిసరిగా నీటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఆయా సమయాల్లో మాత్రమే కాకుండా మిగతా సమయాల్లో కూడా నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా వేసవికాలంలో శరీరం డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో దాహం వేయకముందే క్రమపద్ధతిలో నీటిని తీసుకుంటూ ఉండాలి. శరీరంలో ఎప్పుడు ఎక్కువ నీటి శాతం ఉంటే కొన్ని దీర్ఘకాలిక వ్యాధులను రాకుండా అడ్డుకోగలుగుతాం. అలాగే కిడ్నీ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.