
Drink Water : మనకు తిండి ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే. ప్రతిరోజు తగినంత నీరు తాగకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. సరైన పరిమాణంలో నీళ్లు తాగకపోతే అవయవాలు చెడిపోతాయి. కిడ్నీలు దెబ్బతింటాయి. దీంతో జీవితంలో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే నీళ్లు తాగేందుకు మనం ప్రాధాన్యం ఇవ్వాలి. లేదంటే మన జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. తగినన్ని నీళ్లు తాగకపోతే తిన్న ఆహారాలు జీర్ణం కావు. ఫలితంగా అజీర్తి సమస్య పెరుగుతుంది.
నిద్ర లేవగానే..
ఉదయం నిద్ర లేవగానే లీటరు పావు నీళ్లు తాగాలి. ఇలా తాగడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన మలినాలు బయటకు వెళతాయి. మలవిసర్జనలో ఇబ్బంది ఉండదు. మలబద్ధకం సమస్య రాదు. ఉదయం తాగే నీటితో మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీని వల్ల మనం దినచర్య నీళ్లతోనే ప్రారంభించాలి. ఉదయం మనం తాగే నీరు వల్ల మన శరీరం ఉత్తేజంగా మారుతుంది.

ఎప్పుడు తాగాలి?
కొందరు ఉదయం నిద్ర లేవగానే తాగుతారు. మరికొందరేమో బ్రష్ చేసుకున్నాక తాగుతారు. కానీ ఉదయం లేవగానే నీళ్లు తాగడం మంచి అలవాటు. అలా తాగితేనే మన రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. లేదంటే వీలు కాదు. బ్రష్ చేయక ముందు తాగితేనే లాభాలుంటాయి. దీని వల్ల ప్రయోజనాలు దక్కుతాయి. దీనికి అందరు అలవాటు చేసుకోవాల్సిందే. బ్రష్ చేసినప్పుడు మన పళ్లల్లో ఉన్న చెడు బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియా కూడా తొలగిపోవడంతో నీళ్లు తాగినా అంత లాభం ఉండదు.
గోరువెచ్చని నీరు
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకుని తాగితే మనకు చాలా రకాల రోగాల నుంచి ఉపశమనం పొందొచ్చు.మధుమేహం, రక్తపోటు వంటి రోగాలు కూడా నియంత్రణలో ఉంటాయి. అందుకే ఇలా ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే అనారోగ్యాలు దూరమవుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మనం తిన్న ఆహారాలు త్వరగా జీర్ణం కావాలంటే ఈ పరిహారం పాటించాల్సిందే.
పళ్లు తోముకోకుండానే..
పళ్లు తోముకోకుండానే నీళ్లు తాగడం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది. ఈ విషయం ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నీళ్లతో మన శరీరం ఎంతో ఉల్లాసంగా మారుతుంది. తిన్న ఆహారాలు జీర్ణం కావడంలో నీళ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందుకే ఉదయం నిద్ర లేవగానే పళ్లు తోముకోకుండానే నీళ్లు తాగి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.